Jump to content

శుభేందు అధికారీ

వికీపీడియా నుండి
(సువెందు అధికారి నుండి దారిమార్పు చెందింది)
శుభేందు అధికారీ
శుభేందు అధికారీ


పదవీ కాలం
2026 మే 9  ప్రస్తుతం
గవర్నరు ఆర్.ఎన్. రవి
డిప్యూటీ మిహిర్ గోస్వామి
ముందు మమతా బెనర్జీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 మే 2021
ముందు అబ్దుల్ మన్నన్
నియోజకవర్గం నందిగ్రామ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016
ముందు ఫిరోజ్ బిబి
నియోజకవర్గం నందిగ్రామ్

రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
27 మే 2016  27 నవంబర్ 2020
గవర్నరు కేశరినాథ్ త్రిపాఠి
జగదీప్ ధంకర్
ముందు అరూప్ బిస్వాస్
తరువాత మమతా బెనర్జీ[1]

పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
2018  2020
ముందు సోవన్ ఛటర్జీ
తరువాత మమతా బెనర్జీ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2009  19 మే 2016
ముందు లక్ష్మణ్ చంద్ర సేథ్
తరువాత దిబ్యేందు అధికారి
నియోజకవర్గం తమ్లుక్

జ్యూట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌
పదవీ కాలం
31 డిసెంబర్ 2020  2 మార్చ్ 2021[2]
ముందు అజయ్ కుమార్ జోలీ

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-15) 1970 డిసెంబరు 15 (వయసు: 55)
కొంటాయి, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2020- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు * కాంగ్రెస్ పార్టీ (1995-1998)
  • త్రిణమూల్ కాంగ్రెస్ (1998-2020)
బంధువులు దిబ్యేందు అధికారి (సోదరుడు)
నివాసం కొంటాయి,పూర్భా మేదినిపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్
పూర్వ విద్యార్థి రవీంద్రభారతి యూనివర్సిటీ (ఎంఏ)
ప్రభాస్ కుమార్ కాలేజీ (బిఏ)
వృత్తి రాజకీయ నాయకుడు

శుభేందు అధికారీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 నుండి 2026 వరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేసి,[3] 2026 మే 9న నుండి పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

“సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాలో బెంగాల్ మహిష్య కుటుంబంలో జన్మించారు, ఆయన ఎం.ఏ. వరకు చదివారు.

రాజకీయ జీవితం

[మార్చు]

సువెందు అధికారి తన తండ్రి సిసిర్ అధికా,ఆయన ఎం.ఏ. వరకు చదివారు.ి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995లో తొలిసారి కాంటాయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 1998లో మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరి 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

సువెందు అధికారి పార్టీలో మమతా బెనర్జీ అనుచరుడిగా మరి ఎకనమిక్ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా పోరాడిన నాయకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన తరువాత ఎంపీగా, ఎమ్మెల్యేగా 2016లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసి 2020 డిసెంబరు 17న పార్టీకి రాజీనామా చేసి, [5] డిసెంబరు 19న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6] ఆయన 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీ పై 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[7] ఆయనను తరువాత బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితుడయ్యాడు.

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
  1. 1995 : కాంటాయ్ మున్సిపాలిటీ కౌన్సిలర్‌
  2. 2006 : కాంతి దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నిక
  3. 2009 : తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
  4. 2014 : రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎంపీగా రాజీనామా చేశాడు.
  5. 2021 : నందిగ్రామ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక[8]

మూలాలు

[మార్చు]
  1. "CM Banerjee will take charge of Suvendu's portfolio". NDTV. 28 November 2020.
  2. ANI News (2 March 2021). "BJP leader Suvendu Adhikari likely to step down as Chairperson of Jute Corporation of India" (in ఇంగ్లీష్). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  3. Namasthe Telangana (10 May 2021). "బెంగాల్‌ ప్రతిపక్ష నేతగా సువేందు". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  4. "బెంగాల్‌ గడ్డపై తొలి భాజపా సర్కార్‌.. సీఎంగా సువేందు ప్రమాణం". Eenadu. 9 May 2026. Archived from the original on 9 May 2026. Retrieved 9 May 2026.
  5. 10TV (27 November 2020). "బెంగాల్ రవాణాశాఖ మంత్రి రాజీనామా". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Mana Telangana (19 December 2020). "బిజెపిలో చేరిన సువేందు అధికారి". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  7. 10TV (2 May 2021). "నందిగ్రామ్ లో సీఎం మమతని ఓడించిన సువెందు అధికారి". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Namasthe Telangana (2 May 2021). "నందిగ్రామ్‌ సువేందుదే!". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.