సువర్ణభూమి విమానాశ్రయం
సువర్ణభూమి విమానాశ్రయం ท่าอากาศยานสุวรรณภูมิ | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
దస్త్రం:Suvarnabhumi Airport Logo.svg | |||||||||||||||||||
సంగ్రహం | |||||||||||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా రవాణా | ||||||||||||||||||
కార్యనిర్వాహకత్వం | థాయ్‌లాండ్ విమానాశ్రయాలు (AOT) | ||||||||||||||||||
సేవలు | బ్యాంకాక్ మెట్రోపాలిటన్ ప్రాంతం | ||||||||||||||||||
ప్రదేశం | రాచా తేవా, బాంగ్ ఫిలి జిల్లా, సముత్ ప్రకాన్,బ్యాంకాక్ | ||||||||||||||||||
ప్రారంభం | 28 సెప్టెంబరు 2006 | ||||||||||||||||||
ఎయిర్ హబ్ |
| ||||||||||||||||||
కేంద్రీకృత నగరం |
| ||||||||||||||||||
ఎత్తు AMSL | 5 ft / 2 మీ. | ||||||||||||||||||
అక్షాంశరేఖాంశాలు | 13°41′33″N 100°45′00″E / 13.69250°N 100.75000°E | ||||||||||||||||||
వెబ్‌సైటు | suvarnabhumi.airportthai.co.th | ||||||||||||||||||
పటం | |||||||||||||||||||
రన్‌వే | |||||||||||||||||||
| |||||||||||||||||||
గణాంకాలు (2019) | |||||||||||||||||||
| |||||||||||||||||||
Sources:AOT 2019[2] |
సువర్ణభూమి విమానాశ్రయం (థాయ్: ท่าอากาศยาน สุวรรณภูมิ) థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ లో ఉంది. దీనిని బ్యాంకాక్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. బ్యాంకాక్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి సేవలందిస్తున్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఇది ఒకటి. మరొకటి డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DMK). సువర్ణభూమి విమానాశ్రయం 3,240 హెక్టార్ల (32.4 కిమీ2; 8,000 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది, ఇది ఆగ్నేయాసియాలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటిగా, విమానయానానికి ప్రాంతీయ కేంద్రంగా మారింది.[3]
పేరు-అర్థం
[మార్చు]సంస్కృతంలో సువర్ణ భూమి అనగా బంగారు భూమి అని అర్థం. ఈ పేరును దివంగత రాజు భూమిబోల్ అదుల్యదేజ్ ఎంచుకున్నాడు, దీని పేరు బౌద్ధులు పాలించిన సువర్ణమైన రాజ్యాన్ని సూచిస్తుంది. ఇది గంగానదికి తూర్పున, ఆగ్నేయాసియాలో ఉండేది. దీనిని ఉద్దేశించి థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్ విమానాశ్రయానికి సువర్ణభూమి విమానాశ్రయం అని పేరు పెట్టింది.[4]
చరిత్ర
[మార్చు]సువర్ణభూమి అధికారికంగా పరిమిత దేశీయ విమాన సర్వీసుల కోసం 15 సెప్టెంబర్ 2006న ప్రారంభించబడింది. 28 సెప్టెంబర్ 2006న దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమాన.రవాణాలు ప్రారంభమయ్యాయి.[5]
ఈ విమానాశ్రయం ప్రస్తుతం థాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌వేస్, థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్, బ్యాంకాక్ ఎయిర్‌వేస్, థాయ్ వియెట్‌జెట్ ఎయిర్‌లకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికాలను అనుసంధానించే వివిధ విదేశీ క్యారియర్‌లకు ప్రాంతీయ గేట్‌వేగా, కనెక్టింగ్ పాయింట్‌గా పనిచేస్తుంది.
