సురేంద్ర పాల్ సింగ్
| సురేంద్ర పాల్ సింగ్ | |||
| పదవీ కాలం 2003 – 2013 | |||
| ముందు | జగదీష్ ఆనంద్ | ||
|---|---|---|---|
| తరువాత | హరీష్ ఖన్నా | ||
| నియోజకవర్గం | తిమర్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సురేంద్ర పాల్ సింగ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు తిమర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సురేంద్ర పాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2003 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో తిమర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గుప్తాపై 5,974 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సూర్య ప్రకాష్ ఖత్రిపై 832 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సురేంద్ర పాల్ సింగ్ 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో తిమర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 32,825 ఓట్లతో మూడోస్థానంలో, 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 14,642 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2017 నవంబర్ 5న కాంగ్రెస్ పార్టీని వీడి ఢిల్లీ యూనిట్ కన్వీనర్ అశుతోష్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.[1][2]
సురేంద్ర పాల్ సింగ్ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు 2019 జూలై 2న ఆమ్ ఆద్మీ పార్టీని వీడి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, ఎంపి హన్స్ రాజ్ హన్స్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3] ఆయన 2020 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దిలీప్ పాండే చేతిలో 24,144 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు 2024 డిసెంబర్ 6న భారతీయ జనతా పార్టీని వీడి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Ex-Congress MLA joins AAP". The Times of India. 4 November 2017. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ "Two-time Congress MLA Surendra Pal Singh Bittu, eight others join AAP" (in ఇంగ్లీష్). The Indian Express. 5 November 2017. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ "Two-time Congress MLA, BSP legislator join BJP" (in ఇంగ్లీష్). The New Indian Express. 2 July 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ "Surendra Pal Singh joins AAP ahead of Delhi Assembly polls" (in Indian English). The Hindu. 6 December 2024. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.