సుంకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Taxation

సుంకం అంటే దిగుమతులు లేదా ఎగుమతులపై విధించే పన్ను.

చరిత్ర[మార్చు]

సుంకాలు సాధారణంగా సంరక్షణతత్వంతోనూ, దేశాల మధ్య వాణిజ్యాన్ని నియంత్రించే ఆర్థిక విధానంతోనూ ముడిపడి ఉంటాయి. సుంకాలను ఎగుమతి చేస్తున్న వస్తువులపై కూడా విధిస్తున్నప్పటికీ, రాజకీయ కారణాల వల్ల, వీటిని సాధారణంగా దిగుమతి చేసుకుంటున్న సరుకులపై విధిస్తుంటారు.

నేటికంటే గతంలోనే ప్రభుత్వ రాబడిలో సుంకాలదే అధిక భాగంగా ఉండేది.

సరిహద్దుల వద్దకు లేదా రేవుల వద్దకు సరుకులు చేరుకున్నప్పుడు కస్టమ్స్ అధికారులు వాటిని తనిఖీ చేసి సుంకాల విధానం ప్రకారం వాటిపై పన్ను విధిస్తారు. పన్ను చెల్లించరనిదే సరుకులు తమ ప్రయాణం కొనసాగించలేవు కాబట్టి, ఇది వసూలు చేయడానికి అతి సులువైన మార్గం మరియు వీటిని సేకరించడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. పన్నులను ఎగవేయడానికి ప్రయత్నించే వ్యాపారులు అక్రమ రవాణాదారులుగా భావించబడుతుంటారు.

రకాలు[మార్చు]

సుంకాలలో పలు రకాలున్నాయి:

 • నిష్పత్తి సుంకాలు అనేవి దిగుమతి చేయబడుతున్న సరుకు విలువ యొక్క శాతపు సముదాయం. కొన్ని సందర్భాలలో ఇవి సమస్యాత్మకం అవుతుంటాయి, సరుకుల అంతర్జాతీయ ధరలు పతనమవుతున్నప్పుడు, సుంకాలు కూడా తగ్గిపోతుంటాయి మరియు దేశీయ పరిశ్రమలు మరింత పోటీబారిన పడుతుంటాయి. దీనికి భిన్నంగా, సరుకు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్నప్పుడు సుంకం కూడా పెరుగుతుంటుంది, కాని ధర పెరిగినప్పుడు ఏ దేశమైనా సంరక్షణ తత్వంపై పెద్దగా దృష్టి పెట్టదు.

పన్నుల మొత్తం బకాయిలను తగ్గించే దృష్టితో కంపెనీలు మార్కెట్ ధర కంటే భిన్నంగా సరుకుల విలువను ప్రకటిస్తున్నప్పుడు, సుంకాలు అంసందర్భపు బదిలాయింపు ధర యొక్క సమస్యను ఎదుర్కొంటాయి.

