సుమిత్ర బాల్మిక్
సుమిత్ర బాల్మిక్ పార్లమెంటు సభ్యురాలు | |
|---|---|
| రాజ్యసభ సభ్యుడు | |
| Assumed office 2022 | |
| నియోజకవర్గం | మధ్యప్రదేశ్ |
| మధ్యప్రదేశ్ బిజెపి ఉపాధ్యక్షురాలు | |
| Assumed office 2021 | |
| జబల్పూర్ లో మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ | |
| In office 2014–2019 | |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1955 July 1 జబల్పూర్ |
| జాతీయత | భారతీయురాలు |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| సంతానం | 3 |
| నివాసం | జబల్పూర్, మధ్యప్రదేశ్ |
| నైపుణ్యం | రాజకీయవేత్త |
సుమిత్ర బాల్మిక్ (ఆంగ్లం: Sumitra Balmik; జననం 1955 జూలై 1) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు. ఆమె భారతీయ జనతా పార్టీ, మధ్యప్రదేశ్ యూనిట్ ఉపాధ్యక్షురాలు.[1]
కెరీర్
[మార్చు]ఆమె 1993లో భారతీయ జనతా పార్టీ, మధ్యప్రదేశ్ యూనిట్లో సభ్యురాలిగా చేరింది. 1999లో మధ్యప్రదేశ్ జబల్‌పూర్ నుంచి ఆమె తొలిసారి కౌన్సిలర్ గా ఎన్నికయింది. 2004లో మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ నుండి కౌన్సిలర్ గా ఆమె రెండోసారి తిరిగి ఎన్నికయింది.
2006లో, సుమిత్ర బాల్మిక్ జబల్‌పూర్ నుండి మహిళా మోర్చా నగర అధ్యక్షురాలైంది. అదే సంవత్సరంలో, ఆమె జబల్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ఛైర్మన్ గా కూడా ఎన్నికయింది. 2014లోనూ తిరిగి ఆమె కౌన్సిలర్ అయింది, ఆ తరువాత ఆమె మునిసిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎన్నికయింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుమిత్ర బాల్మిక్ పటాన్-తెహ్సిల్ జబల్‌పూర్ జిల్లాలోని షాహ్పురాలో ఒక దళిత కులంనకు చెందిన కుటుంబంలో జన్మించింది. ఆమె ప్రభుత్వ పాఠశాల నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. పటాన్-తెహ్సిల్ జబల్‌పూర్ జిల్లాలోని షాహ్పురా పాఠశాల, జబల్‌పూర్ జిల్లా ప్రభుత్వ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత, ఆమె వారి ప్రాంతంలోని మహిళల సాధికారత కోసం టైలరింగ్ తరగతులను నిరంతరం బోధిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేసింది. ఆమెకు న్యాయశాస్త్రం గురించి కూడా జ్ఞానం ఉంది. వారి ప్రాంతంలోని మహిళా సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతుంది. ఆమె సామాజిక అంకితభావం ఆమెను ప్రజాదరణ పొందేలా చేస్తుంది.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Sumitra Balmik". PRS Legislative Research. 16 Oct 2023. Retrieved 16 Oct 2023.
- ↑ "Rajya Sabha olls 2022: Full list of candidates elected unopposed to Upper House". Times Now. 3 June 2022. Retrieved 3 June 2022.[permanent dead link]
- ↑ "हैलो...भोपाल आने के लिए हेलिकाप्टर भेजें क्या?:CM शिवराज का फोन सुन हैरान रह गईं राज्यसभा प्रत्याशी सुमित्रा वाल्मीकि; जानिए पूरी कहानी". Dainik Bhaskar. Retrieved 1 June 2022.
- ↑ "BJP's Rajya Sabha candidates from Madhya Pradesh file nominations". India Today. 31 May 2022. Retrieved 1 June 2022.