సుఖ్‌జీత్ సింగ్
![]() 2025లో సుఖ్‌జీత్ సింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||
| వ్యక్తిగత వివరాలు | ||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| జననం |
1996 ఫిబ్రవరి 5 జలంధర్, పంజాబ్, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||
| ఆడే స్థానము | ఫార్వర్డ్ | |||||||||||||||||||||||||||||||||||||
| Club information | ||||||||||||||||||||||||||||||||||||||
| ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు | పంజాబ్ నేషనల్ బ్యాంక్ | |||||||||||||||||||||||||||||||||||||
| క్రీడా జీవితము | ||||||||||||||||||||||||||||||||||||||
| సంవత్సరాలు | Team | Apps | (Gls) | |||||||||||||||||||||||||||||||||||
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ | ||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||
| 2022– | భారత జాతీయ హాకీ జట్టు | 114 | (38) | |||||||||||||||||||||||||||||||||||
సాధించిన పతకాలు
| ||||||||||||||||||||||||||||||||||||||
సుఖ్‌జీత్ సింగ్ (జననం 5 ఫిబ్రవరి 1996) ఒక భారతీయ ఫీల్డ్ హాకీ ఆటగాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకం సాధించిన భారత జట్టులో ఇతడు భాగస్వామ్యం వహించాడు. ఇతడు అర్జున అవార్డు గ్రహీత. .[1]
ప్రారంభ జీవితం, నేపథ్యం
[మార్చు]ఇతడు తరన్ తరన్ జిల్లా జవంద్పూర్ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పంజాబ్ పోలీసు శాఖలో పనిచేయడం వల్ల, కుటుంబం జలంధర్‌లో స్థిరపడింది. ఇతని తండ్రి అజిత్ సింగ్ కూడా ఫీల్డ్ హాకీ ఆటగాడు. సుఖ్‌జీత్ ఎనిమిదేళ్ల వయసులో మొహాలిలోని రాష్ట్ర ప్రభుత్వ హాకీ అకాడమీలో చేరాడు.[2] ఇతడు 2024 వేసవి ఒలింపిక్స్లో భారత హాకీ జట్టులోనికి ఎంపికయ్యాడు.[3]
వృత్తి
[మార్చు]ఇండియన్ ఆయిల్, సింధ్ బ్యాంక్, పంజాబ్ పోలీసులతో స్వల్పకాలం పనిచేసిన తరువాత, సుఖ్‌జీత్ 2017లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్టుకు ఎంపికయ్యాడు.[4] 2018లో ఇతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు, కానీ వెన్నునొప్పి కారణంగా చేరలేకపోయాడు.[5]
2022-23 పురుషుల FIH ప్రో లీగ్ లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్లో భారత జట్టులో ఆడి అంతర్జాతీయ క్రీడలలో అరంగేట్రం చేశాడు.[5] ఈ టోర్నమెంట్లో ఇతడు ఆరు గోల్స్ చేశాడు. ఇతడు 2023 ప్రపంచ కప్‌లో భారతదేశం తరఫున ఆడి, టోర్నమెంట్లో మూడు గోల్స్ చేశాడు. 2022 ఆసియా క్రీడలలో కూడా ఆడాడు. అక్కడ భారతదేశం బంగారు పతకాన్ని గెలుచుకుంది.[6] అతను 2023-24 పురుషుల FIH ప్రో లీగ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు.[7]
జూన్ 2024లో, జూలైలో జరిగే 2024 పారిస్ ఒలింపిక్స్ ఆడబోయే భారత హాకీ జట్టుకు ఎంపికయ్యాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Sikdar, Sandip (2022-12-11). "From partial paralysis to Indian team: Sukhjeet Singh's remarkable comeback story". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ "26-yr-old Tarn Taran youth to be part of Olympic hockey team". The Tribune. 27 June 2024. Retrieved 28 June 2024.
- ↑ "Five Olympic debutants in Indian men's hockey squad for Paris 2024". The Times of India. 2024-06-26. ISSN 0971-8257. Retrieved 2024-07-23.
- ↑ Tripathi, Sudheendra (2017-09-16). "Young Sukhjit Singh makes it count". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-10-30.
- ↑ 5.0 5.1 ANI (2022-03-03). "Determined Sukhjeet Singh overcame a serious back injury in 2018 to make his India debut four years later". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ PTI (2023-09-19). "Asian Games 2023: Indian men's hockey team leaves for Hangzhou". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-27.
- ↑ "FIH PL: India name squad for 2022-23 season opener". ESPN (in ఇంగ్లీష్). 2022-10-25. Retrieved 2023-10-30.
- ↑ "26-yr-old Tarn Taran youth to be part of Olympic hockey team". The Tribune. 27 June 2024. Retrieved 28 June 2024.
