Jump to content

సి.ఎం. ఉదాసి

వికీపీడియా నుండి
చన్నబసప్ప మహాలింగప్ప ఉదాసి

పదవీ కాలం
2008 మే 30 – 2013 జనవరి 23

గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2006 ఫిబ్రవరి 18 – 2007 అక్టోబర్ 8

పదవీ కాలం
2018 – 2021
ముందు మనోహర్ తహశీల్దార్
తరువాత శ్రీనివాస్ మానే
నియోజకవర్గం హంగల్
పదవీ కాలం
2004 – 2013
ముందు మనోహర్ తహశీల్దార్
తరువాత మనోహర్ తహశీల్దార్
నియోజకవర్గం హంగల్
పదవీ కాలం
1994 – 1999
ముందు మనోహర్ తహశీల్దార్
తరువాత మనోహర్ తహశీల్దార్
నియోజకవర్గం హంగల్
పదవీ కాలం
1983 – 1989
ముందు మనోహర్ తహశీల్దార్
తరువాత మనోహర్ తహశీల్దార్
నియోజకవర్గం హంగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1937-02-02)1937 ఫిబ్రవరి 2
హంగల్
మరణం 2021 జూన్ 8(2021-06-08) (వయసు: 84)
బెంగళూరు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతా పార్టీ
జనతాదళ్
జనతాదళ్ (యునైటెడ్)
కర్ణాటక జనతా పక్ష
సంతానం శివకుమార్ ఉదాసి
నివాసం హంగల్ , కర్ణాటక
వృత్తి రాజకీయ నాయకుడు

చన్నబసప్ప మహాలింగప్ప ఉదాసి (1937–2021) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు హంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హెచ్‌.డి. కుమారస్వామి & బి.ఎస్. యడియూరప్పల మంత్రివర్గాలలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, చిన్న నీటిపారుదల, చేనేత & జౌళి, ప్రజా పనుల శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సి.ఎం. ఉదాసి 1983 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1985 ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థిగా, 1994 ఎన్నికలలో జనతా దళ్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికై 1999లో జనతా దళ్ విడిపోయినప్పుడు మొదట్లో జనతాదళ్ (యునైటెడ్)లో చేరి ఆ తరువాత భారతీయ జనతా పార్టీ చేరాడు.

సి.ఎం. ఉదాసి 2004, 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా గెలిచి బి.ఎస్. యడియూరప్ప బీజేపీని విడిచిపెట్టి[1] కెజెపిని స్థాపించినప్పుడు ఆయనతో ఆ పార్టీలో చేరి 2013 ఎన్నికలలో కేజీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత యడియూరప్పతో కలిసి బిజెపిలో చేరి 2018 ఎన్నికలలో ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మంత్రిగా

[మార్చు]

ఉదాసి 2006లో హెచ్‌.డి. కుమారస్వామి నేతృత్వంలోని జెడి (ఎస్) - బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో ఉదాసి గ్రామీణాభివృద్ధి మంత్రిగా, 2008 బిఎస్ యెడియూరప్ప మంత్రివర్గంలో ప్రజా పనుల మంత్రిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

సి.ఎం. ఉదాసి 85 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 జూన్ 8న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు శివకుమార్ ఉదాసి ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Two Yeddyurappa loyalists to quit BJP, likely to join his party" (in ఇంగ్లీష్). India Today. 15 January 2013. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
  2. ↑ "Senior Karnataka BJP MLA C M Udasi passes away" (in ఇంగ్లీష్). Telangana Today. 8 June 2021. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.
  3. ↑ "C.M. Udasi passes away" (in Indian English). The Hindu. 8 June 2021. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.