సి.బాగన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.బాగన్న

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం జహీరాబాద్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1939
జహీరాబాద్ , మెదక్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
మరణం 26 ఫిబ్రవరి 2021
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం ఇద్దరు కుమారులు గోపాల్, రాజశేఖర్, ఇద్దరు కుమార్తెలు పద్మమ్మ, అనూశమ్మ
నివాసం హైదరాబాద్

చంగల్‌ బాగన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జహీరాబాద్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం[మార్చు]

సి.బాగన్న 1939లో తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, జహీరాబాద్లో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బాగన్న తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1984 నుంచి 1989 వరకు ఎంపీపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.నర్సింహారెడ్డిపై 34970 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఆయనకు 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు, తిరిగి 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ చేతిలో 12863 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. బాగన్న 2008లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీలో తరపున జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలై, 50189 ఓట్లు పొంది నాలుగోవ స్థానంలో నిలిచాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

మరణం[మార్చు]

సి.బాగన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 ఫిబ్రవరి 26న మరణించాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (27 February 2021). "జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మృతి". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
  2. Telangana Today (27 February 2021). "Former Zaheerabad MLA Chengal Baganna passes away". Archived from the original on 28 జూలై 2021. Retrieved 28 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=సి.బాగన్న&oldid=4054374" నుండి వెలికితీశారు