సీతారాంపురం (దేవరుప్పుల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీతారాంపురం గ్రామం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలంలో ఉంది. ఇది రెవెన్యూయేతర గ్రామం. గ్రామ వంచాయితీ కేంద్రం.వరంగల్ జిల్లాకి ఈ గ్రామం 53.5 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్కి 112 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

సీతారాంపురం గ్రామచరిత్ర కడవెండి చరిత్రతో ముడిపడుంది. ఎందుకంటే సీతారాంపురం గ్రామం కడవెండి నుండి 17 సంవత్సరాల క్రితమే విడిపోయింది. అంతకిముందు సీతారాంపురం గ్రామం కడవెండి గ్రామంలో ఒక వార్డ్ మాత్రమే, కడవెండి గ్రామంలో మాదిరిగానే సీతారాంపురం గ్రామంలో కూడా రజాకార్లును ఎదిరించిన వీరులున్నారు. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రం, శివాలయం,మసీద్, చర్చి ఉన్నాయి.

సమీప పట్టణాలు

[మార్చు]

సామాజిక, రాజకీయ, ఆర్ధికపరిస్థితులు

[మార్చు]

సీతారాంపురం గ్రామానికి ప్రధాన ఆధారం వ్యవసాయం.కొందరు వారికి సాయం చేసి కూలి అనిపించుకుంటారు. మరి కొందరు వ్యవసాయ ఆధార పనులు చేస్తారు. ఇంకొందరు పశువులు ( గేదలు,ఆవులు) ద్వారా పాల ఉత్పతిని పెంచి ఆదాయాన్ని పొందుతారు. ఊరిలో వివిధ మతాల వారు అనేక కులాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో రజక,కుమ్మరి, కమ్మరి, ఎరుకల, మాదిగ, పిచ్చకుంట్ల, లంబాడి, వడ్డెర, ముదిరాజ్, కురుమ, పద్మశాలి,గౌడ్స్, కాపు, అర్య బ్రాహ్మణులు , వైశ్యులు మొదలైన కులస్థుల వారు ఉన్నారు. వీరిలో కురుమ,అరె,గౌడ్స్, పద్మశాలి, ముదిరాజ్, కాపు, మొదలగు కులస్తుల జనాభా ఎక్కవ. ఈ గ్రామంలో హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ మతాలకు చెందిన వారు ఉన్నారు, అందరు ఎక్కువగా వ్యవసాయంపై ఆధాపపడి జీవిస్తున్నారు.

గ్రామంలో గోల్లకుర్మలు గొర్రెల పోషణను, గౌడ కులస్తులు కల్లును, రజకులు బట్టలుతుకుతు, ముదిరాజ్ కులస్తులు చేపలు, తోటల పెంపకం,పద్మశాలీలు వస్త్రాలను తయారు చేసి వ్యాపారం చేయడం, కోమట్లు వ్యాపారం, కుమ్మరొల్లు కుండలపని, కమ్మరొల్లు వ్యవసాయానికి సంబంధించిన కమ్మరి పని, బ్రాహ్మలు అర్చకులుగా, ఇలా వారి వారి కులవృత్తిలను చేసుకుంటూ కొద్దిపాటి వ్యవసాయం కూడా చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మిగిలిన కులాల వారు ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. మరి కొందరు మేస్త్రి పని,హమాలి కూలి పని, (కరెంట్) ఎలెక్టిషియన్ పని, డ్రైవింగ్ పని వృత్తిగా ఎంచుకుని సొంత ఆటోల ద్వారా కొందరు, దర్జీ పనిలో మరి కొందరు, ఉపాధ్యాయ వృత్తిలో ఇలా తమ జీవితాన్ని సీతారాంపురంలో కొనసాగిస్తున్నారు. ఊరిలో యువత ఎక్కవ సంఖ్యలో వృత్తి నైపుణ్యం ఉన్న రంగాలవైపే మొగ్గు చూపుతున్నారు.నేటి తరం యువత పెద్ద ఎత్తున విద్యాబ్యాసం చేసిన వారు మాత్రం మంచి వృత్తి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు, పడుతున్నారు

ఎక్కువగా యువత చదువులకోసం,ఉద్యోగాలకోసం గ్రామాన్ని విడిచి వలసలుపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణానికి వలసవెల్లారు. హైదరాబాద్ లో ఉప్పల్, రామంతపూర్, చింతల్, జగద్గిరిగుట్ట , చర్లపల్లి, ఇ సి ఐ ఎల్ మొదలగు ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇంకొంత మంది, జనగామ,వరంగల్, సూరత్, మొ!! ప్రదేశాలల్లో, మరి కొందరు దుబాయ్,అమెరికా దేశాలల్లో ఎక్కువగా వలసలు పోయారు.

ఊరిలో ప్రతి పనిలో రాజకీయం నడుస్తుంది. ఊరిలో ప్రదానంగా కాంగ్రెస్, టి డి పి, టి అర్.ఎస్ పార్టీలకు చెందిన నాయకులూ, కార్యకర్తలున్నారు. ఊరిలో ఎక్కువగా గౌడ్స్ దే రాజ్యాధికారం. యువత కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.

అనాధ వృద్ద శరణాలయం

[మార్చు]

యం.లక్ష్మినారాయణ "ప్రేమ సదనం అనాథ వృద్ద సంఘాన్ని" 13-11-1998న స్థాపించారు. అనాథ వృద్దులకు సేవచేయాలనే గొప్ప ఆశయంతో ఈ అశ్రమాన్ని ప్రారంబించారు. వృద్దులకు కనీస అవసరాలైన తిండి, కూడు,బట్టల, ఆరోగ్యసంబంద విషయాలఫై సేవ చేస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడుగా సీతారాంపురం గ్రామంలో అనేక సేవలు చేస్తూనే, ఆద్యాత్మికం వైపు అడుగులువేసుకుంటూ సీతారాంపురం గ్రామంలోని శ్రీ ఉమచంద్ర మౌళీశ్వరాలయం వద్ద 58 హోమ గుండాలతో సహస్ర చండి యాగాన్ని జరిపించారు, అనాథ వృద్ద అశ్రమం ప్రక్కన సాయిబాబా మందిరమును కూడా నిర్మించారు.

వెలుపలి లంకెలు

[మార్చు]