ర్యాంకింగ్
[మార్చు]2020లో ప్రపంచంలోని అగ్రశ్రేణిలో ఉన్న వంద విమానాశ్రయాలలో సువర్ణభూమి విమానాశ్రయం 48వ స్థానంలో ఉంది. 2019లో 46వ స్థానంలో, 2017లో 38వ స్థానంలో, 2016లో 36వ స్థానంలో ఉంది. 2018లో థాయ్‌లాండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (TDRI) చేసిన పరిశోధన ప్రకారం, విమానాశ్రయం ర్యాంకింగ్ గత ఆరేళ్లుగా మెరుగుపడలేదు.[6]
ఆక్రమణ
[మార్చు]26 నవంబర్, 2008న, పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా విమానాశ్రయాన్ని అక్రమంగా ఆక్రమించి, డిపార్చర్ లాంజ్‌ను మూసివేసి, నిష్క్రమణలను అడ్డుకున్నారు. దాదాపు 3,000 మంది ప్రయాణికులు ప్రధాన టెర్మినల్‌లో చిక్కుకుపోయారు. మరో 3,50,000 మంది దేశంలోని అన్ని విమానాలల్లో నిలిచిపోయారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ 12:00 గంటలకు కంట్రోల్ టవర్‌ను స్వాధీనం చేసుకుంది. 2 డిసెంబర్ 2008న, నిరసనకారులు చట్టవిరుద్ధంగా నిరసనలు చేస్తున్నందున విమానాశ్రయం నుండి బయలుదేరడానికి అంగీకరించి, విమానాల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చారు.[7]
సైక్లింగ్ ట్రాక్
[మార్చు]డిసెంబర్ 2015లో, సువర్ణభూమి విమానాశ్రయం చుట్టూ ఒక సైక్లింగ్ ట్రాక్‌ను ప్రవేశపెట్టాయి. స్కై లేన్ ప్రవేశ ద్వారం విమానాశ్రయ ప్రాంతం ఈశాన్య మూలలో ఉంది. సైక్లింగ్ చేసే వారు తమ సైకిళ్లు, బైక్‌లను ఉచితంగా ఇక్కడకు తీసుకురావచ్చు. స్కై లేన్ అనేది సైక్లింగ్ కోసం మాత్రమే నిర్మించబడింది. స్కై లేన్ పొడవు 23.5 కిమీ, ఇది ఆసియాలోనే అతి పొడవైనది. సైక్లింగ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన స్కై లేన్ సౌకర్యాలలో వైద్య సదుపాయాలు, దుకాణాలు, ఆహారం, పానీయాలు, ట్రాక్, పార్కింగ్, విశ్రాంతి స్థలం ఉన్నాయి. ప్రవేశ ద్వారం 06:00 నుండి 18:00 వరకు తెరిచి ఉంటుంది.23 నవంబర్ 2018న, సువర్ణభూమి విమానాశ్రయంలో సైక్లింగ్ లేన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ట్రాక్‌ను హ్యాపీ అండ్ హెల్తీ బైక్ లేన్‌గా నిర్ణయించారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Fernquest, Jon. "Suvarnabhumi: New runway by 2018". Bangkok Post. Retrieved 20 March 2019.
- ↑ "Air transport statistic 2016 summary" (PDF). Airports of Thailand PLC. 23 January 2017.
- ↑ "Suvarnabhumi Airport pronunciation: How to pronounce Suvarnabhumi Airport in Thai". Forvo.com. 20 January 2010. Retrieved 4 March 2017.
- ↑ "Sanskrit Dictionary". Sanskrit Dictionary. Archived from the original on 24 సెప్టెంబరు 2018. Retrieved 5 October 2018.
- ↑ "Bangkok's new airport opens to first commercial flights" Archived 2011-07-27 at the Wayback Machine, USA Today, 15 September 2006.
- ↑ "The World's Top 100 Airports of 2020". Skytrax (in ఇంగ్లీష్). Retrieved 2020-06-05.
- ↑ "Thai protesters shut down airport". BBC News – Asia-Pacific. Retrieved 3 June 2015.
- ↑ "Official Website". Sky Lane Thailand. Archived from the original on 13 July 2016. Retrieved 31 January 2018.