సుంకం అచ్చాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుంకం అచ్చాలు
సుంకం అచ్చాలు

1952లో సుంకం అచ్చాలు


పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం 3 మార్చి 1924
నల్గొండ, హైదరాబాదు రాజ్యం
మరణం 1983 ఆగస్టు 9(1983-08-09) (వయసు 59)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్
షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్
జీవిత భాగస్వామి లింగమ్మ

సుంకం అచ్చాలు (1924, మార్చి 31983, ఆగష్టు 9) భారతీయ రాజకీయనాయకుడు. ఈయన 1952 నుండి 1957 వరకు, తొలి లోక్‌సభలో నల్గొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

సుంకం అచ్చాలు 1924, మార్చి 3న నల్గొండలో జన్మించాడు. ఈయన తండ్రి కాశయ్య.[1] ఈయన బడిలో చదువుకోలేదు, రైతుగా పనిచేశాడు.[1] ఇంట్లోనే ఉర్దూ, తెలుగు చదవటం, వ్రాయటంతో పాటు కొంత ఆంగ్లభాష కూడా నేర్చుకున్నాడు.[2] 1946లో లింగమ్మను పెళ్ళిచేసుకున్నాడు.[1] ఈయన నల్గొండ పట్టణంలో బట్టుగూడ ప్రాంతంలో నివసించేవాడు.[3]

సామాజికసేవ, రాజకీయాలు[మార్చు]

సుంకం అచ్చాలు షెడ్యూల్డు కులాల ఉద్ధరణకు సుదీర్ఘమైన కృషిచేశాడు. చిన్నవయసులోనే భారత జాతీయ కాంగ్రేసు కార్యకర్త అయ్యాడు. ఆ తర్వాత కాలంలో కాంగ్రేసును వీడి షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ నాయకుడయ్యాడు.[2] 1948 నుండి 1950 వరకు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ నల్గొండ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన హైదరాబాదు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ కార్యవర్గంలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.[1]

రాజకీయాలు[మార్చు]

1952 సార్వత్రిక ఎన్నికలకు ముందు లోక్‌సభకు పోటీచేసేందుకు ఎస్.సి.ఎఫ్ ఈయనకు టికెట్టు నిరాకరించడంతో, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ అభ్యర్ధిగా షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన నల్గొండ నియోజకవర్గం నుండి పోటీచేశాడు.[1][4] ద్విసభ్య నియోజకవర్గమైన నల్గొండలో ఈయన రావి నారాయణరెడ్డి సహ అభ్యర్ధి. [2] సుంకం అచ్చాలు ఆ ఎన్నికలలో దేశంలోనే అత్యధిక ఓట్ల తేడాతో గెలుపొందాడు.[1][4] ఈయన 282,117 ఓట్లు పొందాడు.[5] ఈయన ప్రధాన ఎస్.సి.ఎఫ్ అభ్యర్ధి డిపాజిట్ కూడా కోల్పోయాడు. 27 ఏళ్ళ వయసులో సుంకం అచ్చాలు అప్పట్లో ఆత్యంత పిన్నవయస్కుడైన పార్లమెంటు సభ్యులలో ఒకడు.[2]పార్టీ సభ్యుడు కాకపోయినా, సుంకం అచ్చాలు లోక్‌సభలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ బృందంతో పాటు కూర్చునేవాడు. షెడ్యూల్డ్ కులాల ఉద్ధరణపై కృషిచేసేందుకు కమ్యూనిస్టులను పురికొల్పే ప్రయత్నాలు చేసేవాడు.[2]

అచ్చాలు 1962లో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేసి కాంగ్రేసు పార్టీకి చెందిన కె.నాగన్న చేతిలో ఓడిపోయాడు.

మరణం[మార్చు]

సుంకం అచ్చాలు 1983, ఆగష్టు 9 న నల్గొండలో మరణించాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Lok Sabha. Members Bioprofile: ACHALU, SHRI SUNKAM
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Hari Sharan Chhabra (1952). Opposition in the Parliament: a unique, authentic and comprehensive biographical dictionary of M. P.'s on opposition benches. New Publishers. p. 40.
  3. Subodh Chandra Sarkar (1952). Indian Parliament and state legislatures: being the supplement to Hindustan year book, 1952. M.C. Sarkar. p. 120.
  4. 4.0 4.1 Gail Omvedt (30 January 1994). Dalits and the Democratic Revolution: Dr Ambedkar and the Dalit Movement in Colonial India. SAGE Publications. p. 273. ISBN 978-81-321-1983-8.
  5. Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1951 TO THE FIRST LOK SABHA - VOLUME I (NATIONAL AND STATE ABSTRACTS & DETAILED RESULTS)
  6. Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1983. p. 1.
  7. The Journal of Parliamentary Information. Lok Sabha Secretariat. 1983. p. 355.