సి. ఆనందారామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.ఆనందారామం
జననంఆనందలక్ష్మి
(1935-08-20)1935 ఆగస్టు 20
India ఏలూరు,పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2021 ఫిబ్రవరి 10
India

హైదరాబాద్,రంగారెడ్డి జిల్లా,

తెలంగాణ రాష్ట్రం
వృత్తిఅధ్యాపకురాలు
ప్రసిద్ధికథా రచయిత్రి, నవలా రచయిత్రి
పదవి పేరుప్రొఫెసర్
మతంహిందూ
భార్య / భర్తచిలకమఱ్ఱి రామం
పిల్లలుఇద్దరుకుమారులు
తండ్రిముడుంబై రంగాచార్యులు
తల్లిగోపాలమ్మ

సి.ఆనందారామం ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో జన్మించేరు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శ గ్రంథాలు రాసేరు. ఈమె వ్రాసిన నవల ఆత్మబలి సంసార బంధం సినిమాగా, అదే నవల జీవనతరంగాలు టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి[1] సినిమాగా తీశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పాస్ అయ్యింది. బి.ఏ. పూర్తయ్యాక సి.ఆర్.ఆర్. కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేసింది. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాం మార్చింది. 1958-60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివింది.సి.నారాయణరెడ్డి గైడుగా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సంపాదించింది. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా పనిచేసింది. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీవిరమణ చేసింది.

రచనలు

[మార్చు]

నవలలు

[మార్చు]
 1. రేపటి మహిళ[2]
 2. సంపెంగ పొదలు -1962
 3. ఆత్మబలి -1966
 4. జాగృతి
 5. మమతల కోవెల
 6. తపస్వి
 7. ఇంద్ర సింహాసనం
 8. శారద
 9. వర్షిణి
 10. గర్ల్ ఫ్రెండ్[2]
 11. ఆనందనిలయం
 12. అనిత
 13. భార్యతో రెండోపెళ్లి
 14. చీకటి కడుపున కాంతి
 15. ఏది సత్యం? ఏది అసత్యం?
 16. ఈనాటి శకుంతల
 17. కనబడుటలేదు
 18. రక్షరేకు
 19. మబ్బువిడిపోయింది
 20. ప్రేమసూత్రం
 21. కనువిప్పు
 22. ఈ ప్రశ్నకు బదులేది?
 23. నీరు పల్లమెరుగు
 24. సూర్యనేత్రం
 25. వెలుగుబాట
 26. నీటిసెగలు
 27. జిగోలో
 28. మహిళా సమాజం
 29. అందీ అందనిది
 30. మారే కాలంలో మారని విలువలు
 31. ఆశాజ్యోతి
 32. అపరాజిత
 33. నిరాశలో నిండు గుండె
 34. దీనబంధు

కథాసంపుటాలు

[మార్చు]
 1. ఎన్నెన్నో కాంప్లెక్సస్
 2. డోలిక
 3. దశావతారాలు
 4. పోనీ నేను వ్రాసిపెట్టనా
 5. పెండ్లెందుకు

