సుశీల కర్కి
సుశీల కర్కి ( నేపాలీ : सुशीला कार्की ) (జననం 7 జూన్ 1952 బిరత్‌నగర్) నేపాల్‌కు చెందిన న్యాయవాది, మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆమె నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి సీజేఐగా పనిచేసిన ఏకైక మహిళ.[1]
నేపాల్‌లో ఆందోళనల నేపథ్యంలో 2025లో ప్రధాని కేపీ శర్మ ఓలి సహా మంత్రులు రాజీనామా చేయడంతో జెన్ జెడ్ ముమ్ముర చర్చలు అనంతరం నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి పేరును సెప్టెంబర్ 10న ప్రకటించారు.[2][3] ఆమె సెప్టెంబర్ 12న నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[4][5]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సుశీల కర్కి 1952 జూన్ 7న మొరాంగ్ జిల్లాలోని బిరత్‌నగర్‌లో జన్మించింది. ఆమె మహేంద్ర మొరాంగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని ఆ తరువాత నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Nepal's First Woman Acting Chief Justice Sushila Karki Assumes Office". NDTV. 15 April 2016. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.
- ↑ "తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌గా సుశీలా కర్కి పేరును ప్రతిపాదించిన జెన్-జెడ్". NT News. 10 September 2025. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.
- ↑ "నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీల కర్కి". Andhrajyothy. 11 September 2025. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.
- ↑ "నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం". Eenadu. 12 September 2025. Archived from the original on 12 September 2025. Retrieved 12 September 2025.
- ↑ "నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం". Andhrajyothy. 12 September 2025. Archived from the original on 12 September 2025. Retrieved 12 September 2025.
- ↑ "నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కి.. ప్రతిపాదించిన జనరల్-జెడ్". TV9 Telugu. 10 September 2025. Archived from the original on 11 September 2025. Retrieved 11 September 2025.