సునీల్ కుమార్ (కబడ్డీ)
| Personal information | |||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | ||||||||||||||||||||
| Citizenship | Indian | ||||||||||||||||||||
| Born | 1997 మే 12 భైన్స్వాల్ కలాన్, సోనీపత్ జిల్లా, హర్యానా | ||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||||||||
| Sport | కబడ్డీ | ||||||||||||||||||||
| League | ప్రో కబడ్డీ లీగ్ | ||||||||||||||||||||
| Team | పాట్నా పైరేట్స్(2016) గుజరాత్ జయింట్స్(2017-2021) జైపూర్ పింక్ పాంథర్స్(2022-2023) యు ముంబా(2024-ప్రస్తుతం) | ||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||
సునీల్ కుమార్ (జననం 1997 మే 12) హర్యానాకు చెందిన ఒక భారతీయ కబడ్డీ ఆటగాడు.[1] ఇతడు ప్రో కబడ్డీ లీగ్ (PKL) లో U ముంబా ఫ్రాంచైజీకి డిఫెండర్‌గా ఆడుతున్నాడు.[2][3]
ప్రారంభ జీవితం,నేపథ్యం
[మార్చు]కుమార్ హర్యానా సోనీపత్ జిల్లా కు చెందిన భైన్స్వాల్ కలాన్‌లోని ఒక రైతు కుటుంబానికి చెందినవాడు.[4] పర్వేష్ భైన్స్వాల్ తో సహా ఇతని దాయాదులు చాలా మంది కబడ్డీ ఆడేవారు. వారి నుండి ప్రేరణ పొందిన కుమార్ 11 సంవత్సరాల వయస్సులో ఆటను ఎంచుకున్నాడు. ఇతడు విశ్వవిద్యాలయ క్రీడలలో బాగా రాణించి కోచ్ జైవీర్ శర్మ చేత శిక్షణ తీసుకున్నాడు. తరువాత అహ్మదాబాద్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో చేరాడు.[4]
వృత్తి
[మార్చు]2015, 2016 సంవత్సరాలలో జూనియర్ నేషనల్స్ గెలిచిన తరువాత, ఇతడిని పీకేఎల్ సీజన్ 4 కోసం పాట్నా పైరేట్స్ ఎంపిక చేసింది.[4] తరువాత ఇతడు జైపూర్ పింక్ పాంథర్స్ కు బదిలీ అయ్యాడు.[5][6] ఆ తర్వాత 2022లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి తన రెండవ ట్రోఫీని గెలుచుకున్నాడు. 2023లో, కుమార్ 2022 ఆసియా క్రీడలలో భారతదేశం తరపున పోటీ పడి ఫైనల్స్‌లో ఇరాన్‌ను ఓడించి భారత జట్టుకు బంగారు పతకాన్ని సాధించాడు.[7][8][9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Sunil Kumar Biography (Kabaddi - Gujarat Fortune Giants): Early Life, Career, Pro Kabaddi League, Family, Wife, Kids, Awards, Achievements, Records, Social Media | The Sports Tattoo" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-02. Retrieved 2023-10-07.
- ↑ "Sunil Kumar profile". vivo Pro Kabaddi League (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
- ↑ Sportstar, Team (2024-08-15). "PKL Auction 2024: U Mumba buys Sunil Kumar for Rs. 1.015 crore". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2024-08-16.
- 1 2 3 "Sunil Kumar Bio & Stats | Gujarat Fortunegiants | Pro Kabaddi League". Kabaddi Adda (in ఇంగ్లీష్). Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
- ↑ "Sunil Kumar Profile, Age, Career Stats, Biography, Pro Kabaddi 2019 Season 7 Team". News18. Retrieved 2023-10-07.
- ↑ "Sunil Kumar Career, Age, Stats, Biography | Sunil Kumar Profile". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
- ↑ "Full list of Indian athletes for Asian Games 2023". Firstpost (in ఇంగ్లీష్). 2023-08-26. Archived from the original on 27 August 2023. Retrieved 2023-10-07.
- ↑ "We will win gold medal: Kabaddi legends on Indian teams' Asian Games prospects". The Times of India. 2023-10-04. ISSN 0971-8257. Archived from the original on 7 October 2023. Retrieved 2023-10-07.
- ↑ "Asian Games 2023, Day 14 Live Updates: India win men's kabaddi Gold after controversial finish". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2023. Retrieved 2023-10-07.
- ↑ "India win men's kabaddi gold after controversial final against Iran involving one hour stoppage". ESPN (in ఇంగ్లీష్). 2023-10-07. Archived from the original on 7 October 2023. Retrieved 2023-10-07.