సుడిగుండాలు (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సుడిగుండాలు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సుకన్య
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ చక్రవర్తి చిత్ర
భాష తెలుగు

చలన చిత్రం వినోదాత్మకమా..విజ్ఞాన దాయకమా..ఇది పెద్ద చర్చ..చక్రపాణిగారు సినిమా వినోదాత్మకమే గాని సందేశం ఇవ్వడానికి కాదు అని తేల్చారు. సందేశం ఇవ్వడానికి పదిలక్షలు పెట్టి సినిమా తీయాలా..పది రూపాయలు పెట్టి పుస్తకం అచ్చేస్తే చాలదా అని వారి అభిప్రాయం..కాదు..సినిమా శక్తివంతమైన సాధనం..పాత్రపరంగా కథలా చెబితే స్ఫూర్తిదాయకం అవుతుందని ఆలోచించే వారు ఉన్నారు..ఆ కోవలో ఆలోచించి ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు సంయుక్తంగా చక్రవర్తి చిత్ర అనే సంస్ధ స్ధాపించి చిత్రనిర్మాణం సాగించారు. చక్రవర్తి సినిమా నిర్మించిన తొలిసినిమా సుడిగుండాలు.

చిత్రకథ[మార్చు]

చంద్రశేఖరం (అక్కినేని) ఒక ప్రసిద్ధ న్యాయనిర్ణేత (జడ్జి), సహృదయుడు, దయకలవాడూను. అతని చేతిలో శిక్ష పడ్డ నేరస్తుడి వల్ల ఆ నేరస్తుడి కుటుంబం ఇబ్బందుల పాలవకూడదనే సదుద్దేశంతో వారికి తనకి చేతనయినంతలో సహాయం చేస్తూ ఉండేవాడు. అలా ఓ రోజు విధినిర్వహణలో ఒక ముద్దాయికి మరణ / యావజ్జీవ శిక్ష విధించి న్యాయస్థానం బయటికొస్తూ అతని భార్యను ఓదారుస్తున్న సందార్భంలో ఇంటినించి కబురొస్తుంది గర్భవతీ అయిన తన భార్యకు ప్రసవవేదన పడుతోందని.చంద్రశేఖరం ఆసుపత్రికి వచ్చేసరికి భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె తనువు చాలిస్తుంది. ఆ కుర్రాడు రాజా పెరిగి పెద్దవాడవుతున్న తరుణంలో హత్యకు గురి అవుతాడు ఇద్దరు యువత చేతిల్లో.కొన్నాళ్ళకి పోలీసులు వారిని పట్టుకుని జైల్లో పెట్టి చంద్రశేఖరానికి వివరం తెలియచేస్తారు. అతను వారిని చూసి ఆశ్చర్యచకితుడై వారా హత్య ఎందుకుచేసారో తెల్సుకున్నాక విభ్రముడౌతాడు. అప్పుడే అదొక సమస్య అని, అది విషవలయంలా సమాజాన్ని చుట్టుముడుతోందని గ్రహించి ఆ ముద్దాయిల తరపున వాదించడానికి సిద్ధమౌతాడు. తీర్పునిచ్చిన కేసుని తిరిగి తెరిపించి తన వాక్పటిమతో వాదించి మనం వేసే శిక్ష వ్యక్తులకు కాకుండా ఆయా ఆయుధాలకు అంటే ఆ నేరం చెయ్యడానికి పురిగొల్పిన పరిస్థితులకు వెయ్యగలిగితే అదే అసలయిన న్యాయమవుతుందని, ఆ యువత ముఖ్యంగా “సరదాగా” హత్య చెయ్యడానికి అది సమాజంలో వారికి అందుతున్న ఆశ్లీల సాహిత్యం, హింసా ప్రవృత్తిని ప్రేరేపించే సినిమాలు. విశృంఖలమైన ఫాక్షన్, విచ్చలవిడి శృంగారం, వయసు మళ్ళిన వారిపైన పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చు కాని విరిసీ విరియని వయసులో తెలిసీ తెలియని జ్ఞానంతో సక్రమమయిన మార్గంలో నడవాల్సిన యువతపై ఇవి ఖచ్చితంగా దుష్ప్రభావమే చూపించి తీరుతాయి. అందుకు ప్రబల సాక్ష్యం మనం రోజూ చూస్తూ వింటున్న ఏసిడ్ దాడులు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, అకృత్యాలు ఇంకెన్నో ఘోరాలు, ఇతరత్రా కారణాలుగా పేర్కొంటూ వాటి దుష్ప్రభావం వల్లనే వారలా చేసారు తప్ప వారి తప్పు కాదనే మూలసూత్రంతో, యువత అలా పెంచబడడమే కారణమని సూచిస్తూ, వారిని సక్రమమయిన రీతిలో పెంచాల్సిన బాధ్యత వారి వారి తల్లితండ్రులదీ సమాజానిదేనని, అలా సక్రమ మార్గంలో పెరిగినప్పుడు యువత తప్పకుండా ఒక బాధ్యతాయుతమయిన పౌరులుగా తయారవుతారు అని తెలియచేస్తూ చంద్రశేఖరం న్యాయస్థానంలోనే తన ప్రాణాలు విడుస్తాడు.

తారాగణం[మార్చు]

సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

  • వినరా సోదరా

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూస:తెలుగు సినిమా