Jump to content

సుషి

వికీపీడియా నుండి
సుషి

సుషి అనేది ఒక జపనీస్ సాంప్రదాయ వంటకం. దీనిని సాధారణంగా బియ్యం, వెనిగర్, చక్కెర, ఉప్పు వేసిన అన్నం, రకరకాల సముద్రపు ఆహారం, కూరగాయలు, మాంసం మొదలైన వాటితో తయారు చేస్తారు. వెనిగర్ కలిపిన అన్నాన్నే షారీ లేదా సుమేషీ అని అంటారు.[1] వివిధ రకాల చేపలతో కూడిన సుషి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కేవలం శాకాహారపు దినుసులతో కూడా సుషి తయారు చేస్తారు.

చరిత్ర

[మార్చు]

పచ్చి చేపలతో అన్నం కలపడం అనే జపనీస్ పద్ధతి నరేజుషి అనే ప్రాచీన వంటకం నుంచి వచ్చింది. ఈ పద్ధతిలో పులియబెట్టిన అన్నాన్ని చేపలతో కలిపి నెలలపాటు నిల్వ ఉంచేవారు. చేపను అన్నం, వెనిగర్, ఉప్పు మొదలైన వాటితో పులియబెట్టిన తర్వాత అన్నాన్ని వేరుచేసేవారు.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Sushi – How-To". FineCooking (in ఇంగ్లీష్). 1998-05-01. Archived from the original on 2019-11-04. Retrieved 2019-11-04.
  2. ↑ Lee, Cherl-Ho; Steinkraus, Keith H; Reilly, P.J. Alan (1993). Fish fermentation technology (in ఇంగ్లీష్). Tokyo: United Nation University Press. OCLC 395550059. Archived from the original on 2021-01-13. Retrieved 2021-06-17.
"https://te.wikipedia.org/w/index.php?title=సుషి&oldid=4807661" నుండి వెలికితీశారు