ఎగువ సీలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్

వికీపీడియా నుండి
(సీలేరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఎగువ సిలేరు ప్రాజెక్ట్ సైట్ క్యాంప్ (సీలేరు) ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా,గూడెం కొత్తవీధి మండలంలోని చెందిన జనగణన పట్టణం.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

===సమీప గ్రామాలు=== దుప్పిలివాడ, దారకొండ, సప్పర్ల, ఒడిశాలోగల గుంటవాడ, పప్పులూరు, కుర్మనూరు చిత్రకొండ

===సమీప మండలాలు=== తూర్పుగోదావరి జిల్లా వైరామవరం, గూడెంకొత్తవీధి

==గ్రామంలో విద్యా సౌకర్యాలు== ఏపీజెన్కో డిఏవీ హైస్కూల్ ఇంగ్లీఘ మీడియం, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఎంపీపీ పాఠశాల, గిరిజన బాలికల పాఠశాల, టిఆర్సీక్యాంప్ గురుకుల బాలుర పాఠశాల, సీలేరు కాన్వెంట్ పాఠశాలలు ఉన్నాయి. == గ్రామానికి రవాణా సౌకర్యాలు==సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్ళె ప్రధాన రహదారి, సీలేరు నుంచి భద్రాచలం, సీలేరు నుంచి ఒడిశాలోగల చిత్రకొండ రహదారి ప్రదానమైనవి. ==గ్రామంలో మౌలిక వసతులు== ఏపీజెన్కో అథిదిగృహాలు రెండు ఉన్నాయి. ఐబి, 12 గదులు హస్టల్ ఉన్నాయి. ===ఆరోగ్య సంరక్షణ=== ఎపీజెన్కో ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ( పిహెచ్సీ) ఉన్నాయి. ===మంచినీటి వసతి===ఏపీజెన్కో ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తుంది. రామాలయం వద్ద బోరుబావి గ్రామానికి మంచి నీటికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సీలేరుకు మంచినీటికి ఎటువంటి ఇబ్బందులు లేవు ===రోడ్దు వసతి=== గ్రామంలో అన్ని బీటీరోడ్లు ఉన్నాయి. ఈరోడ్లు అన్నీ ఏపీజెన్కో స్వయంగా వేసినవే. ===విద్యుద్దీపాలు=== గ్రామంలో విద్యుత్ దీపాలు అన్నీ జెన్కో రోడ్డ రోడ్డుకు వేసింది. పంచాయతీ తన పరిధిలో విద్యత్ లైట్లు వేసింది . ===తపాలా సౌకర్యం=== తపాలా సౌకర్యం ఉంది. ==గ్రామంలో రాజకీయాలు== ప్రధానంగా వైఎస్ఆర్సీపి, తెలుగుదేశం, కాంగ్రేస్ పాఠ్టీలు ఉన్నాయి. ==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== ఏపీజెన్కో జలవిద్యత్కేంద్రం ఉంది ఇక్కడ 60మెగావాట్ల విద్యత్ ఉత్పత్తి చేయు సామర్ధ్యం గల నాలుగు జనరేటర్లు ఉన్నాయి. 1,2 జనరేటర్లను స్విజ్జర్లాండ్ జనీవా దేశస్తులు నిర్మించారు. మరో రెండింటికి డిజైన్ చేసి వదిలేశారు. ఆరెండు జనరేటర్లను బిహెచ్ఈఎల్ కంపెనీ 1995లో నిర్మించింది. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో 20 గేట్లతో కూడిన గుంటవాడ డ్యామ్ ఉంద. 8గేట్లతో మరో రెగ్యూలేటర్ డ్యామ్ ఉంది. ఈరెండింటికీ మద్య మారెమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. ఇదే ప్రదాన ఆలయం సీలేరు వాసులకు. దీనిపక్కనే మరో అయ్యప్పదేవాలయం ఇటీవలే నిర్మించారు. సీలేరుకు 5కిలోమీటర్లదూరంలో ఐస్ గెడ్డ జలపాతం ఉంది. 20 కిలోమీటర్లదూరంలో దారాలమ్మ ఆలయం ఉంది. ==గ్రామంలో ప్రధాన పంటలు== ఇక్కడ ఎటువంటి సాగులేదు. సీలేరు పరిసర ప్రాంతాల్లో వరి, రాగులు, కంది, మినుములు, సాములు పండిస్తారు. ==గ్రామంలో ప్రధాన వృత్తులు== ఏమీయు లేవు == గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు) == లేరు ఇక్కడ జెన్కో ఉద్యోగులే ప్రదాన ప్రముఖులు.

మూలాలు[మార్చు]

  1. "Upper Sileru Project Site Camp (Visakhapatnam, Andhra Pradesh, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information". www.citypopulation.de. Retrieved 2020-10-31.

వెలుపలి లంకెలు[మార్చు]