సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)
| సుబ్రహ్మణ్యపురం | |
|---|---|
సుబ్రహ్మణ్యపురం సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి |
| రచన | ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి |
| నిర్మాత | బీరం సుధాకరరెడ్డి ధీరజ్ బొగ్గరం |
| తారాగణం | |
| Narrated by | రానా దగ్గుబాటి |
| ఛాయాగ్రహణం | ఆర్.కె. ప్రతాప్ |
| కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
| సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థలు | సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ టారస్ సినీకార్ప్ |
విడుదల తేదీs | 7 డిసెంబరు, 2018 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సుబ్రహ్మణ్యపురం, 2018 డిసెంబరు 7న విడుదలైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్, టారస్ సినీకార్ప్ బ్యానర్లలో బీరం సుధాకరరెడ్డి, ధీరజ్ బొగ్గరం నిర్మించిన ఈ సినిమాకి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో సుమంత్, ఈషా రెబ్బ, సాయి కుమార్, సురేష్ తదితరులు నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]- సుమంత్ (కార్తీక్)
- ఈషా రెబ్బ (ప్రియ)
- సాయి కుమార్ (ఆయుష్మాన్)
- సురేష్ (వర్మ)
- సూర్య
- రఘునాథ రెడ్డి
- అమిత్ శర్మ
- వజ్జ వెంకట గిరిధర్
- భద్రమ్
- జోష్ రవి
- హర్షిణి
- టిఎన్ఆర్
నిర్మాణం
[మార్చు]2018 ఫిబ్రవరిలో దర్శకుడు, సుమంత్‌కు కథను వివరించాడు. ఈ సినిమాలో సుమంత్ నాస్తికుడిగా నటించాడు.[1] ఇది సుమంత్ 25వ సినిమా. 2018 మార్చిలో ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రారంభించబడి, తూర్పు గోదావరి, హైదరాబాదులోని శ్రీరామపురంలో షూటింగ్ జరుపుకుంది.[2][3] 2018 జూలైలో సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది.[4] ఆగస్టులో దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది.[5] ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.[6] 2018 అక్టోబరులో షూటింగ్ పూర్తయింది.[7] అక్టోబరు చివరలో దసరా పండుగ సందర్భంగా టీజర్ విడుదలయింది.[8] నవంబరులో సినిమా ట్రైలర్ విడుదలయింది.[9]
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను శేఖర్ చంద్ర స్వరపరిచాడు.[10]
- "ఈ రోజిలా" (రచన: సురేష్ బానిసెట్టి, గానం: అనురాగ్ కులకర్ణి, నూతన)[10]
- "స్నేహం" (రచన: పుర్ణాచారి, గానం: ధనుంజయ్) [11]
- "సాహో షణ్ముఖ" (రచన: జొన్నవితుల రామలింగేశ్వర రావు, గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)
స్పందన
[మార్చు]123తెలుగు.కామ్ ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చింది.[12] ది హిందూ పత్రిక ఈ సినిమాకి మిశ్రమ సమీక్ష ఇచ్చింది.[13] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 2.5/5 ఇచ్చింది.[14]
మూలాలు
[మార్చు]- ↑ Dundoo, Sangeetha Devi (December 3, 2018). "Sumanth's next is the supernatural thriller, 'Subrahmanyapuram'". The Hindu.
- ↑ "Sumanth's 25th flick titled, 'Subrahmanyapuram' - Times of India". The Times of India.
- ↑ "'Subrahmanyapuram' shooting underway in Hyderabad - Times of India". The Times of India.
- ↑ "'Subramanyapuram': The first look of Sumanth Akkineni starrer unveiled - Times of India". The Times of India.
- ↑ "'Subrahmanyapuram': The Sumanth starrer has completed 50 percent of the shoot - Times of India". The Times of India.
- ↑ "Rana Daggubati lends his voice for Sumanth's 'Subrahmanyapuram' - Times of India". The Times of India.
- ↑ "'Subrahmanyapuram': Sumanth wraps up the shoot of his next - Times of India". The Times of India.
- ↑ "'Subrahmanyapuram' Teaser: Sumanth plays an atheist researcher in this mystery-thriller - Times of India". The Times of India.
- ↑ "'Subrahmanyapuram' Trailer: Riveting tale set in a mysterious village - Times of India". The Times of India.
- ↑ 10.0 10.1 "'Subrahmanyapuram': Sumanth unveils the lyrical video 'EeRojila' from the film - Times of India". The Times of India.
- ↑ "Subrahmanyapuram Full Songs Jukebox - Sumanth, Eesha Rebba - Santhossh Jagarlapudi". Madhura Audio. 3 December 2018.
- ↑ 123telugu (2018-12-08). "Subramaniapuram Telugu Movie Review" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-10-27.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chowdhary, Y. Sunita (December 7, 2018). "'Subrahmanyapuram' review: Lacklustre narration". The Hindu.
- ↑ "Subrahmanyapuram Movie Review {2.5/5}: Critic Review of Subrahmanyapuram by Times of India". The Times of India.