సుప్రీత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుప్రీత్
జననం
సుప్రీత్ రెడ్డి
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002 - ప్రస్తుతం

సుప్రీత్ ఒక తెలుగు సినీ నటుడు.[1] ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు.[2] ఛత్రపతి, మర్యాద రామన్న సినిమాలో ప్రతినాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. విక్రమార్కుడు హిందీ రీమేక్ సినిమా రౌడీ రాథోడ్ లో టిట్లా అనే పాత్రతో బాలీవుడ్ లో ప్రముఖ పాత్రలో నటించాడు. అంతకు మునుపు గజినీ హిందీ రీమేక్ లో చిన్న పాత్ర కూడా పోషించాడు.

కెరీర్

[మార్చు]

సుప్రీత్ చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. తేజ జయం సినిమాకు ఆడిషన్లు జరుగుతున్నప్పుడు తృటిలో అవకాశం కోల్పోయాడు. తరువాత తేజ అతన్ని కలిసి స్వంతంగా ఆల్బం తయారు చేసుకుని ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. తరువాత పవన్ కల్యాణ్ మొదటి సారిగా దర్శకత్వం వహించిన జాని అనే సినిమాలో అవకాశం వచ్చింది. తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా కోసం రగ్బీలో శిక్షణ కూడా పొందాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడైన భిక్షు యాదవ్ (ప్రదీప్ రావత్) ప్రధాన అనుచరుడిగా నటించాడు.

అతనిలో ప్రతిభను గుర్తించిన రాజమౌళి తన తరువాత సినిమా ఛత్రపతి లో ప్రభాస్ స్నేహితుల్లో ఒకడిగా అవకాశం ఇచ్చాడు. అయితే తర్వాత ఎందుకో కాట్రాజు పాత్ర కోసం ఎంపిక చేశాడు. సుప్రీత్ అయిష్టంగానే అందుకు అంగీకరించినా ఆ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి నటుడుగా నిలబెట్టింది. తరువాత చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు.[3]

హీరోగా అతనికి అవకాశాలు వచ్చినా తను ఆ పాత్రలకు సరిపడనని అవి చేయలేదు. అతనికి వ్యక్తిగతంగా కోట శ్రీనివాసరావు, మోహన్ బాబు నటన అంటే ఇష్టపడతాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2004 ఆంధ్రావాలా[4]
2005 ఛత్రపతి కాట్రాజు
2007 ఢీ బల్లు
2008 రెడీ
2008 కింగ్
2008 విక్టరీ పాండు
2008 నేనింతే యాదు
2008 గజినీ గజినీ అనుచరుడు
2010 రగడ భగవాన్
2010 మర్యాద రామన్న మళ్ళ సూరి
2011 దూకుడు అంబర్ పేట గణేష్
2012 రౌడీ రాథోడ్ టిట్లా
2012 నిప్పు
2013 షాడో రాబర్ట్
2013 చండీ
2014 రౌడీ ఫెలో
2016 ఎక్స్‌ప్రెస్ రాజా
2017 వీడెవడు
2022 సన్‌ ఆఫ్‌ ఇండియా

మూలాలు

[మార్చు]
  1. Filmibeat. "Supreet". Filmibeat. Filmibeat. Retrieved 4 July 2016.
  2. Dosthana, Movies. "Supreet Biography, Profile". movies.dosthana.com. Dosthana. Archived from the original on 23 July 2016. Retrieved 4 July 2016.
  3. Nelapudi, Sameera. "ఆయన లేకపోతే నేను లేను". Sakshi. Jagati Publications. Sakshi. Retrieved 5 July 2016.
  4. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=సుప్రీత్&oldid=4271497" నుండి వెలికితీశారు