సిల్వర్(II)ఫ్లోరైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిల్వర్(II)ఫ్లోరైడ్
Silver(II) fluoride
పేర్లు
IUPAC నామము
silver(II) fluoride
ఇతర పేర్లు
silver difluoride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7783-95-1]
పబ్ కెమ్ 82221
యూరోపియన్ కమిషన్ సంఖ్య 232-037-5
SMILES [Ag+2].[F-].[F-]
ధర్మములు
AgF2
మోలార్ ద్రవ్యరాశి 145.865 g/mol
స్వరూపం white or grey crystalline powder, hygroscopic
సాంద్రత 4.58 g/cm3
ద్రవీభవన స్థానం 690 °C (1,274 °F; 963 K)
బాష్పీభవన స్థానం 700 °C (1,292 °F; 973 K) (decomposes)
Decomposes violently
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
orthorhombic
కోఆర్డినేషన్ జ్యామితి
tetragonally elongated
octahedral coordination
linear
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు toxic, reacts violently
with water, powerful oxidizer
భద్రత సమాచార పత్రము MSDS
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Copper(II) fluoride
Palladium(II) fluoride
Zinc fluoride
Cadmium(II) fluoride
Mercury(II) fluoride
సంబంధిత సమ్మేళనాలు
Silver subfluoride
Silver(I) fluoride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is ☑Y

☒N ?)

Infobox references

సిల్వర్(II)ఫ్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.వెండి/సిల్వర్, ఫ్లోరిన్ పరమాణువుల సంయోగం వలన సిల్వర్(II)ఫ్లోరైడ్ ఏర్పడినది. ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేతపదం AgF2. ఈ సమ్మేళనపదార్థంలో వెండిఅణువు +1 ఆక్సీకరణస్థాయిలో ఉండును. సిల్వర్(II)ఫ్లోరైడ్ ను ఫ్లోరినేటింగు కారకంగా ఉపయోగిస్తారు.

భౌతిక ధర్మాలు[మార్చు]

సిల్వర్(II)ఫ్లోరైడ్ స్పటిక నిర్మాణమున్న ఘనపదార్థం.సిల్వర్(II)ఫ్లోరైడ్ తెల్లగా లేదా గ్రే రంగులో, స్పటికాలుగాఏర్పడును.శుద్ధమైన సిల్వర్(II)ఫ్లోరైడ్ తెల్లగా ఉండును. మాలినాలున్నచో నల్లగా లేదా బ్రౌనురంగులో ఉండును. ఇది ఆర్ద్రాకర్షణ (hygroscopic) కలిగిన రసాయన సమ్మేళనపదార్థం. సిల్వర్(II)ఫ్లోరైడ్ అణుభారం 145.865 గ్రాములు/మోల్. 25 °C వద్ద సిల్వర్(II)ఫ్లోరైడ్ సాంద్రత 4.58 గ్రాములు/సెం.మీ3. సిల్వర్(II)ఫ్లోరైడ్ ద్రవీభవన స్థానం 690 °C (1,274 °F; 963 K). అలాగే బాష్పీభవన స్థానం 700 °C (1,292 °F; 973K),ఈ ఉష్ణోగ్రత వద్ద సిల్వర్(II)ఫ్లోరైడ్ వియోగం చెందును. నీటితో తీవ్రంగా చర్య జరిగి వియోగం చెందును. సిల్వర్(II)ఫ్లోరైడ్ సాధారణ పరిస్థితులలో పారా మాగ్నటిక్ గుణాలను కలిగి ఉండును. కాని -110 °C వద్ద ఫెర్రో మాగ్నటిక్ గుణాలను పొందును.

ఉత్పత్తి[మార్చు]

సిల్వర్(II) ఆక్సైడ్ ను మూలక ఫ్లోరిన్ తో ఫ్లోరినేటింగ్ చేయ్యడం వలన ఉత్పత్తి చేయవచ్చును., 200 °C (473 K) వద్ద మూలక ఫ్లోరిన్ సిల్వర్(I) ఫ్లోరైడ్(AgF)లేదా సిల్వర్ క్లోరైడ్ (AgCl )తో రసాయన చర్య జరపడం వలన కూడా సిల్వర్(II) ఆక్సైడ్ ను ఉత్పత్తి చేయ వచ్చును.సిల్వర్(II) ఆక్సైడ్ బలమైన/శక్తి వంతమైన ఫ్లోరినేటింగు కారకం అవ్వడం వలన,ఈ రసాయాన సమ్మేళనాన్ని టెప్లాన్ లేదా పాస్సివేటేడ్ లోహపాత్ర (passivated metal container)లోభద్రంగా నిల్వ ఉంచేదరు.ఇది కాంతికి స్పందిచే గుణమున్న రసాయనం.