 • ప్రత్యేక పన్ను అంటే, సరుకు ధరతో మార్పు చెందని నిర్దిష్ట మొత్తం నగదుపై విధించే పన్ను. కాలానుగతంగా మార్చనట్లయితే ఈ సుంకాలు మార్కెట్‌లో మార్పులకు లేదా ద్రవ్యోల్బణం ప్రభావానికి గురవుతుంటాయి.
 • రాబడి సుంకం అంటే ప్రభుత్వానికి డబ్బును పోగు చేయడానికి ప్రధానంగా రూపొందించే రేట్ల సముదాయం. కాఫీ తోటలను పెంచని దేశాల ద్వారా కాఫీ దిగుమతులపై విధించే పన్ను ఉదాహరణకు రాబడిని బాగా పెంచుతుంది.
 • నిషిద్ధ సుంకం అంటే ఒక వస్తువును ఎవరూ దిగుమతి చేసుకోలేనంత ఎక్కువగా విధించే సుంకం.
 • సంరక్షక సుంకం అనేది దిగుమతుల యొక్క కృత్రిమంగా పెంచబడిన ధరలపై విధించబడుతుంటుంది మరియు విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడటానికి ఇది ఉద్దేశించబడింది ( దీన్ని కూడా చూడండి సంరక్షణ యొక్క ప్రభావిత రేటు,) సంరక్షిత దేశంలో చట్టవిరుద్ధంగా ఉండే పరిస్థితులలో వాటిని నిర్వహించడానికి అతిథేయ దేశాలకు చెందిన పోటీదారుల నుంచి కాపాడటానికి లేదా తమ ఎగుమతులపై రాయితీలు కల్పించిన వారికి వ్యతిరేకంగా ఈ సుంకం విధించబడింది.
 • పర్యావరణ సుంకం అనేది సంరక్షణ సుంకాన్ని పోలి ఉంటుంది, దీన్ని 'హరిత' సుంకం లేదా 'ఎకో-సుంకం', అని కూడా పిలుస్తుంటారు. వాతావరణ కాలుష్య నియంత్రణలను పెద్దగా పాటించని దేశాలనుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై మరియు ఈ దేశాలనుంచి పంపే ఉత్పత్తులపై ఈ సుంకాన్ని విధిస్తారు.
 • ప్రతీకార సుంకం అనేది ఇప్పటికే ప్రతీకార సుంకాలను విధించిన దేశంపై విధించే తరహా సుంకం. (ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్, చైనా సరకులపై సుంకాలను విధించి ఉన్నట్లయితే, చైనా కూడా అమెరికా సరకులపై అదే రకమైన సుంకాన్ని విధించవచ్చు. సాధారణంగా, ఇతర సుంకాలను అధికారికంగా రద్దు చేయించే ప్రయత్నంలో భాగంగా ఈ పన్నులను విధిస్తుంటారు.

20 వ శతాబ్దంలో సుంకాలను ప్రభుత్వం లేదా స్థానిక అధికారులు మరియు పారిశ్రామిక సంస్థల స్వంత అధ్యయనాల నుండి పొందిన సమాచారంపై ఆధారపడి సుంకాల కమిషన్ రూపొందించేది.

ఆధునిక కాలంలో పన్ను, సుంకం, వాణిజ్య నియమాలు సాధారణంగా పారిశ్రామిక విధానం, మదుపు విధానం, మరియు వ్యవసాయ విధానంపై వాటి సాధారణ ప్రభావం కారణంగా రూపొందించబడుతున్నాయి. వాణిజ్య కూటమి అనేది తమలో తాము నిర్వహించే వాణిజ్యంపై సుంకాలను, ఇతర అవరోధాలను తగ్గించడానికి లేదా తొలగించడానికి అంగీకరించిన మిత్రదేశాల కూటమి, అలాగే తమ కూటమికు వెలుపల ఉన్న దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సంరక్షణాత్మక సుంకాలను కూడా విధించే అవకాశముంటుంది. పన్నుల యూనియన్ ఒక ఉమ్మడి బాహ్య సుంకాన్ని కలిగి ఉంటుంది, అందరూ ఆమోదించిన సూత్రం ప్రకారం, భాగస్వామ్య దేశాలు సరకులపై సుంకాలనుండి వచ్చిన రాబడులను పంచుకోవడం అనేది ఈ పన్నుల యూనియన్‌ కిందికి వస్తుంది.

