సిర్పూర్, ఛత్తీస్గఢ్

సిర్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లా మహాసముంద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో, రాయ్పూర్ నుండి 78 కిలోమీటర్ల దూరంలో మహానది ఒడ్డున ఉన్న ఒక గ్రామం.[1]
పురాతన కాలంలో సిర్పూర్ పాండువంశి రాజవంశానికి రాజధానిగా ఉండేది. ఈ గ్రామంలో బౌద్ధ, హిందూ, జైన దేవాలయాలు, మఠాలతో కూడిన సిర్పూర్ స్మారక చిహ్నాల సమూహం ఉంది. ఇవి 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం నాటివి అని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అలాగే, ఇక్కడ జరిగిన తవ్వకాలలో 22 శివాలయాలు, 5 విష్ణు దేవాలయాలు, 12 బౌద్ధ విహారాలు, ఒక జైన విహారం బయటపడ్డాయి. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రాచీనమైన లక్ష్మణ దేవాలయంతో పాటు ఆనంద ప్రభు కుటి విహారం, అండర్ గ్రౌండ్ మార్కెట్, 6వ శతాబ్దం నాటి స్నానపు గదులు వంటివి పర్యాటకులను ఆకర్షిస్తాయి.
చరిత్ర
[మార్చు]
సిర్పూర్ గ్రామం పేరు, శ్రీపూర్, శ్రీపురా అని కూడా పిలువబడుతుంది (ప్రాచీన భారతీయ గ్రంథాలు, శాసనాలలో శ్రీపురం అంటే లక్ష్మి నగరం). ఇది మహానది నది వెంబడి ఉన్న ఒక ప్రధాన పురావస్తు ప్రదేశం. పురాతన కాలంలో సిర్పూర్ పాండువంశి రాజవంశానికి రాజధానిగా ఉండేది.
ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడుల ఆలయ శిధిలాలు, అలాగే శైవమతం, శక్తమతం, బౌద్ధమతం, జైనమతానికి సంబంధించినవి ఈ ప్రదేశంలో ఉన్నాయి. 1950 తరువాత, ముఖ్యంగా 2003 తరువాత ఈ ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో 22 శివాలయాలు, 5 విష్ణు దేవాలయాలు, 10 బుద్ధ విహారాలు, 3 జైన విహారాలు, 6వ/7వ శతాబ్దపు మార్కెట్, స్నాన-కుండ్ లభించాయి. ఈ ప్రదేశం విస్తృతమైన సమన్వయాన్ని చూపిస్తుంది, ఇక్కడ బౌద్ధ, జైన విగ్రహాలతో పాటు శివుడు, విష్ణువు, దేవి దేవాలయాలు ఉన్నాయి.
ఈ ప్రదేశం చైనీస్ యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ జ్ఞాపకాలలో మఠాలు, దేవాలయాల ప్రదేశంగా పేర్కొనబడింది. దీనిని 1872లో బ్రిటిష్ ఇండియా వలసరాజ్య అధికారి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ సందర్శించాడు. సిర్పూర్ లోని లక్ష్మణ దేవాలయంపై ఆయన ఇచ్చిన నివేదిక అంతర్జాతీయ దృష్టికి తీసుకువచ్చింది.
సంస్కృతి
[మార్చు]సిర్పూర్ జైన, బౌద్ధ, హిందూ మతాల అనుచరులకు పుణ్యక్షేత్రం. ఇది మహాశివరాత్రి సమయంలో ఒక ప్రధాన జాతరను నిర్వహిస్తుంది. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ఈ ఉత్సవం ఒక ప్రముఖ ఉదాహరణ.
రవాణా
[మార్చు]- సిర్పూర్ కు రాయ్పూర్ నుండి నాలుగు లేన్ల జాతీయ రహదారి 53 ద్వారా చేరుకోవచ్చు. రాయ్పూర్, సిర్పూర్ ల మధ్య బస్సు సౌకర్యం ఉంది.
- సమీప రైల్వే స్టేషన్ మహాసముంద్ రైల్వే స్టేషన్ 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- సమీప విమానాశ్రయం రాయ్పూర్ లోని స్వామి వివేకానంద విమానాశ్రయం, ఇక్కడికి భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి రోజువారీ విమానాలు ఉన్నాయి.