సీతాగొంది ఇస్తేమా
| Native name | ఇస్తేమా (ఆధ్యాత్మిక సదస్సు) |
|---|---|
| English name | IJTEMA |
| Date | 21జనవరి 2025 నుండి 23 జనవరి 2025 వరకు మూడు రోజులు. |
| Venue | సీతాగొంది గ్రామ పంచాయతీ పరిధిలో గుడిహత్నూర్, ఆదిలాబాదు, తెలంగాణ, ఇండియా |
| Cause | అనుచరులను స్వీకరించడానికి నిర్వహించే సమాజం యొక్క సమావేశం ఏడాదికి ఒకసారి తబ్లిఘి జమాత్ నిర్వహిస్తుంది. |
| Organised by | తబ్లిఘి జమాత్ (Tablighi Jamaat) |
సీతాగొంది ఇస్తేమా తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది శివారులో మూడు రోజులు పాటు ఇస్తేమా ముస్లిం సోదరుల ఆధ్యాత్మిక సదస్సు జరిగింది[1]. ఇస్తేమా అనగా ముస్లీం భాగస్వామ్యం స్వచ్చందంగా జరిగే శాంతియుత కార్యక్రమం. ఇందులో వక్తలు పరస్పర ప్రేమ,గౌరవం,ఐక్యత,సంఘీభావం ప్రకటిస్తారు.
చరిత్ర
[మార్చు]తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో సీతాగొంది గ్రామ పంచాయతీ శివారులో తేది 21 జనవరి 2025 నుండి 23 జనవరి 2025 వరకు మొత్తం మూడు రోజుల పాటు ఇస్తేమా ప్రార్థన సమావేశాన్ని ఆదిలాబాదు జిల్లా నిర్వాహకులు నిర్వహించారు[2]. ఈ సమావేశంలో హాజరైన భక్తులు రోజు వారిగా ప్రార్థనలు చేస్తారు. పండితులు తమ పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుండి కొన్ని శ్లోకాలు పఠిస్తూ సమావేశంలో హాజరైన భక్తులకు వివరించారు . సామూహిక ప్రార్థనలో హాజరైన లక్షలాది భక్తులు తమ చేతులు పైకెత్తి ప్రపంచ శాంతి కోసం అల్లాను ప్రార్థిస్తారు. ఈ ఆధ్యాత్మిక సదస్సులో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్,యావత్మల్ జిల్లా నుంచి సైతం ముస్లిం భక్తులు సుమారు లక్షన్నర మంది తరలివచ్చారు.
ఉద్దేశ్యం
[మార్చు]ఇస్తేమా ముస్లిం సమాజం యొక్క సాముహిక ప్రార్థనలు,ఆధ్యాత్మిక ప్రశంసలు, ఔన్నత్యం, వారి సంక్షేమం కోసం, ఇస్లామిక్ విలువలకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించే గొప్ప అవకాశంగా భావించబడుతుంది.
విశేషం
[మార్చు]ఇస్తేమా అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం.ఇందులో వివిధ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చే ఆధ్యాత్మిక గురువులకు సంభాషించే అవకాశం లభించిండం విశేషం.
సాముహిక ప్రార్థనలు
[మార్చు]ఇస్తేమాలో సాముహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్క ముస్లిం ఇస్లాం మత స్థాపకుడు ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ ను స్మరించుకుని ఆయన చూపిన బాటలో నడిచేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని దేశ రాజధాని డిల్లీకి చెందిన ఆధ్యాత్మిక వేత్త నిజామ్ ఉద్దీన్ బృందం, హైదరాబాదుకు చెందిన ఆధ్యాత్మిక గురువులు సూచించారు. ప్రవక్త శాంతి ప్రస్థానానికి నాంది అని అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పి నిరుపేదల అవసరాలను తీర్చడానికి సహాయం చేయాలని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి పౌరులుగా సత్ప్రవర్తనతో మెలగాలని ప్రపంచ శాంతి సౌభాగ్యం కోసం కృషి చేయాలని సభలో వక్తలు పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు
[మార్చు]ఇస్లాం ఆవశ్యకత గురించి నిర్వహించే ఈ ఇస్తేమా కార్యక్రమాలలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం భక్తుల కోసం నిర్వాహకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు.మూడు రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక సదస్సు కోసం 30 ఎకరాల విస్తీర్ణంలో ఇస్తేమా నిర్వహించారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సదస్సుకు సమీపంలో 44వ జాతీయ రహదారి ఉండటంతో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు రహదారి అడుగడుగునా వాలంటీర్లు నియమించి వారి సేవలను వినియోగించుకుంన్నారు. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. పెద్ద వేదికను ఏర్పాటు చేసి వచ్చినా వారందరికీ భోజనాల తయారీకి కీచెన్ షెడ్లు, ప్రార్థనకు వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు కుళాయిలు, వేయి వేయి లీటర్ల సామార్థ్యం ఉన్న పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు, దానితో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు,వందల సంఖ్యలో నల్లాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ అధికారులు ట్రాన్స్ ఫార్మర్లలు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా కృషి చేశారు.
వైద్య సేవలు
[మార్చు]ఇస్తేమాకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆదిలాబాదు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లామిక్ ఇస్తేమా జరిగే ప్రాంతంలో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందితో వైద్య శిబిరాలు నిర్వహించారు. షిఫ్టుల వారిగా విధులు కేటాయించారు.అత్యవస వైద్య సేవల కోసం ప్రత్యేక అంబులెన్స్ అందుబాటులో ఉంచారు.
మూలాలు
[మార్చు]- ↑ "TS News: ముగిసిన సీతాగొంది ఇస్తేమా". EENADU. Retrieved 2025-01-24.
- ↑ "TS news: సీతాగొందిలో ప్రారంభం అయిన ముస్లింల ఇస్తెమా". EENADU. Retrieved 2025-01-24.