Jump to content

సుమిత్రానందన్ పంత్

వికీపీడియా నుండి
సుమిత్రానందన్ పంత్
सुमित्रा नन्‍दन पंत
సుమిత్
పుట్టిన తేదీ, స్థలంసుమిత్రానందన్ నందన్ పంత్
(1900-05-20)1900 మే 20
కౌసాని గ్రామం, అల్మోరా జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం
మరణం1977 డిసెంబరు 28(1977-12-28) (వయసు 77)
రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
కలం పేరుPoems = నారీ, భరతమాత గ్రామవాసిని, మాయి సబ్సే ఛోటే హూఁ
వృత్తిరచయిత, కవి
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుడు
విద్యహిందీ సాహిత్యం
విషయంసంస్కృతం
పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం
నెహ్రూ శాంతి పురస్కారం

సుమిత్రానందన్ పంత్ 1900 మే 20 న ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా కాసాని గ్రామంలో జన్మించారు. ఆయన హిందీ కవులలో ప్రముఖులు. "ఛాయావాది" అనే యుగపు కవులలో ఒకరిగా ఈయన్ని పరిగణిస్తారు. ఈయన సంస్కృతీకరించిన హిందీలో వ్రాసారు. కవిత్వం, నాటకాలు, వ్యాసాలు మొత్తం కలిపి 28 కృతులు రాసారు. ఛాయావాది కవితలే కాకుండా, పంత్ అభ్యుదయవాద, ఆధ్యాత్మిక (ఆరోబిందో ప్రభావంతో), సామాజిక, మానవీయ రచనలు కూడా చేసారు.[1]

పంత్ జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి హిందీ కవి. 1968 లో ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈయన వ్రాసిన కవితా సంకలనం "చిదంబర"కు గానూ ఈ పురస్కారం ఇచ్చారు.[2] ఈయనకు అప్పటి సోవియట్ యూనియన్ రష్యా వారు నెహ్రూ శాంతి పురస్కారం ప్రదానం చేసారు. ఇది ఈయన రాసిన లోకాయతన్ అనే రచనకు ఇచ్చారు. "కలా ఔర్ బుద్ధచంద్" అనే రచనకు గానూ సాహిత్య కలా అకాదమీ పురస్కారం పొందారు.భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో ఈయనను సత్కరించింది.

కాసానిలోని పంత్ చిన్ననాటి స్వగృహాన్ని ఒక సంగ్రహాలయంగా మార్చారు. ఈ సంగ్రహాలయంలో ఆయన రోజువారి వాడిన వస్తువులు, ఆయన కవితల చిత్తుప్రతులు, లేఖలు, పురస్కారాలు భద్రపరచి ఉన్నాయి.

ఐఐటీ రూర్కీ వారి సంస్థ గీతాన్ని ఈయన రచించి ఇచ్చారు. ఈ పాట "జయతి జయతి విద్యా సంస్థాన్" అన్న పదాలతో ఉంటుంది. ఈయన 1977 డిసెంబరు 28 న రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్) లో మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "ఛాయావాది కవి సుమిత్రానందన్ పంత్".
  2. "జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల అధికారిక జాబితా". జ్ఞానపీఠ జాలస్థలి. Archived from the original on 2007-10-13. Retrieved 2015-02-26.