సీహోర్
సీహోర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°12′N 77°05′E / 23.2°N 77.08°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | సీహోర్ |
Elevation | 502 మీ (1,647 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,09,118 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 466001 |
టెలిఫోన్ కోడ్ | 07562 |
Vehicle registration | MP-37 |
సీహోర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, సీహోర్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది భోపాల్ - ఇండోర్ రహదారిపై, భోపాల్ నుండి 38 కి.మీ. దూరంలో ఉంది.
భౌగోళికం
[మార్చు]సీహోర్ 23°12′N 77°05′E / 23.2°N 77.08°E వద్ద, [1] సముద్ర మట్టం నుండి 502 మీటర్ల వద్ద ఉంది. ఇది, భోపాల్ - ఇండోర్ హైవేపై రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి నైరుతి దిశలో 37 కి.మీ. సీహోర్ భోపాల్ నుండి రత్లాం వరకు ఉన్న పశ్చిమ రైల్వే మార్గంలో ఉంది. సీహోర్ జిల్లా గుండా వెళుతున్న ఏకైక నది సివేన్.
జనాభా వివరాలు
[మార్చు]2001 జనగణన ప్రకారం [2] సీహోర్ జనాభా 90,930. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. సీహోర్ అక్షరాస్యత 68%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీల అక్షరాస్యత 61%. సీహోర్ జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
2011 జనాభా లెక్కల ప్రకారం, పెరుగుదల ఉన్న సీహోర్ పట్టణ జనాభా 109,118. [3]
రవాణా సౌకర్యాలు
[మార్చు]సీహోర్ రైల్వే స్టేషన్ ఉజ్జయిని - భోపాల్ మార్గంలో ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, నాగ్‌పూర్, జమ్మూ, పూరి వంటి ప్రధాన నగరాలకు ఇక్కడి నుండి రైళ్లు ఉన్నాయి. సమీప విమానాశ్రయం భోపాల్‌లో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Sehore
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Sehore (District, Madhya Pradesh, India) - Population Statistics, Charts, Map and Location". www.citypopulation.de. Retrieved 7 September 2020.