సుచ్చా సింగ్
స్వరూపం
Medal record |
|---|
సుచా సింగ్(జ.1948) ఒక భారతీయ అథ్లెట్. 2024 సంవత్సరానికిగాను ఇతనికి అర్జున అవార్డు (జీవన సాఫల్య పురస్కారం) లభించింది.
క్రీడా జీవితం
[మార్చు]1970లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో 400 మీటర్ల పరుగు పందెంలో, ఇతడు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అదే క్రీడలలో 4x400 మీటర్ల రిలే పోటీలలో భోగేశ్వర్ బారువా, అజ్మీర్ సింగ్, పి.సి. పునప్పలతో కలిసి రజత పతకాన్ని సాధించాడు. 1974లో టెహ్రాన్‌లో జరిగిన ఆసియా క్రీడలలో 4x400 మీటర్ల రిలే పందెంలో పి.సి పునప్ప, లెహంబర్ సింగ్, శ్రీరామ్ సింగ్‌లతో కలిసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 1975లో సియోల్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 4x400 మీటర్ల రిలేలో ఉదయకృష్ణ ప్రభు, రంజిత్ సింగ్, శ్రీరామ్ సింగ్‌లతో కలిసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[1][2]
పతకాలు
[మార్చు]అంతర్జాతీయ పోటీలలో ఇతడు గెలుచుకున్న పతకాల వివరాలు[3]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1970 | ఆసియా క్రీడలు | బ్యాంకాక్, థాయిలాండ్ | 3వ | 400 మీ. | 47.2 |
| 1970 | ఆసియా క్రీడలు | బ్యాంకాక్, థాయిలాండ్ | 2వ | 4x400 మీ రిలే | 3.11.9 |
| 1974 | ఆసియా క్రీడలు | టెహ్రాన్, ఇరాన్ | 2వ | 4x400 మీ రిలే | 3:08.73 |
| 1975 | ఆసియా ఛాంపియన్షిప్స్ | సియోల్, దక్షిణ కొరియా | 1వ | 4x400 మీ రిలే | 3:08.2 ఛాంపియన్షిప్ రికార్డ్ |
మూలాలు
[మార్చు]- ↑ Bhardwaj, Aakanksha N. "Didn't get recognition for decades: Athlete on Arjuna honour". The Tribune (in ఇంగ్లీష్). Retrieved 2025-02-09.
- ↑ PTI (2020-08-19). "Sucha recovers from COVID-19 after nightmarish treatment". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2025-02-09.
- ↑ వెబ్ మాస్టర్. "Sucha Singh (1948)". Athletics Podium. Athletics Podium. Retrieved 28 December 2025.