Jump to content

సురేష్ కృష్ణ (నటుడు)

వికీపీడియా నుండి
సురేష్ కృష్ణ
జననంసురేష్ కుమార్
(1973-04-05) 1973 April 5 (age 52)
గురువాయూర్, కేరళ, భారతదేశం
వృత్తినటుడు
భార్య / భర్త
శ్రీ లక్ష్మి
(m. 2006)
పిల్లలుఅనంతకృష్ణ
ఉన్నిమాయ
తల్లిదండ్రులుబాలకృష్ణ పణిక్కర్
పార్వతి

సురేష్ కృష్ణ (జననం 1973 ఏప్రిల్ 5) ప్రధానంగా మలయాళ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ నటుడు. క్రిస్టియన్ బ్రదర్స్, ప్రజా, మంజు పొలొరు పెంకుట్టి, పళస్సి రాజా, కుట్టి శ్రాంక్ చిత్రాలలో ఆయన నటనకు ప్రసిద్ధి చెందాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సురేష్ కృష్ణ 1973 ఏప్రిల్ 5న త్రిస్సూర్ జిల్లా గురువాయూర్ లో బాలకృష్ణ పణిక్కర్, పార్వతి దంపతులకు ఆరుగురు పిల్లలలో చిన్నవాడుగా జన్మించాడు. ఆయన తండ్రి తమిళనాడు ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో పనిచేసాడు. సురేష్ చెన్నైలో చదువుకున్నాడు.

కొచ్చిలో ప్రొఫెసర్ అయిన శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[1]

కెరీర్

[మార్చు]

1990లో మధుమోహన్ నిర్మించిన దూరదర్శన్ లోని తమిళ సీరియల్ తో సురేష్ అరంగేట్రం చేసాడు. 1995లో, సురేష్ సుప్రసిద్ధ తిరువళ్ళువర్ పాత్రను పోషించి, తమిళనాడు అంతటా తక్షణ గుర్తింపును సంపాదించాడు.[2] ఆయన తమిళ సినిమాలు, టెలివిజన్లలో బిజీ అయిన సమయంలో మలయాళంలో అడుగుపెట్టే అవకాశం లభించింది, స్త్రీ జన్మం సీరియల్లో నటించాడు. ఆ తరువాత, ఆయన కె. కె. రాజీవ్ స్వప్నంలో బాలశంకర్ పాత్ర పోషించాడు. ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఏషియానెట్ సినీ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నాడు. ఆ తరువాత, ఆయన ఏషియానెట్ లో ప్రసారమైన ఓర్మాలో సూర్య పాత్రను పోషించాడు.


1993లో సురేష్ మలయాళంలో పెద్ద తెరపై చమయం చిత్రంతో తెరంగేట్రం చేసాడు. అప్పటి నుండి ఆయన పలు మలయాళ చిత్రాలలో ప్రధాన దర్శకులు, తారలతో కలిసి పనిచేసాడు. ఇందులో కమల్ (మంజు పొలూరు పెంకుట్టి, రాపక్కల్), సంతోష్ శివన్ (అనంతభద్రమ్), రంజిత్ (పలేరి మాణిక్యం, కేరళ కేఫ్, ఇండియన్ రూపీ), జోషి (క్రిస్టియన్ బ్రదర్స్), షాజీ ఎన్. కరుణ్ (కుట్టి శ్రాంక్), హరిహరన్ (పళస్సీ రాజా) చెప్పుకోతగ్గవి.[3][4]

2014లో ఆయన దర్శకుడు రంజిత్ తో కలిసి నిజాన్ చిత్రంలో నటించి మెప్పించాడు. 2024లో, అతను సోషల్ మీడియాలో అకస్మాత్తుగా కొత్త ప్రజాదరణ 'కన్విన్సింగ్ స్టార్' గా గుర్తింపు తెచ్చుకున్నాడు.[5]

నటుడు బిజు మీనన్, దర్శకుడు షజూన్ కరియాల్, స్క్రిప్ట్ రైటర్ సచీ, సినిమాటోగ్రాఫర్ పి. సుకుమార్ లతో పాటు సురేష్ తక్కళి ఫిల్మ్స్ ద్వారా నిర్మాతగా కూడా మారాడు. లాల్, బిజు మీనన్, సురేష్ కృష్ణ, పి. సుకుమార్, సునీల్ బాబు, మియా మొదలూఐన వారు నటించిన మొదటి చిత్రం చెట్టాయీస్ నవంబరు 2012లో విడుదలైంది. ఈ చిత్రం విలన్ శైలి పాత్రల నుండి కామెడీ వరకు అతని నైపుణ్యాలను మరింత అన్వేషించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Profile". The Official Website of Suresh Krishna (in ఇంగ్లీష్). Retrieved 12 July 2018.
  2. "Suresh Krishna: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India.
  3. "Suresh Krishna in full swing". India Glitz. 12 November 2010. Retrieved 12 July 2018.
  4. "'ഇടി വാങ്ങുന്ന കഥാപാത്രങ്ങള്‍ നിര്‍ത്തിക്കൂടെയെന്ന് മക്കള്‍ പലപ്പോഴും ചോദിച്ചിട്ടുണ്ട്'". 5 October 2019 – via Mathrubhumi.
  5. "Suresh Krishna's 'convincing star' memes takes social media by storm". On Manorama. 25 September 2024. Retrieved 25 September 2024.
  6. "A reason to smile". Khaleej Times. 16 December 2012. Archived from the original on 12 జూలై 2018. Retrieved 12 July 2018.