సీమా బిస్వాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీమా బిస్వాస్
2009, నవంబరులో జరిగిన 40వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విలేకరుల సమావేశంలో సీమా బిశ్వాస్
జననం (1965-01-14) 1965 జనవరి 14 (వయసు 59)
వృత్తినాటకరంగ, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
బాండిట్ క్వీన్

సీమా బిస్వాస్ (జననం 14 జనవరి 1965), హిందీ నాటకరంగ, సినిమా నటి. 1994లో శేఖర్ కపూర్ తీసిన బ్యాండిట్ క్వీన్ సినిమాలో ఫూలన్ దేవి పాత్రలో నటించి, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.[1] 2005లో దీపా మెహతా తీసిన వాటర్ సినిమాలోని శకుంతల పాత్రకు సంగీత నాటక అకాడమీ అవార్డు, 2006 ఉత్తమ నటి జెనీ అవార్డును అందుకుంది. ఖామోషి: ది మ్యూజికల్ (1996) సినిమాకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డును కూడా అందుకుంది. భూత్ (2003), వివాహ్ (2006), హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ (2017) వంటి సినిమాలతోపాటు, అనేక టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది.

జననం, విద్య

[మార్చు]

సీమా 1965, జనవరి 14న జగదీష్ - మీరా దంపతులకు అస్సాం రాష్ట్రం నల్బరి పట్టణంలో జన్మించింది.[2] నల్బరి పట్టణంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన సీమా, అస్సాంలోని నల్బారి కళాశాల నుండి ఆనర్స్‌తో పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలైంది. తరువాత, న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నాటకరంగంలో శిక్షణ పొందింది.[1] 

సినిమారంగం

[మార్చు]

కృష్ణన్ కర్తా తీసిన అమ్షిని (హిందీ) సినిమాలో సీమా హీరోయిన్‌గా నటించింది. 1988 జరిగిన ఫిల్మోత్సవ్ లో ఇండియన్ పనోరమా విభాగంలో ఈ సినిమా ప్రవేశించింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపర్టరీలో సీమా నటనను చూసిన శేఖర్ కపూర్ బ్యాండిట్ క్వీన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అంతకుముందే సీమా అస్సామీ సినిమాలో నటించింది. 1996లో సంజయ్ లీలా బన్సాలీ తీసిన ఖామోషి: ది మ్యూజికల్‌ సినిమాలో నానా పటేకర్ సరసన ఫ్లావీ అనే చెవిటి, మూగ మహిళ పాత్రలో నటించింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డును గెలుచుకుంది. హిందీ, మరాఠీ, మలయాళం, తమిళ సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించింది.[3] 2014లో, గోవాలో నవంబరు 20 నుండి 30 వరకు జరిగిన 45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సీమా బిశ్వాస్ జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది.[4]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2014–15 మహా కుంభ్: ఏక్ రహస్య, ఏక్ కహానీ మై ముయి
2019 లీలా
2020 దాడీ అమ్మా దాడి అమ్మ మాన్ జావో! దాది అమ్మ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్
2020 కోడ్ ఎం ఆసిఫ్ తల్లి ఏఎల్టి బాలాజీ/జీ5
2021 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 పీఎం బసు అమెజాన్ ప్రైమ్ వీడియో
2022 హ్యూమన్ రోమా మా డిస్నీ+హాట్‌స్టార్

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డులు సినిమా విభాగం ఫలితం
1995 జాతీయ చలనచిత్ర అవార్డులు బాండిట్ క్వీన్ ఉత్తమ నటి గెలుపు[5]
1997 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ నూతన నటి గెలుపు
ఉత్తమ నటి ప్రతిపాదించబడింది
ఖామోషి: ది మ్యూజికల్ ఉత్తమ సహాయ నటి ప్రతిపాదించబడింది
స్టార్ స్క్రీన్ అవార్డులు ఉత్తమ సహాయ నటి గెలుపు
2001 సంగీత నాటక అకాడమీ అవార్డు మొత్తం సహకారం గెలుపు
2003 స్టార్ స్క్రీన్ అవార్డులు కంపెనీ ఉత్తమ సహాయ నటి ప్రతిపాదించబడింది
2004 భూత్ ప్రతిపాదించబడింది
2006 26వ జీనీ అవార్డులు నీటి ఉత్తమ నటి గెలుపు
2013 కెనడియన్ స్క్రీన్ అవార్డులు మిడ్‌నైట్ చిల్డ్రన్ ఉత్తమ సహాయ నటి గెలుపు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Bandit queen used to cry all night, used to act nude in front of director and cameraman". News Track. 14 January 2020. Retrieved 2022-02-11.
  2. Vasisht, Divya (24 June 2003). "Seema Biswas: Beyond the limelight". The Times of India. Retrieved 2022-02-11.
  3. Kumar, Anuj (3 March 2007). "Beyond the image". The Hindu (Metro Plus Mangalore ed.). Archived from the original on 7 November 2012. Retrieved 2022-02-11.
  4. Pranjal Borah (21 November 2014). "Seema Biswas as Jury in 45th International Film Festival of India". KothaSobi. Archived from the original on 2021-01-13. Retrieved 2022-02-11.
  5. "43rd National Film Awards – 1996". Directorate of Film Festivals. pp. 26–27. Archived from the original on 15 December 2013. Retrieved 2022-02-11.

బయటి లింకులు

[మార్చు]