Jump to content

సుభాష్ సచ్‌దేవా

వికీపీడియా నుండి
సుభాష్ సచ్‌దేవా

పదవీ కాలం
2014 – 2015
ముందు మదన్ లాల్ ఖురానా
తరువాత శివ చరణ్ గోయల్
నియోజకవర్గం మోతీ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-04-25) 1956 ఏప్రిల్ 25 (వయసు: 69)
పానిపట్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఢిల్లీ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

సుభాష్ సచ్‌దేవా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు మోతీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సుభాష్ సచ్‌దేవా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో మోతీ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రామ్ మాగోపై 9,977 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అంజలి రాయ్‌పై 14,997 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సుభాష్ సచ్‌దేవా 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి కుల్దీప్ సింగ్ చన్నాపై 16,021 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2015 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి శివ చరణ్ గోయల్ చేతిలో 15,221 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Subhash Sachdeva". Archived from the original on 9 ఏప్రిల్ 2015. Retrieved 26 జనవరి 2015.
  2. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  3. "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "Delhi Assembly polls: Moti Nagar set to witness tough BJP-AAP battle". Business Standard. 11 January 2020. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.
  5. "Shiv Charan Goel AAP candidate from Moti Nagar won by 15221 votes: Constituency wise Delhi Election Results" (in ఇంగ్లీష్). 10 February 2015. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.