సిసిలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిసిలీ [Sicily]

సిసిలియా
Flag of సిసిలీ [Sicily]
పతాకం
Coat of arms of సిసిలీ [Sicily]
Coat of arms
Sicily in Italy.svg
CountryItaly
Capital[[పలేర్మో]]
ప్రభుత్వం
 • PresidentRosario Crocetta (PD )
విస్తీర్ణం
 • మొత్తం25,711 కి.మీ2 (9,927 చ. మై)
జనాభా
(30 ఏప్రిల్ 2012)
 • మొత్తం5,043,480
 • సాంద్రత200/కి.మీ2 (510/చ. మై.)
పిలువబడువిధం (ఏక)Sicilian(s) / Siciliano / Siciliani
Citizenship
 • Italian98%
కాలమానంUTC+1 (CET)
 • వేసవికాలం (DST)UTC+2 (CEST)
GDP/ Nominal€84.5[2] billion (2008)
GDP per capita€17.488[3] (2008)
NUTS RegionITG
జాలస్థలిpir.regione.sicilia.it

సిసిలీ : మధ్యధరా సముద్రం (మెడిటరేనియన్ సముద్రం) లోని అతి పెద్ద ద్వీపం సిసిలీ. క్రీస్తు పూర్వం 8000 నుంచే ఇక్కడ మనుషులు జీవించిన దాఖలాలున్నాయి. క్రీస్తు పూర్వం 750లో ఇది గ్రీక్ కాలనీగా ఉండేది. మాఫియా ఇక్కడే పుట్టింది. ఈ రోజుకీ మాఫియా నేర చరిత్రగల వ్యక్తులు ఇటలీ, అమెరికా ఇంకా మరి కొన్ని దేశాల్లో ఉన్నారు. 1946లో ఇటాలియన్ రిపబ్లిక్ స్థాపించబడ్డాక సిసిలీకి స్వయం ప్రతిపత్తి కలిగింది. సంగీతం, ఆర్కిటెక్చర్, భాష, వంటకాల విషయంలో సిసిలీ పేరుపొందింది.

సిసిలో చూడదగ్గ కొన్ని విశేషాలు[మార్చు]

అగ్నిపర్వతాలు:[మార్చు]

ఎత్నా, ట్రోంబోలీ అనే అగ్నిపర్వతాలు సిసిలీ ద్వీపం ఉత్తర దిశలో ఉన్నాయి. గైడ్ సహాయంతో ట్రోంబోలీ అగ్నిపర్వతం మీదకి ఎక్కవచ్చు. ఒకవైపు వేడి లావా కారిన గుర్తులని గైడ్ చూపిస్తాడు. 2002లో వౌంట్ ఎత్నా బద్దలైంది. ఇక్కడ బీచ్‌లలోని ఇసుక నల్లగా ఉండడానికి కారణం ఆ బూడిదే. ఎత్నా యూరప్‌లోని అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇక్కడ వేడినీటి బుగ్గలు కూడా ఉన్నాయి. యూరప్‌లో ప్రస్తుతం ఏక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతం ఎత్నానే. సమీపంలోని నెబ్రోడీ-మడోనీ పార్క్‌లని కూడా చూడవచ్చు. అత్యంత పురాతన రాతి ఇళ్లు అల్కాంతర రివర్ పార్కు మొదలైనవి కూడా చూడవచ్చు.

సెయింట్ జాన్స్ చర్చ్:[మార్చు]

క్రిస్టియన్స్ అధికంగా ఆరాధించే సెయింట్ పాల్ ఇక్కడి సెయింట్ జాన్స్ చర్చ్‌లో కొంత కాలం బోధనలు చేశాడు. రోమ్‌లో రెండేళ్లపాటు హౌస్ అరెస్టులో ఉన్నాక క్రీ.శ. 64లో ఆయనకి అక్కడ మరణ శిక్ష విధించారు. అదేచోట నేటి రోమ్ సెయింట్ పాల్ ఆఫ్ ది త్రీ ఫౌంటెన్స్ అనే ఫౌంటెన్‌ని ఆయన గుర్తుగా ఏర్పాటు చేశారు. ఐనప్పటికీ భక్తులు సెయింట్ పాల్‌ని అక్కడకన్నా సిసిలీలోని ఈ చర్చ్‌కి వచ్చే అధికంగా కొలుస్తారు. పుట్టుకతో యూదు మతస్తుడైన సెయింట్ పాల్ క్రిస్టియన్ మత ప్రచారం అధికంగా చేశాడు. నేటి టర్కీలోని సాల్ అనే చోట జన్మించిన సెయింట్ పాల్ పేర ప్రపంచంలో అత్యధిక చర్చ్‌లు ఉన్నాయి. ఫోంటానా ప్రిటోరియా: పాతెర్మో సిటీ హోల్ స్క్వేర్‌లోని ఈ ఫౌంటెన్‌ని 1570లో నిర్మించారు. దీని చుట్టూ నగ్న విగ్రహాలను ఉంచడంతో దీనికి ‘్ఫంటెన్ ఆఫ్ షేమ్’ అనే ముద్దు పేరు ఉంది. పర్యాటకులు సాధారణంగా ఇక్కడ ఫోటోలు తీయించుకుంటారు. రినైసెన్స్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించబడ్డ ఇది ఫ్లోరెన్స్‌లోని బేకియో అనే ఫౌంటెన్‌ని పోలి ఉంటుంది. కారణం దీన్ని నిర్మించిన వ్యక్తి చాలాకాలం ఫ్లోరెన్స్‌లో నివసించడమే. ఈ నగ్న విగ్రహాల్లో రాక్షసులు, దేవతలు, పురాణ పాత్రలు ఉన్నాయి.

