సుశాంత సింగ్
స్వరూపం
సుశాంత సింగ్ | |
|---|---|
| జననం | 1973 మార్చి 17 బౌసెన్‌మోరా, ఒడిషా, భారతదేశం |
| మరణం | 2026 జూలై 27 (వయసు: 53) |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
సుశాంత సింగ్ (1973 మార్చి 17 - 2026 జూలై 27) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భట్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, కార్మిక & ఉద్యోగుల, రాష్ట్ర ఇన్సూరెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సుశాంత సింగ్ భట్లీ నియోజకవర్గం నుండి 2009లో తొలిసారి బిజూ జనతా దళ్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో రెండోసారి, 2019లో మూడోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] సుశాంత సింగ్ నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 29 మే 2019 న గ్రామీణాభివృద్ధి, కార్మిక & ఉద్యోగుల, రాష్ట్ర ఇన్సూరెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
ఇతను తన 53 వ ఏట 2026 జూలై 27 న మరణించాడు. [3]
మూలాలు
[మార్చు]- ↑ "Susanta Singh scores a hat-trick in Bhatli". 24 May 2019. the original నుండి 24 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 October 2022.
- ↑ 32. "Senior BJD Leader and Former Minister Sushant Singh Dies at 53 - Prameya News". prameyanews.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-07-28.
{{cite web}}:|last=has numeric name (help)