సురభి బాబ్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సురభి బాబ్జీ గా పేరు పొందిన రెకెందర్ నాగేశ్వరరావు సురభి రెకెందర్ కుటుంబం వారు. ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ ఒకే తెరపైన చూపిస్తున్నారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సురభి సంస్థ. ఈ సురభి పౌరాణిక నాటకాలు పెట్టింది. 125 ఏళ్లు గడిచినా తనదైన పంథా నిరాఘాంటంకంగా సాగిపోయే ఏకైక నాటక సంస్థగా ఆకాశాన్నంటే ఎత్తులకు ఎదిగింది. దీన్ని వనారస గోవిందరావు మొదలుపెడితే ఈ సంస్థ కాస్తా ఉమ్మడి కుటుంబంగా పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించింది.

అప్పట్నుంచి ఇప్పటివరకు సురభి పద్యనాటకాలు, లేదా పౌరాణిక నాటకాలు ఒరవడికి పేర్గాంచింది. అలాంటి సురభి కుటుంబంలో రెకెందర్ కుటుంబం ఒకటి. వనారస గోవిందరావు కుమార్తె రెకెందర్ సుభద్రమ్మ. ఈమె కుమారుడే రెకెందర్ నాగేశ్వరరావు. ఈ కుంటుంబాల పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన తెలుగు నాట వివిధ ప్రాంతాలలో స్థిర పడ్డారు. మొదట్లో వీరు బ్రిటీష్ వారి వద్ద సైనికులుగా పనిచేశారు. వీరి వాడుక భాష ఆరె

ఆయన 1949లో విజయనగరం జిల్లా గజపతి నగరంలో జన్మించారు. హెచ్.ఎల్.సీ వరకు చదువుకున్న నాగేశ్వరరావు 4 సంవత్సరాల వయస్సులోనే బాల నటునిగా రంగస్థల ప్రవేశం చేశారు.

శ్రీరామ, శ్రీకృష్ణ, వీరబ్రహ్మం, నక్షత్రక, కార్యవర్థి, మొదలైన పాత్రలు పోషించి ప్రేక్షకులను తన నటనతో రజింపచేశారు. వీరి గురువులు గరిమెళ్ల రామమూర్తి, పద్మ శ్రీ బి.వి. కారత్‌లు. ఈయన నటనతో పాటు రంగస్థల నిర్వహణ కూడా చేపట్టి విజయవంతమైన నాటకాలు ప్రదర్శింప చేసి కీర్తి గడించారు.

సురభి పరంపరకు చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్యమండలికి 42 సంవత్సరాలుగా కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాక అయిదు సురభి ఫెడరేషన్ ఉమ్మడి బ్యానర్ అయిన సురభి నాటక కళా సంఘానికి 24 సంవత్సరాల నుండి కార్యదర్శిగా కొనసాగుతునే ఉన్నారు. నాగేశ్వరరావు దర్శకత్వంలో రామరాజ్యం, శ్రీ కృష్ణ లీలలు, వీర బ్రహ్మం, బాలనాగమ్మ, జై పాతాళ భైరవి కాక దేశవ్యాప్తంగా వివిధ నాటక సంస్థలకు, కళాకారులకు వీరు సుపరిచితులు. చైన్నై, ముంబై, బెంగుళూరు, గోవా తదితర నగరాలల్లోనే కాక అనేక రాష్ట్రాలల సురభి నాటకాలను విజయవంతంగా ప్రదర్శించారు. సురభిసంస్థ ఆవిర్భవించి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సురభి ధియేటర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు ఇటీవల సంగీత నాటక అకాడమీ వారు అత్యున్నత పురస్కారంతో గౌరవించారు.

నాగేశ్వరరావు కృషిని ప్రతిభను గుర్తించిన అనేకమంది ప్రముఖులు జ్ఞాని జైల్‌సింగు, పి.వి. నరసింహారావు, ఎన్.టి.ఆర్. వంటి ఎందరో అభినందనలు అందచేశారు. 2000 సంవత్సరంలో రాష్టస్థ్రాయి ఉత్తమ నాటక రంగ నిర్వాహకునిగా పురస్కారం 2004లో బళ్లారి రాఘవ పురస్కారం పొందారు. కుటుంబ సభ్యులతో అక్కడే నిరాడంబరంగా జీవిస్తూ అత్యంత ఆధునిక సాంకేతిక విలువలతో కూడిన అద్భుతమైన పౌరాణిక నాటకాలను ఇప్పటికీ ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ప్రదర్శింప చేస్తూ రంగస్థల కళ అయిన నాటకాన్ని జీవనదిలా ప్రవహింప చేస్తున్నారు

మూలాలు[మార్చు]