సురేష్ చౌదరి
సురేష్ చౌదరి | |||
పదవీ కాలం 2008 – 2013 | |||
ముందు | మెహర్బన్ సింగ్ రావత్ | ||
---|---|---|---|
తరువాత | మెహర్బన్ సింగ్ రావత్ | ||
నియోజకవర్గం | సబల్‌ఘర్ | ||
పదవీ కాలం 1993 – 1998 | |||
ముందు | మెహర్బన్ సింగ్ రావత్ | ||
తరువాత | బుందిలాల్ రావత్ | ||
నియోజకవర్గం | సబల్‌ఘర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | మధ్యప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సురేష్ చంద్ర చౌదరి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సురేష్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1980 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి నావల్ సింగ్ పై 1185 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1993 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి బూండి లాల్ రావత్ పై 1804 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సురేష్ చౌదరి 1998 శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు, 2003 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి మూడవస్థానంలో నిలిచాడు. ఆయన 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి మెహర్బన్ సింగ్ రావత్ పై 9041 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మరణం
[మార్చు]సురేష్ చౌదరి 2014 నవంబర్ 1న గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
- ↑ "Former Congress MLA Suresh Choudhary passes away". Business Standard. 14 November 2014. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.