సి.ఎస్.కృష్ణ అయ్యర్
సి.ఎస్.కృష్ణ అయ్యర్ | |
|---|---|
| జననం | మార్చి 23, 1916 |
| మరణం | 1998 |
| వృత్తి | కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, సంగీత గురువు |
సి.ఎస్.కృష్ణ అయ్యర్(1916-1998) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు కేరళ రాష్ట్రంలో పాలక్కాడు సమీపంలోని కల్పతి గ్రామంలో 1916, మార్చి 23న జన్మించాడు[1]. ఇతడు గాత్ర సంగీతాన్ని టి.ఎస్.సభేశ అయ్యర్, టైగర్ వరదాచారి, తంజావూరు కె.పొన్నయ్య పిళ్ళైల వద్ద చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాలలో నేర్చుకున్నాడు. ఇతడు తన మొదటి సంగీత ప్రదర్శన 1937లో ఇచ్చాడు. ఇతడు తంజావూరు సంప్రదాయ శైలిలో పాడేవాడు. ఇతడు మలయాళంలో ఎన్నో కృతులకు రాగాలను సమకూర్చాడు[2]. ఇతడు సంగీత గురువుగా అనేక సంవత్సరాలు అనేక మందికి సంగీతం నేర్పాడు. ఇతడు తిరువంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో 1942లో అధ్యాపకుడిగా చేరాడు. తరువాత పాలక్కాడులోని చెంబై సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.[3] కె. జె. ఏసుదాసు, కె.వి.నారాయణస్వామి, రాజేశ్వరి సతీష్, అంబికాపురం జి.కె.శివరామన్, సాదనం హరికుమార్ మొదలైన వారు ఇతని శిష్యులలో కొంతమంది. ఇతనికి 1972లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు, 1994లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించాయి. 1994లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ఇతనికి ప్రదానం చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ web master. "C. S. Krishna Iyer". SANGEET NATAK AKADEMI. Government of India. the original నుండి 9 మార్చి 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 February 2021.
- ↑ రాజేశ్వరీ సతీష్. "C.S. KRISHNA IYER (1916 – 1998)". Rajeswari Satish. Rajeswari Satish. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 February 2021.
- ↑ Ashok Madhav. "Great Composers of Kerala Desham". Carnatic Corner. Mohan Ayyar. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 February 2021.