సునీత సారధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సునీత సారధి, భారతీయ గాయని. ఆమె కేవలం పాశ్చాత్య సంగీతం మాత్రమే కాక, సంప్రదాయ సంగీతం కూడా పాడుతుంది.[1] ఆమె వివిధ చర్చిల్లో గాస్పెల్ గాయనిగా కూడా ప్రసిద్ధి చెందింది. 2000లో చానల్ వి, వర్జిన్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వర్జిన్ వాయిస్ చాయిస్ అనే పోటీలో గెలుపొందింది సునీత. 2002లో సినిమాల్లో నేపధ్య గాయినిగా కెరీర్ ప్రారంభించింది ఆమె.

సునీత సారధి

యేయి! నీ రొంబ అళగే ఇరుక్కు అనే తమిళ సినిమాతో నేపధ్య గాయినిగా తెరంగేట్రం చేసింది సునీత. ఈ సినిమాలోని ఇని నానుం నానిల్లై అనే పాటను శ్రీనివాస్, సుజాతా మోహన్ లు పాడగా, అందులో మధ్యలో వచ్చే ఆలాపనలు పాడింది సునీత.[2] ఆమె వివిధ భాషల్లో దాదాపు 200 పాటలకు పనిచేసింది. కొన్ని పాటలు ఆమె పాడగా, మరి కొన్నిటికి కీబోర్డు ప్లేయర్ గానూ, తబలా వాద్య కళాకారిణిగా పనిచేసింది. ఆమె పాశ్చాత్య, సంప్రదాయ, గజ్, సోల్, నియో-సోల్ వంటి శైలిల్లో ఆమె గాయినిగా, వాద్య కళాకారిణిగా కృషి చేసింది సునీత. ఆమె గస్పెల్ పాటల్లో తనదైన శైలితో ప్రసిద్ధి చెందింది ఆమె.[3]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

పాశ్చాత్య సంగీతానికి చెందిన కుటుంబంలో జన్మించిన సునీత, తన 4వ ఏట నుంచే చర్చిలలో పాటలు పాడుతుండేది. ఆమె తల్లి సుశీల సారధి ప్రముఖ మద్రాసు గాయక బృందాన్ని నడిపేది. ఈ బృందం ద్వారా సంతొమే, లజరస్ చర్చిల్లో ప్రదర్శనలు చేసేది ఆమె. సుశీల ఈ బృందంలో పియోనా కళాకారిణిగా పనిచేసేది. ఈ బృందంలో సునీత కూడా పాల్గొనేది. ఆమె పలు చర్చిల్లో పాటలు పాడటం ద్వారా చాలా ప్రసిద్ధి చెందింది.

2000లో చానెల్ వి, వర్జిన్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వర్జిన్ వాయిస్ చాయిస్ పోటీలో గెలుపొందింది సునీత. 45,000 మంది ఈ పోటీకి అప్లై చేసుకోగా, 1,500 మంది ఎంపికయ్యారు. ఇంతమందిలో సునీత విజేతగా నిలిచింది.

పాడిన పాటలు[మార్చు]

  1. 2019: సూర్యకాంతం (బ్రేకింగ్ మై హార్ట్)

మూలాలు[మార్చు]

  1. Frederick, Prince (20 October 2011). "Sunitha Sarathy". The Hindu. Chennai, India.
  2. "My First Break – Sunitha Sarathy". The Hindu. Chennai, India. 1 April 2010.
  3. Frederick, Prince (20 October 2011). "Soaring notes". The Hindu. Chennai, India.