సియేసా డిసేమ్ డొమెనికో:[మార్చు]

1640లో నిర్మించబడ్డ ఓ కేథడ్రల్ ఇది. 1726లో ఈ చర్చిలోని కొంత భాగాన్ని కూల్చేసి, నాలుగు రోడ్ల కూడలిని పెంచారు. ఇటాలియన్ ప్రముఖుల మృత దేహాలని ఈ చర్చిలో ఖననం చేసారు. రాజకీయ నాయకులు, కళాకారులు, ఇంకా మాజీ ఇటాలియన్ ప్రధానమంత్రి ఫ్రానె్సస్కో క్రిస్పీ, చిత్రకారుడు పియట్రోనోలెలీ, పార్లమెంట్ సభ్యుడు రుజెరోసెటిమో మొదలైనవారి మృతదేహాలని ఇక్కడ ఖననం చేశారు.

ఆర్టోబొటానికో:[మార్చు]

ఇటలీలో ఈ పేరుతో అనేక ప్రదేశాల్లో బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. సిసిలీలోని యూనివర్సిటీ ఆఫ్ మెసీనా నిర్వహించే ఈ బొటానికల్ గార్డెన్స్‌ని 1638లో పోర్టలెజ్నీ నది పక్కన ఆరంభించారు. 1678లో స్పానిష్ సైన్యం దీన్ని, యూనివర్సిటీని నాశనం చేసింది. 1889లో మళ్లీ దీన్ని ఆరంభించారు. కానీ 1908లో వచ్చిన భూకంపంలో మళ్లీ ఇది నాశనమైంది. నేడు అక్కడ ఉన్నది పునర్‌నిర్మించిన బొటానికల్ గార్డెన్స్. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకి చెందిన మొక్కల, వృక్షాల సంతతిని ఇక్కడ చూడవచ్చు. క్వార్టోకాంటీ: దీన్ని పియోజా విజిలేనా అని కూడా పిలుస్తారు. ఇది సిసిలీలోని పాలెర్మా అనేచోట గల బరోక్యూస్క్వేర్. రెండు ప్రధాన వీధులు క్రాస్ అయ్యేచోట 1620లో అప్పటి వైస్‌రాయ్ జియాలియోలాసో దీన్ని నిర్మించాడు. ప్రస్తుతం నక్షత్రాకారంలో ఉన్న ఈ స్క్వేర్‌కి నాలుగు వైపులా వీధులు, మిగిలిన మూలల్లో పురాతన బరోక్సూ భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు ఒక్కోటి నాలుగు అంతస్తులు ఉంటాయి. దీని నిర్మాణం జరిగినప్పుడు యూరప్‌లో టౌన్ ప్లానింగ్‌కి గొప్ప ఉదాహరణగా ఇది విరాజిల్లేది. ఆ పురాతన భవంతుల్లోని రెండు, నాలుగు అంతస్తుల్లో ఫౌంటెన్స్ ఉండడం విశేషం.

టియాట్రోమాసిమో:[మార్చు]

ఇది పాలెర్మాలోగల ఓప్రాహౌస్. కింగ్ విక్టర్ ఇమ్మాన్యుయేల్ ఒన్‌కి అంకితమివ్వబడ్డ ఇది ఇటలీలోని అతి పెద్ద ఆప్రా హౌస్. యూరప్‌లో నాలుగవ పెద్ద భవనం. 1864లో దీన్ని ఆనాటి మేయర్ నిర్మించాడు. ఒకేసారి మూడువేల మంది కూర్చునే కెపాసిటీ గల దీంట్లో నేడు కేవలం 1350 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇది ఏటవాలుగా ఏడు వరసలు పైకి ఉంటాయి. 1974లో రిపేర్లకి మూసేసిన దీన్ని మళ్లీ 1997లో కానీ తెరవలేదు. ‘గాడ్ ఫాదర్ పార్ట్ త్రీ’ సినిమా చివరి సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. సిసిలీలో ఇంకా ఆక్రోపోలిస్ ఆలయం, ఫోసాడి వల్కనో, బసిలికాడి శాన్‌జియోవన్నీ, సిసియా డిసాన్ నికోలో అల్‌అరీనా, డియోసిసియానో మ్యూజియం, వయారోమా కెథడ్రిల్, పియానో ప్రొవెంజానో అగ్నిపర్వతం, కేట్లాపలాటినా, లాటామియాడెల్ పేరమిజో, కేస్టిల్‌బేనో కేజిల్, ఆర్కియాజికల్ పార్క్ మొదలైనవి చూడదగ్గవి.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

ఇక్కడి పాలెర్మో లేదా కెటానియా విమానాశ్రయాలకి రోమ్ ఇంకా యూరప్‌లోని ఇతర విమానాశ్రయాలనుంచి విమానం ద్వారా చేరుకోవచ్చు. లేదా రోమ్, నేపుల్స్, మిలన్‌లనుంచి రైల్లో రావచ్చు. జూన్‌నుంచి సెప్టెంబర్ దాకా టూరిస్ట్ సీజన్.


మూలాలు[మార్చు]

  1. "Statistiche demografiche ISTAT". Demo.istat.it. Archived from the original on 21 January 2012. Retrieved 23 April 2010. CS1 maint: discouraged parameter (link)
  2. "Eurostat – Tables, Graphs and Maps Interface (TGM) table". Epp.eurostat.ec.europa.eu. 11 March 2011. Retrieved 2 June 2011. CS1 maint: discouraged parameter (link)
  3. [1] Archived 2015-04-02 at the Wayback Machine. qds.it (2011-02-24). Retrieved on 2012-12-18.

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సిసిలీ&oldid=2959090" నుండి వెలికితీశారు