సుల్తాన్ (2016 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుల్తాన్ సినిమా పోస్టరు

సుల్తాన్, 2016 జూలై 6 గురువారం నాడు విడుదలైన హిందీ చిత్రం. ఈ చిత్రం ప్రధానంగా క్రీడా రంగ నేపథ్యములో చిత్రీకరించబడినది[1][2][3].

సుల్తాన్‌ అలీఖాన్‌ (సల్మాన్‌ఖాన్‌) హర్యానా ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి. కెరీర్‌ను ఎలా మలచుకోవాలో.. ప్రొఫెషనల్‌గా ఎలా ఎదగాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాడు. ఆర్ఫా (అనుష్కశర్మ).. మల్లయోధురాలు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్నది ఆమె లక్ష్యం. అయితే.. ఆర్ఫాను చూసిన సుల్తాన్‌ ఆమె ప్రేమలో పడతాడు. కానీ.. ఎలాంటి లక్ష్యం లేని సుల్తాన్‌ ప్రేమను ఆమె తిరస్కరిస్తుంది. రెజ్లింగ్‌లో ఉన్నత స్థానానికి చేరితే ప్రేమను అంగీకరిస్తానని ఆర్ఫా చెబుతుంది. దీంతో.. ఆర్ఫా ప్రేమను గెలుచుకునేందుకు కొద్ది రోజుల్లోనే రెజ్లింగ్‌లో పట్టు సాధిస్తాడు. రింగులో ప్రత్యర్థులను మట్టికరిపించి.. రాష్ట్రస్థాయిలో విజయం సాధిస్తాడు. ఇక వెనుతిరిగి చూసుకోకుండా జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి కామన్‌వెల్త్‌.. ఒలింపిక్స్‌లో విజయాలు అందుకుంటాడు. మల్లయుద్ధంలో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు అందుకున్న సుల్తాన్‌ ప్రేమను ఆర్ఫా అంగీకరించిందా? సుల్తాన్‌లా.. ఆర్ఫా మల్లయుద్ధంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకుందా? లేదా? ఆ తర్వాత.. వాళ్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేదే మిగిలిన కథ.

తారాగణం

[మార్చు]

వసూళ్ళు

[మార్చు]

ఇనుప నరాలు, ఉక్కు పిడికిళ్లతో గోదాలో ప్రత్యర్థులను చిత్తు చేసిన బాలీవుడ్ సుల్తాన్.. అవలీలగా రూ. 300 కోట్ల మార్కు దాటేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు మొత్తం కలిపితే దాదాపు రూ. 345 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఈద్ సెంటిమెంటుతో జూలై 7వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా భారతదేశంలో రూ. 252.5 కోట్లు, విదేశాల్లో రూ. 92 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016 జూలై 12 వరకు మొదటి వారంలో ఏ బాలీవుడ్ సినిమా సాధించనంత మొత్తంలో వసూళ్ళు సాధించింది. హీరోతో పాటు హీరోయిన్ అనుష్కా శర్మ కూడా రెజ్లర్ పాత్ర పోషించిన ఈ సినిమా దుబాయ్, పాకిస్థాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి చాలా దేశాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆయా దేశాల్లో ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకూ రానంత స్థాయిలో కలెక్షన్లు దీనికి వచ్చాయి[4].

మూలాలు

[మార్చు]
  1. "This is why Salman Khan thinks 'Sultan' will be a blockbuster". International Business Times. 26 April 2016. Retrieved 8 July 2016.
  2. "Sultan: Salman's 'Raging Bull' act is a blockbuster". Business Standard. 6 July 2016. Retrieved 8 July 2016.
  3. "Sultan review by Anupama Chopra: This is an over-sized Salman slam". Hindustan Times. 7 July 2016. Retrieved 8 July 2016.
  4. "సుల్తాన్ కు కళ్లు తిరిగే కలెక్షన్లు". సాక్షి. 2016-07-12. Retrieved 2016-07-12.

బయటి లంకెలు

[మార్చు]