ఉపయోగాలు[మార్చు]

సిల్వర్(II) ఆక్సైడ్ బలమైన/శక్తి వంతమైన ఫ్లోరినేటింగు కారకం, ఆక్సీకరణ కారకం కూడా.సిల్వర్ అయానులతో సిల్వర్(II) ఆక్సైడ్ AgF−3, నీలి-ఊదా AgF2−4, AgF4−6వంటి సంక్లిష్టమైన సమ్మేళనాలను ఏర్పరచును.సేంద్రియ పెర్‌ఫ్లోరో సమ్మేళనాలను తయారుచేయుటలో,ఫ్లోరినేసన్ చేయుటలో సిల్వర్(II) ఆక్సైడ్ ను ఉపయోగిస్తారు.ఈ రకమైన రసాయన చర్య మూడు విభిన్నమైన విదానాలలో జరుగును(దిగువ సమీకరణాలలో Z అక్షరం కార్బనుకు అనుసంధానింపబడిన మూలకం లేదా సమూహాన్ని తెలుపగా,X అను అక్షరము హలోజన్ ను తెలుపుతున్నది).

1. CZ3H + 2 AgF2 → CZ3F +HF + 2 AgF
1. CZ3X + 2AgF2 → CZ3F +X2 + 2 AgF
3. Z2C=CZ2 + 2 AgF2 → Z2CFCFZ2 + 2 AgF
4. CZ3H + 2 AgF2 → CZ3F +HF + 2 AgF
5. CZ3X + 2AgF2 → CZ3F +X2 + 2 AgF
6. Z2C=CZ2 + 2 AgF2 → Z2CFCFZ2 + 2 AgF
7. CZ3H + 2 AgF2 → CZ3F +HF + 2 AgF
8. CZ3X + 2AgF2 → CZ3F +X2 + 2 AgF
9. Z2C=CZ2 + 2 AgF2 → Z2CFCFZ2 + 2 AgF

ఇటువంటి రసాయన పరివర్తానాలను,ఎక్కువ వేలన్సీ లోహ ఫ్లోరైడు లైన CoF3, MnF3, CeF4, లను ఉపయోగించి పొంద వచ్చును. అలాగే ఆరోమాటిక్ సమ్మేళనాల ఫ్లోరోనేసన్ ను PbF4.AgF2 సమ్మేలనాలనుపయోగించి చేయుదురు.

C6H6 + 2 AgF2 → C6H5F + 2 AgF + HF

అనార్ద్ర HF ద్రావణంలో క్షెనొన్(xenon) ను సిల్వర్(II) ఆక్సైడ్ క్షెనొన్ డైఫ్లోరైడ్ గా మార్చును.

2 AgF2 + Xe → 2 AgF + XeF2

కార్బన్ మొనాక్సైడును సిల్వర్(II) ఆక్సైడ్ కార్బోనైల్ ఫ్లోరైడ్‌గా పరివర్తించును.

2 AgF2 + CO → 2 AgF + COF2

సిల్వర్(II) ఆక్సైడ్ నీటితో చర్య జరపడం వలన ఆక్సిజన్ వాయువు విడుదల అగును.

4 AgF2 + 4 H2O → 2 Ag2O + 8 HF + O2

భద్రత[మార్చు]

సిల్వర్(II) ఆక్సైడ్ బలమైన/శక్తివంతమైన ఆక్సికరణి,నీటితో తీవ్రస్థాయిలో చర్య జరుపును.బలహీనమైన ఆమ్లాలతో చర్యవలన ఓజోన్ ను ఉత్పత్తి చేయును.అలాగే అయోడైడ్ ను అయోడిన్ గా అక్సికరించును.అసిటిలిన్ తో సంపర్కం వలన ప్రేలుడు స్వాభావమున్న సిల్వర్ అసిటైలిడ్(ilver acetylide)ను ఏర్పరచును. ఇది ఆర్ద్రాకర్షణ (hygroscopic) కలిగిన పదార్థాలను క్షయిచు/తినివేయు గుణం కలిగి ఉన్నది.హైడ్రోజన్ పెరాక్సైడ్ తో సంపర్కం వలన తీవ్రంగా వియోగం/విఘటన చెంది ఆక్సిజన్ వాయువును విడుదల చేయును.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]