సుబ్రతా ముఖర్జీ
| సుబ్రతా ముఖర్జీ | |||
| |||
| పదవీ కాలం 2011 మే 20 – 2021 నవంబర్ 4 | |||
| రాష్ట్రపతి | ఎక్డాలియా ఎవర్‌గ్రీన్ క్లబ్ (1971— 2021) | ||
|---|---|---|---|
| ముందు | * సూర్జ్య కాంత మిశ్రా (పంచాయతీలు & గ్రామీణాభివృద్ధి)
| ||
సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖల మంత్రి
| |||
| పదవీ కాలం 1972 ఏప్రిల్ 2 – 1977 జూన్ 21 | |||
| తరువాత | బుద్ధదేవ్ భట్టాచార్జీ | ||
| నియోజకవర్గం | బల్లిగంజ్ | ||
| పదవీ కాలం 2011 మే 13 – 2021 నవంబర్ 4 | |||
| ముందు | అహ్మద్ జావేద్ ఖాన్ | ||
| తరువాత | బాబుల్ సుప్రియో | ||
| నియోజకవర్గం | బల్లిగంజ్ | ||
| పదవీ కాలం 1996 – 2006 | |||
| ముందు | అనిల్ ఛటర్జీ | ||
| తరువాత | సుబ్రతా బక్షి | ||
| నియోజకవర్గం | చౌరంఘీ | ||
| పదవీ కాలం 1982 – 1996 | |||
| ముందు | హరిపాద భారతి | ||
| తరువాత | సంజోయ్ బక్షి | ||
| నియోజకవర్గం | జోరాబగన్ | ||
| పదవీ కాలం 1971 – 1977 | |||
| ముందు | జ్యోతిభూషణ్ భట్టాచార్య | ||
| తరువాత | సచిన్ సేన్ | ||
| నియోజకవర్గం | బల్లిగంజ్ | ||
కోల్‌కతా 35వ మేయర్
| |||
| పదవీ కాలం 2000 జూలై 12 – 2005 జూలై 5 | |||
| Deputy | మీనా దేవి పురోహిత్ | ||
| ముందు | ప్రశాంత చటోపాధ్యాయ | ||
| తరువాత | బికాష్ రంజన్ భట్టాచార్య | ||
| Constituency | వార్డ్ నం. 87 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1946 జూన్ 14 సారంగాబాద్, బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2021 నవంబరు 4 (వయసు: 75) కోల్‌కతా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ (1999–2005) (2009–2021) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1969–1999), (2005–2009) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2005) | ||
| తల్లిదండ్రులు | అశోక్ ముఖేర్జీ | ||
| జీవిత భాగస్వామి | చందబాని ముఖర్జీ | ||
| నివాసం | సంతోష్ గార్డెన్, 8 ఎక్డాలియా రోడ్ కోల్‌కతా -700019 | ||
| పూర్వ విద్యార్థి | ఆంత్రోపాలజీలో బీఎస్సీ (బంగబాసి కళాశాల)
ఆర్కియాలజీలో ఎంఎస్సీ (కలకత్తా విశ్వవిద్యాలయం) మ్యూజియాలజీలో పీజీడీ (కలకత్తా విశ్వవిద్యాలయం) సాంస్కృతిక మానవ శాస్త్రంలో PgCert ( SOAS విశ్వవిద్యాలయం లండన్) | ||
సుబ్రతా ముఖర్జీ (జననం 1946 జూన్ 14 - 2021 నవంబర్ 4) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చౌరంఘీ, జోరాబగన్, బల్లిగంజ్ నియోజకవర్గాల నుండి పది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు[1][2][3][4][5]
ఆయన 1972లో సిద్ధార్థ శంకర్ రే మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశాడు.[6]
రాజకీయ జీవితం
[మార్చు]సుబ్రతా ముఖర్జీ కోల్‌కతాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్నిప్రారంభించి 1960లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఛత్ర పరిషత్‌లో చేరాడు. ఆయన 1971 & 1971 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో బల్లిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1972లో సిద్ధార్థ శంకర్ రే మంత్రివర్గంలో సమాచార & సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా సహాయ మంత్రిగా పని చేశాడు.
సుబ్రతా ముఖర్జీ 1977 శాసనసభ ఎన్నికలలో బల్లిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 1982, 1987 & 1991 ఎన్నికలలో జోరాబగన్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సుబ్రతా ముఖర్జీ 1996 & 2001 ఎన్నికలలో చౌరంగీ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో కలకత్తా నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. సుబ్రతా ముఖర్జీ 2000 జూలై 12 నుండి 2005 జూలై 5 వరకు కోల్‌కతా మేయర్‌గా పని చేసి 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత మమతా బెనర్జీతో విభేదాల కారణంగా తృణమూల్ కాంగ్రెస్‌ను విడి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
సుబ్రతా ముఖర్జీ 2006 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు. ఆయన 2006లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. సుబ్రతా ముఖర్జీ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం మే 2010లో భారత జాతీయ కాంగ్రెస్‌ను వీడి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు,
సుబ్రతా ముఖర్జీ 2011, 2016 & 2021 శాసనసభ ఎన్నికలలో బల్లిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2011లో మమతా బెనర్జీ మంత్రివర్గంలో ప్రజారోగ్య ఇంజనీరింగ్ మంత్రిగా నియమితులయ్యాడు. ఆయన డిసెంబర్ 2011లో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహించాడు.
సుబ్రతా ముఖర్జీ ఫిబ్రవరి 2012లో ఇండియన్ నేషనల్ తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్థి సుభాష్ సర్కార్ చేతిలో ఓడిపోయాడు.
మరణం
[మార్చు]సుబ్రతా ముఖర్జీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో 2021 అక్టోబర్ 25న ఆయనను కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్పించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో 2021 నవంబరు 5న గుండెపోటుతో మరణించాడు.ఆయన భార్య చందబాని ఉన్నారు.[7][8][9][10][11]
మూలాలు
[మార్చు]- ↑ "Subrata Mukherjee (1946-2021): Political all-rounder" (in ఇంగ్లీష్). Frontline. 24 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "The many hats of Subrata Mukherjee: Orator, actor, Mamata's mentor" (in ఇంగ్లీష్). India Today. 5 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "From student unionist to Indira's close aide to Mamata's mentor: Subrata Mukherjee passes away at 75" (in ఇంగ్లీష్). EdexLive. 5 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "Subrata Mukherjee was Mamata's mentor and administrator who made TMC popular" (in ఇంగ్లీష్). The Week. 5 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "Subrata Mukherjee: Deft Politician, Able Administrator and a Man for All Seasons" (in ఇంగ్లీష్). News18. 5 November 2021. Retrieved 5 July 2025.
- ↑ "Bengal Minister Subrata Mukherjee given additional charge of Sadhan Pande's departments" (in Indian English). The Hindu. 21 August 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "Bengal minister Subrata Mukherjee, 75, dies. Heartbroken, says Mamata Banerjee" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 4 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "TMC veteran Subrata Mukherjee cremated with full state honours" (in ఇంగ్లీష్). India Today. 6 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత". Sakshi. 5 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "గుండెపోటుతో బెంగాల్ మంత్రి మృతి". V6 Velugu. 5 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "Ailing Bengal minister Subrata Mukherjee dies at 75" (in ఇంగ్లీష్). The Indian Express. 5 November 2021. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.