సుజన్ చక్రవర్తి
| సుజన్ చక్రవర్తి | |||
| పదవీ కాలం 2016 మే 19 – 2021 మే 2 | |||
| ముందు | మనీష్ గుప్తా | ||
|---|---|---|---|
| తరువాత | దేబబ్రత మజుందర్ | ||
| నియోజకవర్గం | జాదవ్పూర్ | ||
| పదవీ కాలం 1998 – 2001 | |||
| ముందు | సోవందేబ్ చటోపాధ్యాయ | ||
| తరువాత | అరుప్ భద్ర | ||
| నియోజకవర్గం | బరుయిపూర్ పుర్బా | ||
| పదవీ కాలం 2004 మే 13 – 2009 మే 16 | |||
| ముందు | కృష్ణా బోస్ | ||
| తరువాత | కబీర్ సుమన్ | ||
| నియోజకవర్గం | జాదవ్పూర్ | ||
| మెజారిటీ | 89,668 | ||
పశ్చిమ బెంగాల్ శాసనసభలో వామపక్ష నాయకుడు | |||
| పదవీ కాలం మే 2016 – మే 2021 | |||
| డిప్యూటీ | నర్మదా చంద్ర రాయ్ | ||
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) జాతీయ కార్యదర్శి | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2015 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1959 మార్చి 16 కాళికాపూర్ , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| జీవిత భాగస్వామి | మిలి చక్రవర్తి | ||
| పూర్వ విద్యార్థి | జాదవ్పూర్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సుజన్ చక్రవర్తి (జననం 16 మార్చి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా, 2021లో పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సుజన్ చక్రవర్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో 1986 నుండి 1988 వరకు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర విభాగం బెంగాలీ ఛత్ర సంగ్రామ్ కు సంపాదకుడిగా ఉన్నారు, 1988 నుండి 1993 వరకు సంస్థ రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా, 1993 నుండి 1994 వరకు కేంద్ర సంస్థకు ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2000 వరకు చక్రవర్తి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర విభాగంలో సభ్యుడిగా, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ (1988–93), 1996 నుండి 2001 వరకు పశ్చిమ బెంగాల్ ఫార్మాస్యూటికల్ & ఫోటోకెమికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 1998 నుండి 1999 వరకు ఇన్ఫ్యూజన్ ఇండియా లిమిటెడ్, 1999 నుండి 2004 వరకు పశ్చిమ బెంగాల్ గ్రామీణ శక్తి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
సుజన్ చక్రవర్తి 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ బోస్ పై 89,668 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 లోక్సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కబీర్ సుమన్ చేతిలో 56,267 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
సుజన్ చక్రవర్తి 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుగత బోస్ చేతిలో 1,25,203 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో జాదవ్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మనీష్ గుప్తాపై 14,942 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
సుజన్ చక్రవర్తి 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో జాదవ్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దేబబ్రత మజుందార్ చేతిలో 38,869 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో డమ్ డమ్ లోక్సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి 2,40,784 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2024 Loksabha Elections Results - Dum Dum" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
- ↑ "Dum Dum Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.