అక్షాంశ రేఖాంశాలు: 26°15′N 82°00′E / 26.250°N 82.000°E / 26.250; 82.000

సుల్తాన్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుల్తాన్‌పూర్ జిల్లా
सुलतानपुर ज़िला
سلطان پور ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో సుల్తాన్‌పూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో సుల్తాన్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఫైజాబాద్
ముఖ్య పట్టణంసుల్తాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)
Government
 • లోకసభ నియోజకవర్గాలుసుల్తాన్‌పూర్, అమేఠీ
 • శాసనసభ నియోజకవర్గాలు5
విస్తీర్ణం
 • మొత్తం4,436 కి.మీ2 (1,713 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం37,90,922
 • జనసాంద్రత850/కి.మీ2 (2,200/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత71.14
 • లింగ నిష్పత్తి1.022
Websiteఅధికారిక జాలస్థలి
సుల్తాన్‌పూర్‌లోని ఒక ఇల్లు

సుల్తాన్‌పూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. సుల్తాన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సుల్తాన్‌పూర్ జిల్లా ఫైజాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది.

చరిత్ర

[మార్చు]

14-15 శతాబ్ధాలలో చౌహాన్ సామ్రాజ్యం శాఖకు చెందిన రాజ్‌కంవర్ బండల్గోతీ, రాజ్‌వార్, బాచ్‌గోతిలతో కలిసి జిల్లాలో అధిక ఈ ప్రాంతాన్ని పాలించారు. 19వశతాబ్దంలో వీరు ఓధ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం అయిన తరువాత సిపాయీల కలహం కాలంలో సుల్తాన్‌పూర్ స్థానికుల తిరుగుబాటును ఎదుర్కొన్నారు. 1857 జూన్ 9 న తిరుబాటు దారులు 2 అధికారులను చంపిన తరువాత స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు దార్లలో స్థానిక ప్రజలు, బాలే సుల్తాన్ (గిరిజన ప్రజలు) ఉన్నారు. వీరికి నాయకులైన లాల్ ప్రతాప్ సింగ్, కలాకంకర్, మహరాజ్ బర్జర్ సింగ్ రాజ్‌కంవర్ వంటి వారు ఈ తిరుగుబాటులో మరణించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత సుల్తాంపూర్ కంటోన్మెంటును బలపచబడింది. 1861లో ఈ స్థానిక స్థావరం కార్యకలాపాలను నిలిపి వేశారు.

భౌగోళికం

[మార్చు]

జిల్లా వైశాల్యం 1713 చ.కి.మి. భూభాగం చదునుగా ఉండి ఉప నదులలో విభజించబడుతూ ఉంది. మధ్యభూభాగంలో విస్తారంగా పంటను అందించగలిగిన సారవంతమైన వ్యవసాయభూములు. దక్షిణ భూభాగంపొడి పొడిగా ఉండే మైదానాలు, చిత్తడి భూములు ఉన్నాయి. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో గోమతి నది ప్రధానమైనది. ఇది జిల్లా మద్యభాగంలో ప్రవహిస్తూ వాణిజ్యానికి సహకారం అందిస్తూ ఉంది. కండు, పిలి, తెంఘ, నందిఘా వంటి ఇతర జలప్రవాహాలు ఉన్నాయి. కొండలలోని జలపాతాల నుండి ఈ జలప్రవాహాలకు నీరు అందుతూ ఉంది. సారవంతమైన వ్యవసాయ భూములు, వ్యవసాయానికి నీరు అందిస్తున్న జలప్రవాహాలు జిల్లాను వ్యవసాయ పరంగా సుసంపన్నం చేస్తున్నాయి. జిల్లాలో వరి, పప్పుధాన్యాలు, గోధుమలు, బార్లీ, చెరకు, స్వల్పంగా గసాలు పండుతున్నాయి.

ఆర్ధికం

[మార్చు]

జిల్లాలో జగ్దీష్‌పూర్ ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. ఇక్కడ భారత్ హెవీ ఎలెక్ట్రానిక్ లిమిటెడ్, ఇండో గల్ఫ్ ఫర్టిలైజర్, కొన్ని తోలు పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో అదనంగా ముంషిగంజ్ సమీపంలో ఉన్న కొర్వాలో ఉన్న హిందూస్థాన్ ఎయిరోనాటిక్ లిమిటెడ్ టెస్టింగ్ సెంటర్, గౌరి గంజ్ వద్ద ఉన్న ఎ.సి.సి సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

జిల్లా వాయవ్యప్రాంత్ంలో ఉన్న ఓధ్- రోహిల్ ఖండ్, లక్నో - రీ బరేలి రైలు మార్గాలు జిల్లా వాసులకు రైల్వే సేవలు అందిస్తున్నాయి.

పరిపాలన

[మార్చు]
  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి:- సుల్తాన్‌పూర్ సాదర్, కాదిపూర్, లంభుయా, జైసింగ్‌పూర్.[1]
  • అమేథి, ముసాఫిర్‌ఖానా, గౌరిగంజ్, తాలూకాలు ప్రస్తుతం అమేథి జిల్లాలో ఉన్నాయి.
  • జిల్లాలో ఒక పురపాలకం ఉంది:-
  • జిల్లాలో 5 పట్టణాలు ఉన్నాయి:-
  • జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి:-
  • జిల్లాలో చందా, దోస్త్‌పూర్, జగదీష్‌పూర్, కాదీపూర్, కొయెరిపూర్, లంభుయా, ముషాఫిర్‌ఖానా, షుకుల్ బజార్ ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
  • చట్టరక్షణ, పౌరహక్కుల రక్షణ కొరకు జిల్లాలో 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.[1]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,790,922,[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 69 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 855 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.92%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 978:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.14%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

[మార్చు]

జిల్లాలో హిందీ భాషాకుటుంబంలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. అవధి భాష 38,000 మంది మాట్లాడుతారు.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Number of blocks situated in Sultanpur". Administration of Sultanpur. Archived from the original on 21 ఏప్రిల్ 2001. Retrieved 28 September 2012.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oregon 3,831,074
  5. M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

26°15′N 82°00′E / 26.250°N 82.000°E / 26.250; 82.000

[మార్చు]