అశ్వనీ దత్
అశ్వనీ దత్ | |
|---|---|
| జననం | birth_date - 1950 సెప్టెంబరు 15 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
| వృత్తి | సినీ నిర్మాత, పంపిణీదారు |
| పిల్లలు | స్వప్న దత్, ప్రియ దత్, స్రవంతి దత్ |
| బంధువులు | నాగ్ అశ్విన్, ప్రసాద్ వర్మ (అల్లుళ్ళు) |
అశ్వనీ దత్ ప్రముఖ సినీ నిర్మాత. వైజయంతీ మూవీస్ పేరుతో పలు సినిమాలు నిర్మించాడు. విజయవాడలో జన్మించిన ఈయన ఎన్. టి. ఆర్ మీద అభిమానంతో చిన్న వయసు నుంచే నిర్మాతగా మారాడు. ఈయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఇద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు.
వ్యక్తిగత వివరాలు
[మార్చు]అశ్వనీ దత్ విజయవాడలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి అప్పట్లో ఎ క్లాస్ కాంట్రాక్టరు. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ఏళ్ళు కలింగ పైప్స్ కు ఏకైక పంపిణీదారుగా ఉన్నాడు. రచయిత, దర్శకుడు జంధ్యాల ఈయనకు బాల్య స్నేహితుడు. అశ్వనీదత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ప్రియాంక దత్, స్వప్న దత్. వీరిద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు. ప్రియాంక దత్ దర్శకుడు నాగ్ అశ్విన్ ను 2015 లో వివాహం చేసుకుంది.[1][2] ఇక స్రవంతి దత్ హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్త.
సినిమా కెరీర్
[మార్చు]ఈయన చిన్న వయసులోనే నిర్మాతగా మారాడు. ఎన్. టి. ఆర్ కు అభిమాని. 1975 లో ఎన్. టి. ఆర్ కథానాయకుడిగా వచ్చిన ఎదురు లేని మనిషి వైజయంతీ మూవీస్ తొలి సమర్పణ. ఈ సినిమా వంద రోజులు ఆడింది.[3]
నిర్మించినవి
[మార్చు]వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన సినిమాలు.
| సంవత్సరం | సినిమా | గమనికలు |
|---|---|---|
| 1975 | ఎదురులేని మనిషి | తెలుగు సినిమా రంగ ప్రవేశం |
| 1978 | యుగ పురుషుడు | |
| 1981 | గురు శిష్యులు | |
| 1983 | అడవి సింహాలు | |
| 1985 | అగ్ని పర్వతం | |
| 1986 | బ్రహ్మ రుద్రులు | |
| 1988 | ఆఖరి పోరాటం | |
| 1990 | జగదేక వీరుడు అతిలోక సుందరి | |
| 1992 | అశ్వమేధం | |
| 1994 | గోవిందా గోవిందా | |
| శుభలగ్నం | ||
| 1998 | చూడాలని వుంది | |
| 1999 | రాజకుమారుడు | |
| రావోయి చందమామ | ||
| 2000 | ఆజాద్ | |
| 2001 | ప్రేమక్కే సాయి | కన్నడ సినిమాలో అరంగేట్రం |
| 2002 | కంపెనీ | హిందీ చిత్రసీమలో అరంగేట్రం |
| ఇంద్రుడు | ||
| 2005 | బాలు ABCDEFG | |
| సుభాష్ చంద్రబోస్ | ||
| జై చిరంజీవ | ||
| 2006 | సైనికుడు | |
| 2007 | చిరుత | |
| 2008 | కథానాయకుడు | కుసేలన్‌తో ఏకకాలంలో రూపొందించబడింది |
| కంత్రి | ||
| 2011 | శక్తి | |
| 2018 | మహానటి | |
| దేవదాస్ | [4] | |
| 2019 | మహర్షి | |
| 2022 | సీతా రామం | |
| 2024 | కల్కి 2898 ఏ.డీ[5] |
స్వప్న సినిమా
| సంవత్సరం | సినిమా |
|---|---|
| 2001 | స్టూడెంట్ నెం: 1 |
| 2002 | ఒకటో నంబర్ కుర్రాడు |
| 2015 | ఎవడే సుబ్రహ్మణ్యం |
| 2018 | మహానటి |
| 2021 | జాతి రత్నాలు |
| 2022 | సీతా రామం |
| 2023 | అన్నీ మంచి శకునములే |
రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్, సిరి మీడియా ఆర్ట్స్, యునైటెడ్ ప్రొడ్యూసర్స్ (అశ్వని దత్, అల్లు అరవింద్, కె. రాఘవేంద్రరావు)
| సంవత్సరం | సినిమా |
|---|---|
| 1996 | పెళ్లి సందడి |
| 1997 | మేరే సప్నో కి రాణి (హిందీ) |
| 1998 | పరదేశి |
| నినైతెన్ వంధై (తమిళం) | |
| 2003 | పెళ్ళాం ఊరెళితే |
| గంగోత్రి | |
| కలకత్తా మెయిల్ (హిందీ) | |
| 2004 | ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి |
శ్రీ ప్రియాంక పిక్చర్స్
| విడుదల సంవత్సరం | సినిమా పేరు |
|---|---|
| 1994 | శుభలగ్నం |
రోజా ఆర్ట్ ప్రొడక్షన్స్
| విడుదల సంవత్సరం | సినిమా పేరు |
|---|---|
| 1983 | జానీ దోస్త్ (హిందీ) |
మూలాలు
[మార్చు]- ↑ "Director Nag Ashwin to wed Ashwini Dutt's daughter Priyanka". Indian Express. 10 October 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 June 2018.
- ↑ Eenadu (25 September 2022). "పుత్రికోత్సాహం". the original నుండి 25 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 September 2022.
- ↑ "ఈ పాటకి నేను డ్యాన్స్ చేయాలా? : ఎన్టీఆర్". sitara.net. ఈనాడు. the original నుండి 14 అక్టోబరు 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 June 2018.
- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. ఒరిజినల్ నుండి 29 మార్చి 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 April 2020.
- ↑ Andhrajyothy (30 June 2024). "తెలుగు సినిమాగతిని 'కల్కి' మార్చేసింది..!". the original నుండి 30 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 June 2024.