సులోచన లట్కర్
సులోచన లట్కర్ | |
---|---|
జననం | నాగబాయి 1928 జూలై 30 |
మరణం | 4 జూన్ 2023 ( 94 సంవత్సరాలు) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1946–1995 |
జీవిత భాగస్వామి | అబాసాహెబ్ చవాన్ |
పురస్కారాలు | చిత్ర భూషణ్ మహారాష్ట్ర భూషణ్ పద్మశ్రీ |
సులోచన లట్కర్ (1928 జూలై 30 - 2023 జూన్ 4), కర్ణాటకకు చెందిన సినిమా నటి. మరాఠీలో 50 సినిమాలలో, హిందీలో దాదాపు 250 సినిమాలలో నటించింది. ససుర్వాస్ (1946), వాహినిచ్యా బంగ్ద్య (1953), మీత్ భాకర్, సంగ్త్యే ఐకా (1959), ధక్తి జౌ వంటి మరాఠీ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి గుర్తింపు పొందింది.[1] అలాగే తల్లి పాత్రలలో నటించి బాగా పేరు సంపాదించింది.
జననం
[మార్చు]సులోచన 1928, జూలై 30న కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది.
కళారంగం
[మార్చు]సులోచన లట్కర్ 1946లో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 1946 నుండి 1961 వరకు మరాఠీ సినిమాలో ప్రధానపాత్రలు పోషించింది. ఆ తరువాత తల్లి పాత్రలలో నటించింది. 2003లో ఆధునిక మరాఠీ సినిమా వ్యవస్థాపకులలో ఒకరైన బాబూరావు పెయింటర్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ మరాఠీ చిత్రపట్ మహామండల్ స్థాపించిన చిత్రభూషణ్ అవార్డు అందుకుంది.[2]
అవార్డులు
[మార్చు]- 1999: పద్మశ్రీ పురస్కారం[3]
- 2004: ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- 2009: మహారాష్ట్ర ప్రభుత్వం నుండి మహారాష్ట్ర భూషణ్ అవార్డు[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రస్తుతం ముంబైలోని ప్రభాదేవిలో నివసిస్తోంది.[5] సులోచనకు 14 ఏళ్ళ వయసులో వివాహం జరిగింది. సులోచన కుమార్తె పేరు కంచన్ ఘనేకర్, మరాఠీ రంగస్థల సూపర్ స్టార్ డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ భార్య.[6]
కొన్ని సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష |
1957 | అబ్ దిల్లీ దుర్ నహిన్ | బేలా | హిందీ |
1959 | సంగ్తే ఐకా | సఖారామ్ భార్య | మరాఠీ |
1959 | దిల్ దేకే దేఖో | జమున | హిందీ |
1961 | సంపూర్ణ రామాయణ | కైకేయి | హిందీ |
1963 | మోల్కారిన్ | గయాబాయి | మరాఠీ |
1963 | బాందిని | హిందీ | |
1964 | మరాఠా టిటుకా మేల్వావా | జీజాబాయి | మరాఠీ |
1965 | సాధి మాన్సే | మరాఠీ | |
1965 | గోవాలో జోహార్-మెహమూద్ | హిందీ | |
1966 | దేవర్ | శకుంతల ఎం. సింగ్ | హిందీ |
1967 | నై రోష్ని | ప్రకాష్ తల్లి | హిందీ |
1968 | ఎకటీ | మధు తల్లి | మరాఠీ |
1968 | సంఘుర్ష్ | శంకర్ భార్య | హిందీ |
1968 | సరస్వతీచంద్ర | కుముద్ తల్లి | హిందీ |
1968 | ఆద్మీ | శేఖర్ తల్లి | హిందీ |
1969 | సంబంధ్ | సుమతి | హిందీ |
1970 | కటి పతంగ్ | శ్రీమతి దీనానాథ్ | హిందీ |
1970 | జానీ మేరా నామ్ | సోహన్, మోహన్ తల్లి | హిందీ |
1970 | మెయిన్ సుందర్ హూన్ | సుందర్ తల్లి | హిందీ |
1972 | దిల్ దౌలత్ దునియా | అతిథి స్వరూపం | హిందీ |
1973 | కహానీ కిస్మత్ కీ | శ్రీమతి శర్మ | హిందీ |
1974 | కోరా కాగజ్ | సుకేష్ అత్త | హిందీ |
1974 | మజ్బూర్ | శ్రీమతి ఖన్నా | హిందీ |
1974 | కసౌతి | సప్నా తల్లి | హిందీ |
1978 | ముకద్దర్ కా సికందర్ | విశాల్ తల్లి | హిందీ |
1978 | ఆజాద్ | సరళ | హిందీ |
1980 | ఆశా | జీతేంద్ర తల్లి | హిందీ |
1982 | ఏక్ దావ్ భూతాచా | రాధా మావాషి | మరాఠీ |
1983 | జరా సి జిందగీ | రాకేష్ తల్లి | హిందీ |
1983 | హిమ్మత్ వాలా | దాడిమా | హిందీ |
1984 | ఫుల్వారి | రాజీవ్ తల్లి | హిందీ |
1984 | అందర్ బాహర్ | రవి తల్లి | హిందీ |
1984 | సాసు వర్చాద్ జవై | అశోక్ సరాఫ్ తల్లి | మరాఠీ |
1985 | గులామి | రంజిత్ చౌదరి తల్లి | హిందీ |
1986 | కాలా దండ గోరే లాగ్ | హిందీ | |
1988 | ఖూన్ భారీ మాంగ్ | జెడి తల్లి | హిందీ |
మరణం
[మార్చు]సులోచన లత్కర్ వయోవృద్ధ సమస్యలతో బాధపడుతూ దాదార్‌లోని శుశృత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 జూన్ 4న మరణించింది.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Sulochana wins top cine award". The Times of India. 4 June 2003. Archived from the original on 21 October 2012. Retrieved 2022-08-26.
- ↑ "Sulochana wins top cine award". The Times of India. 4 June 2003. Archived from the original on 21 October 2012. Retrieved 2022-08-26.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved 2022-08-26.
- ↑ Nitsure-Joshi, Manisha (30 November 2009). "हा तर माझ्या घरचा आहेर!". Maharashtra Times. Mumbai. Archived from the original on 2012-02-23. Retrieved 2022-08-26.
- ↑ "Actress Sulochana's 72nd birthday". 11 August 2000.
- ↑ "Changing face of Bollywood screen mothers". Archived from the original on 2014-04-07. Retrieved 2022-08-26.
- ↑ News18 Telugu (4 June 2023). "ప్రముఖ నటి సులోచన లట్కర్ మృతి..సినీ ప్రముఖుల సంతాపం". Retrieved 4 June 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (4 June 2023). "నటి సులోచన కన్నుమూత". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.