సువెందు అధికారి మంత్రివర్గం
| సువెందు అధికారి మంత్రివర్గం | |
|---|---|
| పశ్చిమ బెంగాల్ 22 వ మంత్రిమండలి | |
| రూపొందిన తేదీ | 2026 మే 9 |
| సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
| గవర్నరు | ఆర్. ఎన్. రవి |
| ముఖ్యమంత్రి | సువెందు అధికారి |
| మంత్రుల సంఖ్య | 6 |
| పార్టీలు | |
| సభ స్థితి | మెజారిటీ 207 / 294 (70%) |
| ప్రతిపక్ష పార్టీ | |
| ప్రతిపక్ష నేత | సోవందేబ్ చటోపాధ్యాయ |
| చరిత్ర | |
| ఎన్నిక(లు) | 2026 |
| శాసనసభ నిడివి(లు) | పశ్చిమ బెంగాల్ 18వ శాసనసభ (2026 – ప్రస్తుతం) |
| అంతకుముందు నేత | మమతా 3వ మంత్రివర్గం |
సువేందు అధికారి మంత్రివర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 22వ, ప్రస్తుత మంత్రివర్గం. ఇది సువేందు అధికారి నాయకత్వంలో ఏర్పడింది. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తరువాత, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి శుభదినాన, 2026 మే 9న ఉదయం 11:34 గంటలకు సువేందు అధికారి తొలిసారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతనితో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.[1][2][3]
అతను తన మంత్రిత్వ శాఖలో కీలక పాత్రపోషించే నిర్దిష్టపాత్రలకు ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులను కూడా నియమించారు. అతను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్రతా గుప్తాను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు. గుప్తా 2025 నవంబరులో బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌కు ప్రత్యేక రోల్ అబ్జర్వర్‌గా, శాసనసభ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకుడిగా ఉన్నారు.[4][5] 2017 బ్యాచ్ ఐఎఎస్ అధికారి శంతనుబాలాను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించారు.[4]
పశ్చిమ బెంగాల్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మనోజ్ అగర్వాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.[6]
రాజ్యాంగ అవసరం
[మార్చు]భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం, మంత్రిమండలి, గవర్నర్‌కు సహాయం సలహాలు ఇవ్వడంలో తోడ్పడింది.
- ఈ రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తన విధులను లేదా వాటిలో దేనినైనా తన విచక్షణ మేరకు నిర్వర్తించవలసి వచ్చిన సందర్భాలు మినహా, గవర్నర్‌కు తన విధులను నిర్వర్తించడంలో సహాయపడటానికి, సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉంటుంది.
- ఏదైనా విషయంపై ఈ రాజ్యాంగం ప్రకారం గవర్నరు తన విచక్షణ మేరకు వ్యవహరించవలసి ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తితే, గవర్నరు తన విచక్షణ మేరకు తీసుకున్న నిర్ణయమే అంతిమమైంది. గవర్నరు తన విచక్షణ మేరకు వ్యవహరించి ఉన్నారా లేదా అనే కారణంతో అతను చేసిన ఏ పని చెల్లుబాటును ప్రశ్నించరాదు.
- మంత్రులు గవర్నర్‌కు ఏదైనా సలహా ఇచ్చారా, ఇస్తే అది ఏమిటి అనే ప్రశ్నను ఏ న్యాయస్థానంలోనూ విచారించరాదు.
వాటి అర్థం, మంత్రులు గవర్నర్ అభీష్టం మేరకు పదవిలో ఉంటారు. గవర్నరు, ముఖ్యమంత్రి సలహా మేరకు, తమకు కావలసినప్పుడు వారిని తొలగించవచ్చు.
మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనల కొరకు
[మార్చు]భారత రాజ్యాంగంలోని ప్రకరణ 164 ప్రకారం,
- ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఇతర మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తారు. మంత్రి గవర్నర్ అభీష్టం మేరకు పదవిలో ఉంటారు:
- అయితే, బీహార్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉంటారు. వారు అదనంగా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి లేదా మరేదైనా ఇతర పనికి కూడా బాధ్యత వహించవచ్చు.
- మంత్రిమండలి సమిష్టిగా రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తుంది.
- ఒక మంత్రి తన పదవిని చేపట్టే ముందు, మూడవ షెడ్యూల్‌లో ఈ ప్రయోజనం కోసం నిర్దేశించిన ఫారమ్‌ల ప్రకారం గవర్నరు అతనితో పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయిస్తారు.
- ఏదేని ఆరు నెలల పాటు వరుసగా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా లేని మంత్రి, ఆ కాలం ముగిసిన తర్వాత మంత్రి పదవిని కోల్పోతారు.
- మంత్రుల జీతభత్యాలు, రాష్ట్ర శాసనసభ ఎప్పటికప్పుడు చట్టం ద్వారా నిర్ధారించే విధంగా ఉంటాయి. రాష్ట్ర శాసనసభ అలా నిర్ధారించే వరకు, అవి రెండవ షెడ్యూల్‌లో పేర్కొనబడి ఉంటాయి.
