సుర్గుజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Surguja జిల్లా

सरगुजा जिला
Chhattisgarh లో Surguja జిల్లా స్థానము
Chhattisgarh లో Surguja జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంChhattisgarh
ముఖ్య పట్టణంAmbikapur, India
విస్తీర్ణం
 • మొత్తం15 కి.మీ2 (6,074 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం23,61,329
 • సాంద్రత150/కి.మీ2 (390/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత61.16
 • లింగ నిష్పత్తి991
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చత్తీస్‌గఢ్ రాష్ట్ర 27 జిల్లాలలో సుర్గుజా (सरगुजा) జిల్లా ఒకటి. అంబికాపూర్ జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా సరిహద్దులలో ఉత్తర ప్రదేశ్ మరియు జార్ఖండ్, దక్షిణ సరిహద్దులో వింద్యపరత్వం శ్రేణిలోని బగెల్ఖండ్ ప్రాంతం ఉంది.

చరిత్ర[మార్చు]

శ్రీరాముడు 14 సంవత్సరాల కాలంలో అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రామారణ మహాకావ్యంతో సంబంధం ఉన్న పలు ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రామచంద్రుని విజయం తరువత్త జిల్లాలోని పలు ప్రాంతాలకు రాంగర్, సీతా-భెంగ్రా మరియు లక్ష్మణ్‌గర్ వంటి పేర్లు వచ్చాయని భావిస్తున్నారు.[1] మౌర్య సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని నందరాజుల చేత పాలించబడింది. క్రీ.పూ 1820 లో ఈ ప్రాంతం చిన్నచిన్న రాజాస్థానాలుగా విభజించబడింది. తరువాత రక్షల్ రాజవంశానికి చెందిన రాజపుత్రరాజు ప్రస్తుత జార్ఖండ్ ప్రాంతం మీద దండయాత్ర సాగించి ఈ ప్రాతం మీద ఆధిక్యత సాధించాడు. 1820లో అమరసింగ్ మహారాజుగా సింహాసనాధిష్టుడు అయ్యాడు. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో సుర్గుజా ప్రాంతం రాజాస్థానంగా ఉంది.[1][2] ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది..[3]

భౌగోళికం[మార్చు]

జిల్లా 23°37'25" నుండి 24°6'17" డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 81°34'40" నుండి 84°4'40" డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 16359చ.కి.మీ. .[1] సుర్గుజా జిల్లాలోని ఎగువభూములు చిన్న " టేబుల్ లాండ్స్ " లతో కూడిన " ప్యాట్ ఫార్మేషన్"కి చెందినవి. జిల్లాలోని ది మైంపాట్, ది జరంగ్ పాట్, ది జొంకా పాట్, ది జమిరా పాట్ మరియు ది లాహ్సన్‌పాట్ ప్రధానమైనవి. ఈ ప్రాంతపు సరాసరి ఎత్తు 600 మీ. జిల్లాలో మైలాన్ శిఖరం ఎత్తు 1226 మీ, జాం శిఖరం ఎత్తు 1166మీ, పార్తా ఘర్సా శిఖరం ఎత్తు 1159 మీ, కందాదర శిఖరం ఎత్తు 1149 మీ, చుటై శిఖరం ఎత్తు 1131 మీ మరియు కారో శిఖరం ఎత్తు 1105 మీ. శిఖరాలతో పలు శిఖరాలు ఉన్నాయి. జిల్లా వాయవ్యప్రాంతం కొండలతో నిండి ఉంది. రిహాండ్ నది మరియు దాని ఉపనదులు ప్రవహిస్తున్న మద్య సుర్గుజాలో దిగువభూములు ఉన్నాయి. జిల్లాలో భూభాగం 3 భాగాలుగా విభజించబడింది. తూర్పున శ్రీనగర్ వద్ద పాట్నా మరియు కర్గవాన్‌కు చెందిన దిగువభూములు, రెండవ వరుసలో సోనాహత్ వద్ద ఎగువభూములు మరియు మూడవ స్థాయిలో సోనాహత్ తరువాత ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. [1] సుర్గుజా జిల్లాలో 3 నదీమైదానాలు ఉన్నాయి: హస్డియో నది, రిహండ్ నది మరియు కంహర్ నది.[1] వేసవి ఉష్ణోగ్రత 46 డి సెల్షియస్ మరియు శీతాకాలంలో కనిష్ఠ ఉషోగ్రత 5 డి సెల్షియస్ ఉంటుంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,361,329, [4]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 192వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 150 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.74%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 976:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 61.16%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో అత్యధికంగా గిరిజన ప్రజలు ఉన్నారు. అతిపురాతన స్థానికులలో పాండో మరియు కొర్వ జాతి ప్రజలు ఇప్పటికీ అరణ్యాలలో నివసిస్తున్నారు. పాండో ప్రజలు తమను తాము పాండవుల సంతతికి చెందినవారమని భావిస్తున్నారు. కొర్వా ప్రజలు తమను తాము కౌరవ సంప్రదాయానికి చెందిన వారమని భావిస్తున్నారు.[1]

భాషలు[మార్చు]

జిల్లాలో అధికంగా భరియా భాష వాడుకలో ఉంది. వర్నాకులర్ భాషను దాదాపు 2,00,000 మంది (భరియా జాతి ప్రజలు) మరియు షెడ్యూల్డ్ ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ భాషను దేవనాగర లిపిలో వ్రాస్తున్నారు.[7]

సంస్కృతి[మార్చు]

వన్యమృగాల జీవన శైలిని చిత్రించే మైక్ పాండే చిత్రీకరించిన " ది లాస్ట్ మైగ్రేషన్ " చిత్రం సుర్గుజాలో చిత్రీకరించబడింది. సోనాభాయి అనే మహిళ గిరిజన మరియు జానపద శైలిలో తయారుచేస్తున్న బంకమట్టి శిల్పాలు జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

మూలాలు[మార్చు]

Dr.Sanjay Alung-Chhattisgarh ki Riyaste/Princely stastes aur Jamindariyaa (Vaibhav Prakashan, Raipur1, ISBN 81-89244-96-5)

Dr.Sanjay Alung-Chhattisgarh ki Janjaatiyaa/Tribes aur Jatiyaa/Castes (Mansi publication, Delhi6, ISBN 978-81-89559-32-8)

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Surguja". Surguja district administration. Retrieved 2010-08-03. Cite web requires |website= (help)
  2. "Surguja (Princely State)". Retrieved 2010-08-03. Cite web requires |website= (help)
  3. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17. Cite web requires |website= (help)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. Cite web requires |website= (help)
  6. "2010 Resident Population Data". U.S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179 Cite web requires |website= (help)
  7. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సుర్గుజా&oldid=2031933" నుండి వెలికితీశారు