సురేష్ చందేల్
| సురేష్ చందేల్ | |||
| పదవీ కాలం 1989 – 1999 | |||
| ముందు | విక్రమ్ సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | ప్రేమ్‌కుమార్ ధుమాల్ | ||
| నియోజకవర్గం | హమీర్పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 మార్చి 19 బిలాస్పూర్ , హిమాచల్ ప్రదేశ్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | అనితా చందేల్ | ||
| సంతానం | 2 కుమారులు, 1 కుమార్తె | ||
| నివాసం | బిలాస్పూర్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సురేష్ చందేల్ (జననం 19 మార్చి 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హమీర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సురేష్ చందేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హమీర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మేజర్ జనరల్ బిక్రమ్ సింగ్ పై 77909 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఠాకూర్ రామ్ లాల్ పై 129247 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
సురేష్ చందేల్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హమీర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఠాకూర్ రామ్ లాల్ పై 1615 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
సురేష్ చందేల్ 2019 ఏప్రిల్ 22న భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుల్దీప్ రాథోడ్, హిమాచల్ ప్రదేశ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ రజనీ పాటిల్ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి,[1][2] తిరిగి 2022 అక్టోబర్ 4న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కశ్యప్, ప్రధాన కార్యదర్శి త్రిలోక్ జామ్వాల్, సంస్థ కార్యదర్శి పవన్ రాణా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Former BJP MP Suresh Chandel joins Congress" (in ఇంగ్లీష్). The New Indian Express. 22 April 2019. Retrieved 1 June 2025.
- ↑ "Himachal Pradesh: Former MP and BJP president Suresh Chandel joined Congress". The Times of India. 22 April 2019. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
- ↑ "Jolt to Congress as former Hamirpur MP Suresh Chandel goes back to BJP". Hindustan Times. 4 October 2022. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.