మంత్రి మండలి
[మార్చు]| వ.సంఖ్య | చిత్రం | పేరు[7] | నియోజకవర్గం | మంత్రిత్వ శాఖ [8][9][10][11] | పదవిలో చేరింది | పదవినుండి నిష్క్రమణ | పదవీకాలం | పార్టీ | ||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పేరు | జిల్లా | |||||||||
| ముఖ్యమంత్రి | ||||||||||
| 1 | సువెందు అధికారి | భబానిపూర్ | కోల్‌కతా |
|
2026 మే 11 | అధికారంలో ఉన్నారు | 2026 మే 9 –అధికారంలో ఉన్నారు | BJP | ||
| క్యాబినెట్ మంత్రులు | ||||||||||
| 2 |
|
దిలీప్ ఘోష్ | ఖరగ్‌పూర్ సదర్ | పశ్చిమ్ మేదినీపూర్ |
|
2026 మే 11 | అధికారంలో ఉన్నారు | 2026 మే 9 –అధికారంలో ఉన్నారు | BJP | |
| 3 | అగ్నిమిత్ర పాల్ | అసన్‌సోల్ దక్షిణ | పశ్చిమ్ బర్ధమాన్ |
| ||||||
| 4 | అశోక్ కీర్తానియా | బంగావ్ ఉత్తర్ (ఎస్.సి) | ఉత్తర 24 పరగణాలు |
| ||||||
| 5 | క్షుదిరం టుడు | రాణిబంధ్ (ఎస్.టి) | బంకురా |
| ||||||
| 6 | నిసిత్ ప్రమణిక్ | మాతాభంగ (ఎస్.సి) | కూచ్ బెహర్ |
| ||||||
| పార్టీ | క్యాబినెట్ మంత్రులు | రాష్ట్ర మంత్రులు
(స్వతంత్ర బాధ్యత) |
రాష్ట్ర మంత్రులు | మంత్రిత్వ శాఖల మొత్తం సంఖ్య | |
|---|---|---|---|---|---|
| BJP | 6 | 0 | 0 | 6 | |
| మొత్తం | 6 | 0 | 0 | 6 | |
జిల్లాల వారిగా
[మార్చు]Representation of Cabinet Ministers by district
| జిల్లా | మంత్రుల సంఖ్య | మంత్రుల పేర్లు |
|---|---|---|
| అలీపుర్దువార్ | — | — |
| బంకురా | 1 | క్షుదిరం టుడు |
| బీర్భం | — | — |
| కూచ్ బెహర్ | 1 | నిసిత్ ప్రమణిక్ |
| దక్షిణ దినాజ్‌పూర్ | — | — |
| డార్జిలింగ్ | — | — |
| హుగ్లీ | — | — |
| హౌరా | — | — |
| జల్పాయ్ గురి | — | — |
| ఝర్గ్రామ్ | — | — |
| కాలింపాంగ్ | — | — |
| కోల్‌కతా | 1 | సువెందు అధికారి |
| మాల్డా | — | — |
| ముర్షిదాబాద్ | — | — |
| ఉత్తర 24 పరగణాలు | 1 | అశోక్ కీర్తానియా |
| నదియా | — | — |
| పశ్చిమ్ బర్ధమాన్ | 1 | అగ్నిమిత్ర పాల్ |
| పశ్చిమ్ మేదినీపూర్ | 1 | దిలీప్ ఘోష్ |
| పుర్బా బర్ధమాన్ | — | — |
| పూర్బా మేదినీపూర్ | — | — |
| పురూలియా | — | — |
| దక్షిణ 24 పరగణాలు | — | — |
| ఉత్తర దినాజ్‌పూర్ | — | — |
| మొత్తం | 6 | |
| వ.సంఖ్య. | కేబినెట్ మంత్రి | కులం | వర్గం |
|---|---|---|---|
| 1 | సువేందు అధికారి | బ్రాహ్మణు | అగ్ర కులం |
| 2 | అగ్నిమిత్ర పాల్ | కాయస్త్ | అగ్ర కులం |
| 3 | దిలీప్ ఘోష్ | సద్గోప్ | ఇతర వెనుకబడిన కులాలు |
| 4 | అశోక్ కీర్తానియా | మాటువా | షెడ్యూల్డ్ కులం |
| 5 | క్షుదీరం తుడు | సంతాలి | షెడ్యూల్డ్ తెగ |
| 6 | నిసిత్ ప్రమాణిక్ | రాజబన్షి | షెడ్యూల్డ్ కులం |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "West Bengal CM oath ceremony highlights: Suvendu takes oath as first BJP CM of Bengal, Mamata calls for Oppn to unite". Hindustan Times. 9 May 2026.
- ↑ "Suvendu Adhikari CM Oath Ceremony Live Updates: 'We will rebuild Bengal,' says Suvendu Adhikari after taking oath as CM". The Times of India.
- ↑ "Suvendu Adhikari Allocates Portfolios in West Bengal Cabinet After BJP Government Formation". dailypioneer.com (in ఇంగ్లీష్). The Pioneer (India). 12 May 2026.
- ↑ 4.0 4.1 "Telegraph India Epaper - Calcutta Edition, Sunday, 10 May, 2026 | Nation - page 4". epaper.telegraphindia.com.
- ↑ "Office of the Chief Electoral Officer West Bengal - Press Note" (PDF). ceowestbengal.wb.gov.in. Election Commission of India. Retrieved 10 May 2026.
- ↑ Singh, Shiv Sahay (11 May 2026). "West Bengal Chief Electoral Officer appointed State Chief Secretary". The Hindu (in Indian English).
- ↑ "West Bengal CM Oath Ceremony Live: Dilip Ghosh, Agnimitra Paul, others sworn in as West Bengal ministers". India Today. Retrieved 9 May 2026.
- ↑ "West Bengal Cabinet: Suvendu Adhikari allocates key portfolios to 5 ministers". The Times of India. Retrieved 12 May 2026.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "WB Chief Minister Suvendu Adhikari chairs cabinet meeting at state secretariat allocating departments to 5 Cabinet Ministers". DD News. Retrieved 12 May 2026.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "West Bengal government live updates: Suvendu Adhikari cabinet meeting". The Indian Express. Retrieved 12 May 2026.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "Government Departments - Government of West Bengal". Government of West Bengal. Government of West Bengal. Retrieved 2026-05-16.
