Jump to content

సుబ్రతా ముఖర్జీ (సీపీఎం రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
సుబ్రతా ముఖర్జీ

పదవీ కాలం
1991  1999
ముందు గోలం యజ్దానీ
తరువాత ప్రియారంజన్ దాస్ మున్షీ
నియోజకవర్గం రాయ్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1942-10-12) 1942 అక్టోబరు 12 (వయసు: 83)
దల్ఖోలా, పశ్చిమ దినాజ్‌పూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం)
తల్లిదండ్రులు రూప్ నారాయణ్ ముఖర్జీ
జీవిత భాగస్వామి
కృష్ణ ముఖర్జీ
(m. 1972)
సంతానం ఒక కొడుకు, ఒక కూతురు
నివాసం పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

సుబ్రతా ముఖర్జీ (జననం 12 అక్టోబర్ 1942) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సుబ్రతా ముఖర్జీ సిపిఐ (ఎం) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984, 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గోలం యజ్దానీపై 29,968 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సుబ్రతా ముఖర్జీ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గోలం యజ్దానీపై 10956 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రియారంజన్ దాస్ మున్షీపై 6281 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సుబ్రతా ముఖర్జీ 1999 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రియారంజన్ దాస్ మున్షీ చేతిలో 39147 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Raiganj Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 6 July 2025. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
  2. "Raiganj (West Bengal) Lok Sabha Election Results Till 2019". Elections. 6 July 2025. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.