ఒక దేశపు ప్రధాన పరిశ్రమలు విదేశీ పోటీలో నష్టపోయినట్లయితే, ఉద్యోగాలు కోల్పోవడం మరియు పన్ను రాబడి అనేవి ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోని పలు విభాగాలను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా దారిద్ర్యాన్ని పెంచుతాయి కూడా. ఒక దేశం జీవన ప్రమాణాలు లేదా పారిశ్రామిక క్రమబద్ధీకరణలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్లయితే తక్కువ శక్తి గల దేశాలతో రాజీపడితే తప్ప, సంరక్షణారహిత వ్యాపారంలో దేశీయ పరిశ్రమలు మనగలగడం కష్టం; ఈ రాజీ అనేది గ్లోబల్ పరుగు పందెంలా కిందిస్థాయిలో కూడుకుని ఉంటుంది. సంరక్షణాత్మక సుంకాలు చారిత్రకంగా ఈ సంభావ్యతకు వ్యతిరేక చర్యగానే ఉపయోగించబడుతూ వచ్చాయి. అయితే, సంరక్షణాత్మక సుంకాలలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఇవి స్థానిక పోటీని తగ్గించడం ద్వారా సుంకం పరిధిలోకి వచ్చే సరుకుల ధరను నిరోధిస్తాయి, దీంతో ఆ సరుకు వినియోగదారులు లేదా ఆ సరకును తయారు చేయడానికి ఉపయోగించే ఉత్పత్తి దారులకు నష్టం కూడా కలుగుతూ ఉంటుంది: ఉదాహరణకు, ఆహారంపై సుంకం అనేది దారిద్ర్యాన్ని పెంచుతుంది, కాగా, ఉక్కుపై సుంకం ఆటోమొబైల్ ఉత్పత్తి దారులను పోటీలో వెనక్కు నెట్టేస్తాయి. వ్యాపారంలో నష్టపోయిన దేశాలు సుంకంపై తమ స్వంత సుంకాలను విధించినట్లయితే ఈ సుంకాలు వాటిని విధించిన దేశాలకే ఎదురు తగులుతుంటాయి, దీంతో వాణిజ్య యుద్ధం మొదలవుతుంది పైగా, స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతకర్తల ప్రకారం ఇది ఇరుపక్షాలకూ నష్టదాయికంగా మారుతుంది. (మురాద్)

ఆర్థిక విశ్లేషణ[మార్చు]

సుంకాలు వ్యక్తిగత స్వేచ్ఛ మరియు స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలలో హానికరంగా జోక్యం చేసుకుంటాయని నవ్యసాంప్రదాయిక ఆర్థిక సూత్రాలు చెబుతున్నాయి. స్థానిక డిమాండ్ల ద్వారా శక్తిహీనంగా మార్చబడిన పరిశ్రమను కృత్రిమంగా నిర్వహించడం వల్ల వినియోగదారులకు న్యాయం జరగదని, సాధారణంగా దేశానికి కూడా ఇది నష్టదాయకమని వీరు భావిస్తుంటారు. దీనికంటే కుప్పకూలిపోవడానికి వీలు కల్పించడమే ఉత్తమమని వీరి అభిప్రాయం. అన్ని రకాల సుంకాలను వ్యతిరేకించడం స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతంలో భాగం; సుంకాలను తగ్గించడంపైనా, ఈ సుంకాలను అమలుచేసినప్పుడు విభిన్న దేశాల మధ్య వివక్షతను అధిగమించడంపైనా ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టి పెడుతోంది.

Surplus with tariff-v2.svg

ఈ కింది సూచిలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై దిగుమతి సుంకం వేసే ప్రభావాన్ని మనం చూడవచ్చు. ఇతర దేశాలతో వాణిజ్యం అనేది లేకుండా తలుపులు మూసుకున్న ఆర్థిక వ్యవస్థలో, డిమాండ్ మరియు సరఫరాల రేఖల మధ్య మనం సమతుల్యతను చూడగలం (పాయింట్ B ), ఇది $70 ధరలను మరియు Y* ఫలితాన్ని పెంచుతుంది. ఈ సందర్భంలో వినియోగదాలరు మిగులు లోపలి పాయింట్ల A, B మరియు K ప్రాంతానికి సమానంగా ఉంటాయి కాగా, ఉత్పత్తిదారు మిగులును A, B మరియు L ప్రాంతంగా చూపడం జరిగింది. ఈ నమూనాలోకి అంతర్జాతీయ స్వేచ్ఛా వ్యాపారాన్ని చేరుస్తున్నప్పుడు మనం SW గా పేర్కొన్న కొత్త సరఫరా వక్రరేఖను ప్రవేశపెడతాము. అంతర్జాతీయ సరుకుల మరియు సేవల సరఫరా అనేది తప్పకుండా ముందుకు సాగుతుంటుందని ఆలాంటి స్థితిలో ప్రపంచం నిర్దిష్ట ధర వద్ద అనంతంగా ఉత్పత్తిని చేయగలదని ఈ వక్రరేఖ సూచిస్తోంది. స్పష్టంగానే, వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో ఇది కాస్త అవాస్తవంగానే ఉంటుంది కాని, ఇలాంటి అంచనాలకు దిగడం అనేది నమూనా ఫలితంపై భౌతిక ప్రభావాన్ని కలిగించలేదు. ఈ సందర్భంలో సరకు యొక్క అంతర్జాతీయ ధర $50గా ఉంటుంది. (దేశీయ సమతుల్యతా ధర కంటే $20 తక్కువ).