కథలు

[మార్చు]
 1. అక్రమ సంబంధం
 2. అడవి పూలు
 3. అడ్రస్ లేని పెళ్ళికూతురు
 4. అసలు రహస్యం
 5. ఆటు పోటు
 6. ఆశ
 7. ఆశ్చర్యంలేదు
 8. ఇదీ ఒక మార్గమే
 9. ఈనాటి మహిళ
 10. ఋణగ్రస్తులు
 11. ఎంతపని జరిగింది
 12. ఎందుకోయీ...
 13. ఎక్కడుంది నీ యిల్లు?
 14. ఎదురుతిరిగిన సానుభూతి
 15. ఎర్రగోగుల ఎర్రెమ్మ
 16. ఎలుతురు మేసిన ఏరు
 17. ఎవరు దొంగ
 18. ఎవరు నువ్వు
 19. ఏం శాపమో?
 20. ఏడేడు జన్మల బంధం
 21. ఐ పిటీ యూ
 22. ఒదిలేసింది
 23. కథవెనుక కథానాయిక
 24. కర్మభూమి
 25. కాలనాగు కాంప్లెక్స్
 26. గంగా జలం
 27. చీకటి పెద్దది...
 28. జీవనస్రవంతి
 29. టెలీరాగిణి
 30. డోలిక
 31. తవ్వుకున్న గొయ్యి
 32. తా...తీ
 33. తెరపి మరపులలో
 34. తెఱచిరాజు సాక్షిగా
 35. త్యాగం
 36. దేవత ఎవరూ?
 37. నన్ను హత్యచేయవూ
 38. నయాగరా
 39. నష్ట ఫలహారం
 40. నా శత్రువులకు
 41. నాకీప్రేమఅక్కర్లేదు
 42. నిజంతెల్సింది
 43. నిన్ను పూర్తిగా అర్ధం...
 44. నీభాషలోనే సమాధానం చెప్తా
 45. నువ్వు మాట్లాడేదేమిటి
 46. న్యాయమే గెలిచింది
 47. పండిత శిఖామణి కాంప్లెక్స్
 48. పతిత-పవిత్రత
 49. పతివ్రత నీడ
 50. పరీక్షల ప్రేమ
 51. పవిత్రమైన పెళ్ళి
 52. పాత సమస్య కొత్త పరిష్కారం
 53. పిట్టపోరు,పిట్టపోరు...తీర్చినదెవరు?
 54. పిన్ని
 55. పెళ్లెందుకు
 56. పేను పెసర చేను
 57. పోనీ నేను వ్రాసిపెట్టనా?
 58. ప్రగతి పధం
 59. ప్రాప్తం
 60. ప్రేమకు అర్థం తెలిసింది
 61. బాధ్యత ఎవరిది?
 62. భర్తా రూపాయత శతృః.
 63. భవిష్యత్తేమిటి
 64. మంటలు
 65. మతం పుచ్చుకున్న మనిషి
 66. మనిషికి ఏం కావాలి
 67. మళ్లీపాత కథేనా
 68. మహాతి
 69. మామూలు మనిషి
 70. మాయాబజార్
 71. మారుతోన్న సమాజంలో క్రొత్తకోణం
 72. మాలాగ మారిపోవద్దు
 73. మువ్వన్నెల పతాక
 74. ముసురు
 75. మూర్ఖత్వమే వరమా
 76. మూషికసుందరి కాంప్లెక్స్
 77. రజక మహాశయుల కాంప్లెక్స్
 78. రాజుగారి శాసనం
 79. రూపులేని రాకాసి కోర
 80. లోకకల్యాణం
 81. లోపలి లోకాలు
 82. వట్టిమాటలు కట్టిపెట్టోయ్
 83. వింతప్రాణులు
 84. విలువలు
 85. విలువైన బహుమతి
 86. విశ్వగీతి
 87. శకునం
 88. సత్కీరోపాఖ్యానము
 89. సాగరసంగమం
 90. సిరి
 91. సుగాత్రి
 92. సృష్టి రహస్యం
 93. స్త్రీ జనోద్దరణ
 94. స్ఫురణ
 95. హాట్ హోం

విమర్శ గ్రంథాలు

[మార్చు]
 1. తెలుగు నవలా విమర్శ
 2. సాహిత్యము - నవలాప్రక్రియ
 3. సమాజ సాహిత్యాలు
 4. తులనాత్మక సాహిత్యం - నవలా ప్రక్రియ: వ్యవస్థాగత దృక్పథం

పురస్కారాలు

[మార్చు]
 • గృహలక్ష్మి స్వర్ణకంకణము - 1972
 • మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013
 • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు - 1979 (తుఫాన్ నవలకు)
 • మాదిరెడ్డి సులోచన బంగారు పతకం - 1997
 • తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు - రెండు పర్యాయాలు
 • సుశీలా నారాయణరెడ్డి పురస్కారం
 • గోపీచంద్ పురస్కారం
 • అమృతలత జీవన సాఫల్య పురస్కారం - 2013

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. ‘I cherish that compliment’
 2. 2.0 2.1 DR. C. ANANDA RAMAM పుస్తకాలు