సుదీప్
సుదీప్ | |
---|---|
![]() 2013 లో టీచ్ ఎయిడ్స్ ఇంటర్వ్యూలో సుదీప్ | |
జననం | సుదీప్ సంజీవ్ |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగుళూరు |
వృత్తి | నటుడు, దర్శకుడు, టీవీ వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 1996–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
ప్రియా రాధాకృష్ణన్ (m. 2001) |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు | సరోజా సంజీవ్[1] |
సుదీప్ (జననం: సెప్టెంబరు 2 1973) దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత, టీవీ వ్యాఖ్యాత.[2] కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.[3]
సుదీప్ నటించిన ప్రముఖ కన్నడ సినిమాలు స్పర్శ (2000), హుచ్చా (2001), నంది (2002), కిచ్చా (2003), స్వాతి ముత్తు (2003), మై ఆటోగ్రాఫ్ (2006), ముస్సంజెమాటు (2008), వీరమడకరి (2009), జస్ట్ మాత్ మాతల్లి (2010), కెంపే గౌడ (2011).[4]
కన్నడంలో హుచ్చా (2001), నంది (2002), స్వాతి ముత్తు (2003) సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. 2013 నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
బాల్యం
[మార్చు]సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు.విరు బెదరులు అంటే బోయ రాజులు. బెంగుళూరు లోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు.[5] విశ్వవిద్యాలయం స్థాయిలో క్రికెట్ ఆటగాడు కూడా. రాష్ట్ర స్థాయిలో అండర్-17, అండర్-19 పోటీల్లో కూడా పాల్గొన్నాడు. నటుడు కావడానికి మునుపు ముంబై లోని తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు.[6]
సినిమాలు
[మార్చు]- హెబ్బులి
- ఈగ
- బాహుబలి
- దబంగ్ 3
- మరక్కార్: అరేబియా సముద్ర సింహం (2021)
- విక్రాంత్ రోణ (2022)
- కబ్జ (2023)
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ ప్రతినాయకుడు (ఈగ)[7][8][9][10]
- 2012 - ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - ఈగ
- 2012: సైమా ఉత్తమ ప్రతినాయకుడు (ఈగ)
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (20 October 2024). "సుదీప్ ఇంట తీవ్ర విషాదం". Retrieved 20 October 2024.
- ↑ "sudeep biography". entertainment.oneindia.in. Archived from the original on 2014-07-07. Retrieved 2016-09-24.
- ↑ "బిగ్‌బాస్ హోస్టింగ్‌కు గుడ్‌బై.. క్లారిటీ ఇచ్చిన నటుడు". 16 December 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ "Fame flies for Sudeep". The Hindu. 2 August 2014. Retrieved 12 April 2015.
- ↑ Sudeep (24 April 2016). Weekend with Ramesh Season 2 - Episode 33 - April 23, 2016 - Full Episode (in Kannada). ozee.com. Event occurs at 16:35. Archived from the original on 13 ఆగస్టు 2016. Retrieved 15 August 2016.
{{cite AV media}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Sudeep Sanjeev – 'Sparsha' of the Kannada film industry". bangalorebest.com. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 1 October 2014.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.