వినియోగదారులలో ఎవ్వరూ ఉత్పత్తి దారుల గ్రూపుకు చెందనప్పుడు మరియు ఉత్పత్తి ఖర్చు వారి వేతనాలలో అతి చిన్న భాగమై ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో మాత్రమే పైన సూచించిన నమూనా పూర్తిగా కచ్చితమైన స్వభావంతో కూడి ఉంటుంది. దీనికి బదులుగా మనం దీనికి వ్యతిరేకంగా ఉండే అసాధారణ స్థితిని ఊహిస్తూ, వినియోగదారులందరూ ఉత్పత్తిదారుల సమూహం నుంచే వచ్చారని, అలాగే వారి కొనుగోలు శక్తి మాత్రమే ఉత్పత్తిలో సంపాధించిన వేతనాల నుంచి మరియు ఉత్పత్తి ఖర్చులు తమ మొత్తం వేతనంతో సమానంగా ఉంటాయని అంచనా వేసుకుందా, అప్పుడు, సూచి మౌలికంగానే వ్యత్యాసంతో ఉంటుంది.

సుంకాలు లేకుండానే 

ప్రపంచ స్థాయి ధరల వద్ద సరకును ఉత్పత్తి చేయగల ఉత్పత్తిదారులు/వినియోగదారులు మాత్రమే దానిని ఆ ధరవద్ద

కొనడానికి తగిన డబ్బును కలిగి ఉంటారు.

చిన్న FGL త్రికోణం, ఇప్పటికీ కొనగల సామర్థ్యం కలిగిన చిన్న ప్రతిబింబ సంకేత త్రికోణానికి సమానంగా సరిపోలుతుంటుంది.
సుంకాలతో, పెద్ద CDL త్రికోణం దాని ప్రతిబింబం మనగలుగుతాయి.

సుంకాలతో లేక సుంకాలు లేకుండానే, ప్రతి ఒక్క సరకు ధర సమానంగా ఉన్నప్పుడు దేశీయ సరుకులకు బదులుగా విదేశీ సరుకులను కొనడానికి అక్కడ ఎలాంటి ప్రోత్సాహకం కూడా లేదు. రుణం ద్వారా, ఆస్తుల అమ్మకం ద్వారా లేదా దేశీయ ఉత్పత్తి యొక్క నూతన రూపాల నుంచి పుట్టుకొచ్చిన కొత్త వేతనాల ద్వారా అందుబాటులో ఉన్న కొనుగోలు శక్తిని మార్చడం ద్వారా మాత్రమే, దిగుమతి చేసుకున్న సరుకులు కొనబడగలవు. లేదా దీని ధర వేతనాలలో అతి చిన్న భాగంగా మాత్రమే ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది.

వాస్తవ ప్రపంచంలో, దేశీయ సరుకుల స్థానంలో మరిన్ని దిగుమతులు వచ్చి చేరుతున్నప్పుడు, ఇవి అందుబాటులో ఉన్న దేశీయ ఉత్పత్తులకో అధిక భాగాన్ని ఇవి వినియోగం చేస్తూ ఉంటాయి, ఈ నమూనా వీక్షణం వైపుగా సూచిని పైకి తీసుకుపోంతుంటాయి. ఉత్పత్తి యొక్క సరికొత్త రూపాలను సకాలంలో కనుగొనకపోతే, దేశం దివాళా తీస్తుంది, అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా రుణ ఎగవేతకు, అధిక సుంకాల విధింపుకు లేదా అంతకంటే ఘోరమైన పరిణామాలకు దారి తీస్తుంది.

సుంకాలను విధించడం వల్ల ఈ క్రమాన్ని మందగిస్తాయి, దీనివల్ల నూతన ఉత్పత్తి రూపాలను అభివృద్ధి చేయడానికి మరింత సమయం కేటాయించడమే కాకుండా, పోటీ ధరలను ఎన్నటికీ సాధించలేని రక్షణాత్మక పరిశ్రమలను కూడా వృద్ధి చేయవచ్చు.

