సుహాసిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుహాసిని
Suhasini01.jpg
సుహాసిని ముఖచిత్రం
జన్మ నామంసుహాసిని
జననం (1971-08-15) 1971 ఆగస్టు 15 (వయస్సు: 48  సంవత్సరాలు)
భార్య/భర్త మణిరత్నం
ప్రముఖ పాత్రలు సిరివెన్నెల
సంసారం ఒక చదరంగం
స్వాతి (సినిమా)

సుహాసిని (జ. 15 ఆగష్టు, 1971) ప్రముఖ దక్షిణ భారత నటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది.

సుహాసిని, ప్రసిద్ధ భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. 1988లో ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్నది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు.

1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె మరియు ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీ.శే. జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు. సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది.

ఈమె తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నది.

చిత్రసమాహారం[మార్చు]

నటిగా[మార్చు]

తెలుగు[మార్చు]

ఇతర భాషలు[మార్చు]

 • స్టంబుల్ (2003)
 • నమ్మల్ (2002)
 • తీర్‌తడనమ్ (2001)
 • వానప్రస్థమ్ (1999)
 • భారతీయం (1997)
 • అమృతవర్షిణి (1997)
 • చిన్న కన్నమ్మ (1993)
 • సమూహం (1993)
 • ముత్తిన హర (1990)
 • ఎన్ పురుషన్ దాన్ ఎనక్కుమ్ మాట్టుం దాన్ (1989)
 • ఒరు సయహ్నతింటే స్వప్నం (1989)

 • ధర్మాతిన్ తలైవన్ (1988)
 • ఎన్ బొమ్ముకుట్టి అమ్మవుక్కు (1988)
 • మణివాతరిల్లే ఆయిరం శివరాత్రిక (1987)
 • దూరత్తు పచ్చయ్ (1987)
 • మనత్తిల్ ఉరుత్తి వేండుం (1987)
 • రక్కుయిలిన్ రాజస్సదసిల్ (1986)
 • ప్రణామం (1986)
 • బంధన (1985)
 • కథ ఇథు వరే (1985)
 • సింధుభైరవి (1985)

 • ఆరోరు మర్యాతే (1984)
 • ఎంతె ఉపాసన (1984)
 • తాతమ్మే పూచ పూచ (1984)
 • అదమింతె వరియెల్లు (1983)
 • కూడెవిడె? (1983)
 • ఒరు ఇందియ కనవు (1983)
 • ఆగయ గంగై (1982)
 • గోపురంగళ్ సాయవత్తిల్లై (1982)
 • పలైవాన సొలై (1981)
 • నెంజతై కిల్లతే

దర్శకురాలిగా[మార్చు]

కథకురాలుగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

చిత్రమాల[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సుహాసిని&oldid=2427466" నుండి వెలికితీశారు