సుశాంత బోర్గోహైన్
| సుశాంత బోర్గోహైన్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2021 నవంబర్ 2 | |||
| ముందు | కుశాల్ దోవారీ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | తౌరా | ||
| పదవీ కాలం 2011 – 2016 | |||
| ముందు | కుశాల్ దోవారీ | ||
| తరువాత | కుశాల్ దోవారీ | ||
| నియోజకవర్గం | తౌరా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 27 ఏప్రిల్ శివసాగర్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | అంగ్కిటా చాంగ్మై | ||
| నివాసం | డెమో రాయ్‌చాయ్ , అస్సాం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సుశాంత బోర్గోహైన్ (27 ఏప్రిల్ 1974) అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన తౌరా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]సుశాంత బోర్గోహైన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2011 అసోం శాసనసభ ఎన్నికలలో తౌరా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కుశాల్ దోవారీపై 4286 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2016 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కుశాల్ దోవారీ చేతిలో 1,226 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
సుశాంత బోర్గోహైన్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి,[4] 2021 అసోం శాసనసభ ఎన్నికలలో తౌరా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కుశాల్ దోవారీపై 2,006 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన జూన్ 2021లో పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి,[5] అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6][7]
సుశాంత బోర్గోహైన్ 2021లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రైజోర్ దళ్ అభ్యర్థి ధైజ్య కోన్వర్ పై 30,561 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Assam Congress MLA Sushanta Borgohain Quits Party, Set To Join BJP" (in ఇంగ్లీష్). NDTV. 1 August 2021. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "Assam Opposition Congress seeks disqualification of party MLA Sushanta Borgohain for quitting party" (in Indian English). The Hindu. 31 July 2021. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "Assam: Two-time Congress MLA Sushanta Borgohain joins BJP" (in ఇంగ్లీష్). The Indian Express. 1 August 2021. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "Jorhat Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "Assam MLA Sushanta Borgohain resigns from Congress". The Times of India. 31 July 2021. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "After Rupjyoti Kurmi, ex-Congress MLA Sushanta Borgohain joins BJP in Assam" (in ఇంగ్లీష్). India Today. 1 August 2021. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "Assam: After Ajanta Neog & Rupjyoti Kurmi, third Congress MLA Sushanta Borgohain likely to join BJP". The Times of India. 27 July 2021. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "2021 Thowra Assembly constituency By Poll Result". Election Commission of India. 2021. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.