సి.ఆర్ నరసింహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రవర్తి రాజగోపాలాచారి నరసింహన్
లోక్ సభ సభ్యుడు
In office
1952–1962
ప్రధాన మంత్రిజవహర్ లాల్ నెహ్రూ
తరువాత వారుకె. రాజారాం
నియోజకవర్గంకృష్ణగిరి (లోక్ సభ నియజకవర్గం)
వ్యక్తిగత వివరాలు
జననం1909
మరణం1989 (aged 79–80)
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులుసి. రాజగోపాలాచారి
అలమేలు మంగలమ్మ
నైపుణ్యంరాజకీయ నాయకుడు

చక్రవర్తి రాజగోపాలాచారి నరసింహన్ ( సి.ఆర్ నరసింహన్) (1909-1989) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. 1952, 1962 మధ్య పనిచేసిన భారత పార్లమెంటు సభ్యుడు. అతను భారతదేశ మొదటి, చివరి గవర్నర్ జనరల్ అయిన చక్రవర్తి రాజగోపాలాచారి కుమారుడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

1909 లో తమిళనాడు, సేలం జిల్లాలోని దొరపల్లి అగ్రహారం అనే గ్రామంలో చక్రవర్తి రాజగోపాలాచారి, చక్రవర్తి అలమేలు మంగమ్మ దంపతులకు నరసింహన్ జన్మించాడు. రాజగోపాలాచారి ఆ సమయంలో న్యాయవాది, సేలం మునిసిపాలిటీ సభ్యుడుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నరసింహన్ 1920 లో 11 సంవత్సరాల వయస్సులోనే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు. 1930లో వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యాడు.[2]

కుటుంబం

[మార్చు]

నరసింహన్ వివాహం చేసుకోలేదు. జీవితాంతం ఒంటరిగా ఉన్నాడు. అతను రాజ్‌మోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీ, రామచంద్ర గాంధీ, తారా (భట్టాచార్య) లకు మేనమామ.

స్వాతంత్ర్యానంతర రాజకీయాలు

[మార్చు]

1951 లో, నరసింహన్ కృష్ణగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి, తన ప్రత్యర్థి సి. దొరైసామి గౌండర్‌పై 6,194 ఓట్ల మెజారిటీతో పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు. తిరిగి 1957 లో తన ప్రత్యర్థి జి. డి. నాయుడు పై 367 ఓట్ల మెజారిటీతో మళ్ళీ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1962లో ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకి చెందిన కె. రాజారామ్ చేతిలో ఓడిపోయాడు.

1970 లో, మద్రాసు కార్పొరేషన్‌కు నరసింహన్ ఎన్నికయి, 1975 వరకు పనిచేశాడు. కార్పొరేషన్‌లో స్వతంత్ర పార్టీ నాయకుడుగా కొనసాగాడు.

నరసింహన్ ఛైర్మన్ గా, గాంధీ ఆశ్రమ సభ్యుడిగా, తిరుచెంగోడ్ లో సభ్యుడిగా, తమిళనాడు నిషేధ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు.[3]

మరణం

[మార్చు]

నరసింహన్ 1989 లో 80 సంవత్సరాల వయసులో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Elections 1951 to the First Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 4 అక్టోబరు 2021.
  2. "Statistical Report on General Elections 1957 to the Second Lok Sabha" (PDF). Election Commission of India.
  3. "Statistical Report on General Elections 1962 to the Second Lok Sabha" (PDF). Election Commission of India.