==రాజకీయ విశ్లేషణ == సుంకం అనేది స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పర్చడానికి రాజకీయ ఉపకరణంగా ఉపయోగించబడుతూ వచ్చింది; ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్ టారిఫ్ యాక్ట్ 1789 ప్రత్యేకంగా జూలై 4న సంతకం చేయబడింది, దీన్ని రెండవ స్వాతంత్ర్య ప్రకటనగా పత్రికలు పేర్కొన్నాయి, ఎందుకంటే, సార్వభౌమాధికారం కల స్వతంత్ర యునైటెడ్ స్టేట్స్ రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఒక ఆర్థిక సాధనంగా ఉద్దేశించబడింది.[1]

ఆధునిక కాలంలో, సుంకాలపై రాజకీయ ప్రభావం అనేది సానుకూల, ప్రతికూల అర్థాలు రెండింటిలో చూడవచ్చు. 2002 యునైటెడ్ స్టేట్స్ స్టీల్ టారిఫ్ మూడేళ్ల కాలానికి గాను దిగుమతి చేసుకుంటున్న పలు ఉక్కు ఉత్పత్తులపై 30% సుంకాన్ని విధించింది. అమెరికా ఉక్కు ఉత్పత్తి దారులు ఈ సుంకాన్ని బలపర్చారు,[2] కాని ఈ చర్యను కేటో ఇనిస్టిట్యూట్ విమర్శించింది.[3]

సుంకాలు తరచుగా ఎన్నికలకు ముందు రాజకీయ సమస్యగా ఆవిర్భవిస్తుంటాయి. 2007 ఆస్ట్రేలియన్ ఫెడరల్ ఎలక్షన్‌కి ముందు, ఎన్నికలలో గెలిచినట్లయితే ఆస్ట్రేలియన్ కార్ల సుంకాలను తాము తిరిగి సమీక్షిస్తామని ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ ప్రకటించింది.[4] లిబరల్ పార్టీ కూడా అలాంటి ప్రకటనే చేసింది, కాగా స్వతంత్ర అభ్యర్థి అయిన నైక్ జెనోఫోన్ కూడా ప్రకటన చేస్తూ సుంకాల ఆధారిత చట్టాన్ని "తక్షణ ప్రాతిపదికన" పరిచయం చేయాలన్నదే తన అభిమతమని చెప్పాడు.[5]

సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • సంరక్షణ యొక్క ప్రభావిత రేటు
 • ముట్టడి
 • పర్యావరణ సుంకం
 • ఎక్సైజ్ డ్యూటీ
 • జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ (GATT)
 • దిగుమతి కోటా
 • అంతర్జాతీయ కార్మిక అంశాల జాబితా
 • సుంకాల జాబితా
 • స్విస్ ఫార్ములా
 • టెలికమ్యూనికేషన్‌ల సుంకం
 • వాణిజ్య అవరోధాలు
 • యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్

సూచనలు[మార్చు]

 1. "Thomas Jefferson - under George Washington by America's History". americashistory.org.
 2. "Behind the Steel-Tariff Curtain". March 8, 2002.
 3. "Trade Briefing Paper no. 14. Steel Trap: How Subsidies and Protectionism Weaken the U.S. Steel Industry". Cato's Center for Trade Policy Studies.
 4. Sid Marris and Dennis Shanahan (November 9, 2007). "PM rulses out more help for car firms". The Australian.
 5. "Candidate wants car tariff cuts halted". theage.com.au.

మరింత చదవటానికి[మార్చు]

 • Salvatore, Dominick (2005), Introduction to International Economics (First ed.), Hoboken, NJ: Wiley, ISBN 0471202266
 • Taussig, F. W. (1911), "Tariff", Encyclopedia Britannica, 26 (11th ed.), pp. 422–427.
 • Free Markets And Tariffs.

బాహ్య లింకులు[మార్చు]

ప్రస్తుత ఎగుమతి & దిగుమతి పన్నుల వివరాల కోసం దయచేసి కింది వెబ్‌సైట్‌లను పేర్కొనండి

మూస:Trade

మూస:US tax acts

"https://te.wikipedia.org/w/index.php?title=సుంకం&oldid=2008510" నుండి వెలికితీశారు