సీతాపూర్
సీతాపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°34′N 80°40′E / 27.57°N 80.66°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | సీతాపూర్ |
స్థాపన | 1857 |
Named for | సీతాదేవి |
Elevation (in meters) | 138 మీ (453 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,77,351 |
• జనసాంద్రత | 630/కి.మీ2 (1,600/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
PIN CODE | 261001 |
సీతాపూర్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. [1] సీతాపూర్ జిల్లా లక్నో డివిజన్‌లో ఉంది . ఈ పట్టణం సరాయన్ నది ఒడ్డున ఉంది. లక్నో, షాజహాన్పూర్ లకు సరిగ్గా మధ్యన ఉంది. జాతీయ రహదారి 24 ద్వారా లక్నోకు రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ ఒక కంటోన్మెంట్ ఉంది. బ్రిటిషు కాలంలో బ్రిటిష్ రెజిమెంటులో కొంత భాగం ఇక్కడ ఉండేది. [2]
రాజకీయ ప్రముఖులు
[మార్చు]- ఆచార్య నరేంద్ర దేవ్: (1889 అక్టోబరు 30 -1956 ఫిబ్రవరి19) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ పట్టణంలో జన్మించాడు.[3] అతను భారతదేశ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతకర్తలలో ఒకడు.అతని ప్రజాస్వామ్య సోషలిజం, హింసాత్మక మార్గాలను సూత్రప్రాయంగా త్యజించి, సత్యాగ్రహాన్ని విప్లవాత్మక వ్యూహంగా స్వీకరించింది.అతని తండ్రి బాబు బలదేవ్ సహాయ్ పజియాబాద్ లో పేరుపొందిన న్యాయవాదిగా పనిచేసాడు.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రైలు
[మార్చు]సీతాపూర్‌లో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రధానమైన రైల్వే స్టేషను సీతాపూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషను. జల్పాయిగురి నుండి అమృత్సర్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్, జన నాయక్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-సహర్సా ఎక్స్‌ప్రెస్, కర్మభూమి ఎక్స్‌ప్రెస్, జానసేవా ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు. సీతాపూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తాయి.
రెండో స్టేషను సీతాపూర్ సిటీ జంక్షన్ రైల్వే స్టేషను. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. సీతాపూర్ నగరం నుండి ప్యాసింజర్ రైళ్లు ఉన్నావ్, బాలమౌ, షాజహాన్పూర్ లకు వెళ్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Sitapur Up Travel Guide". Goibibo.com. 19 June 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Bhatt, Vijay Kumar (2016). Asst. Director. Kanpur: Ministry of MSME, Government of India. pp. http://dcmsme.gov.in/dips/DIP%20Sitapur%20VKB%20AD%20EI.pdf.
- ↑ "Acharya Narendra Dev Biography - Acharya Narendra Dev Profile, Childhood, Life, Timeline". www.iloveindia.com. Retrieved 2021-09-15.