Jump to content

సుల్తాన్‌బజార్

వికీపీడియా నుండి
(సుల్తాన్ బజార్ నుండి దారిమార్పు చెందింది)
సుల్తాన్‌బజార్
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 001
Vehicle registrationటిస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంగోషామహల్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సుల్తాన్‌బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వాణిజ్య మార్కెటు ప్రాంతం.[1][2] అబిడ్స్, కోఠి వాణిజ్య ప్రాంతాల మధ్య ఈ సుల్తాన్‌బజార్ ఉంది. గతంలో దీనిని రెసిడెన్సీ బజార్ అని పిలిచేవారు. తరువాత, సయ్యద్ సుల్తానుద్దీన్ నవాబ్ పేరుమీదుగా సుల్తాన్‌బజార్ అని మార్చబడింది. ఇక్కడికి సమీపంలో రామ్‌కోట్, కోఠి, హెచ్.వి.ఎస్ సొసైటీ ఉన్నాయి.[3] నిజాం బంధువులు, కుటుంబసభ్యులు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి షాపింగ్‌కు వస్తుండేవారు.

ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), సుల్తాన్ బజార్ శాఖ

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

ఈ ప్రాంతంలో ప్రధానంగా మహిళల బట్టలు, ఫ్యాషన్ వస్తువులు, వెండి సామాగ్రి అమ్మే దుకాణాలు 100కి పైగా ఇక్కడ ఉన్నాయి. రద్దీగా ఉండే వీధి ఈ మార్కెటులో గాజులు, వెండి ఆభరణాలు, బూట్లు, గడియారాలు, హస్తకళా ఉత్పత్తులు వంటి వస్తువులు లభిస్తాయి.[4]

ఇక్కడ మహేశ్వరి పరమేశ్వరి థియేటర్, జైన దేవాలయం, కందస్వామి వీధిలో సాయిబాబా దేవాలయం, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయము ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఒక వీధిలో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతారు. దీనిని ఎలక్ట్రానిక్ మార్కెట్ లేదా బ్యాంక్ స్ట్రీట్ అని పిలుస్తారు.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడినుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. కోఠి దగ్గర పెద్ద బస్ టెర్మినల్ కూడా ఉంది.

సమీపంలోని కాచిగూడ, మలక్‌పేట ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషన్లు ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]

కళాశాలు

[మార్చు]
  1. ప్రగతి మహావిద్యాలయ
  2. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  3. జి. పుల్లారెడ్డి జూనియర్ కళాశాల
  4. శ్రీ త్యాగరాజ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్

ఇతర వివరాలు

[మార్చు]

నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ప్రతి రోజూ నిరసన ర్యాలీలు, నినాదాలతో సుల్తాన్‌బజార్‌ మారుమోగుతుండేది. 1948, మార్చి8న 200 మంది విద్యార్థులతో అబిడ్స్‌ నుంచి సుల్తాన్‌ బజార్‌ వరకు ప్రభాత భేరి పేరుతో పెద్ద ర్యాలీ నిర్వహించబడింది. సుల్తాన్‌బజార్‌ చేరేసరికి మరికొంతమంది వచ్చి చేరారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Sulthan Bazar Police Station". Archived from the original on 2015-02-23. Retrieved 2021-01-16.
  2. Rao, Dasu Kesava (2016-06-27). "Sultan Bazar: One city, two governments". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-16.
  3. "Sultan Bazar, Koti Locality". www.onefivenine.com. Retrieved 2021-01-16.
  4. "Sultan Bazar". Times of India Travel. Retrieved 2021-01-16.
  5. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (23 June 2016). "ప్రారిస్‌ను తలపించేది". andhrajyothy.com. Archived from the original on 16 January 2021. Retrieved 16 January 2021.