సురేంద్రపురి
నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు సమీపంలో కలదీ క్షేత్రం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో మొదటిది, ఇక్కడగల సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం ఈ క్షేత్రం హైదరాబాదుకు 60 కి.మీ దూరంలో కలదు[1] నగర శివార్లలో ఉన్న సురేంద్రపురి ఒక అద్భుతమైన మ్యుజియం. పౌరాణిక అవగాహన కేంద్రంగా కూడా ఈ మ్యూజియంని పిలుస్తారు. భారత పురాణాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యుజియమ్ ని ఏర్పాటు చేసారు. కుండా సత్యనారాయణ్ కుమారుడు సురేంద్ర పేరుతొ ఈ సురేంద్రపురి మ్యుజియం పేరు పెట్టారు. తన కుమారుడి పేరు అమరంగా ఉండడానికి ఈ మ్యూజియాన్ని స్థాపించిన సత్యనారాయణ్ గారు ఈ మ్యూజియానికి సురేంద్రపురి మ్యూజియం అన్న పేరు పెట్టారు. భారతదేశంలో ఉన్నప్రఖ్యాతమైన, ముఖ్యమైన ఆలయాల మినియెచర్ లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి.ఈ వైవిధ్యమైన అంశం సందర్శకులని అమితంగా ఆకర్షిస్తుంది. ప్రముఖమైన ఆలయాల యొక్క ఖచ్చినమైన ప్రతిరూపాలని తయారు చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఆలయాల పైన ఉండే శిల్పకళలూ నిర్మాణ శైలి ఇలా ప్రతి విషయం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ మినీయెచర్ ఆలయాలని అద్భుతంగా తయారు చేసారు. హిందువుల దేవుళ్ళని, దేవతలని వర్ణించే శిలావిగ్రహాలు, చిత్రలేఖనాలు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియాన్ని ఒక్క సారి సందర్శిస్తే భారత దేశ పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు
చిత్రమాలిక
[మార్చు]-
Budhadeva
-
Chandra Rohini
-
Guru Tara
-
Ketudeva
-
Mangaldeva
-
Rahudeva
-
Shukradeva
-
Compound wall
-
Kalasham
-
Mukha Dawaram
-
Suryadeva
సూచికలు
[మార్చు]- ↑ "Surendrapuri Travel Guide". Archived from the original on 2010-01-24. Retrieved 2013-08-19.